న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అశ్విన్‌ను ఎలా ఎదుర్కొన్నావ్.. ?, అందుకే బుమ్రాను తీసుకోమనేది'

India vs Australia: Travis Head to seek Harry Nielsens advice to tackle Ravichandran Ashwin

న్యూఢిల్లీ: టీమిండియా - ఆసీస్ టెస్టు సమరం కోసం ఇరుజట్లు చెమటోడ్చుతున్నాయి. ఈ క్రమంలో భారత్ జట్టు సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ని టెస్టు సిరీస్‌లో ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ సన్నద్ధమవుతున్నారు. టీ20 సిరీస్‌ సమం చేసుకున్న తర్వాత టెస్టు సిరీస్‌పై కన్నేసిన ఇరుజట్లు వార్మప్‌ మ్యాచ్‌ పూర్తి చేసుకున్నాయి. డిసెంబరు 6 నుంచి అడిలైడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. సిరీస్‌లో మొత్తం నాలుగు టెస్టులని రెండు జట్లూ ఆడనున్నాయి.

 రవిచంద్రన్ అశ్విన్ (2/122) పేలవ ప్రదర్శనతో

రవిచంద్రన్ అశ్విన్ (2/122) పేలవ ప్రదర్శనతో

డ్రాగా ముగిసిన ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రాణించగా.. బౌలర్లు మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ముఖ్యంగా.. ఎన్నో ఆశలు పెట్టుకున్న స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (2/122) పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. అతని బౌలింగ్‌ని సమర్థంగా ఎదుర్కొన్న ఎలెవన్ టీమ్ వికెట్ కీపర్ హ్యారీ నెల్సన్ 170 బంతుల్లో 9ఫోర్లతో (100) సెంచరీ బాదేశాడు. దీంతో.. ఇప్పుడు ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్.. అశ్విన్‌ని ఎదుర్కోవడంపై నెల్సన్‌ను సంప్రదించి సలహాలు తీసుకుంటున్నాడట.

 నెల్సన్ నుంచి సలహాలు తీసుకుంటున్నా

నెల్సన్ నుంచి సలహాలు తీసుకుంటున్నా

‘ఐపీఎల్‌ సమయంలో అశ్విన్ బౌలింగ్‌ను 2 సార్లు ఎదుర్కొన్నాను. కానీ.. టెస్టుల్లో మాత్రం అతని బౌలింగ్‌లో ఆడలేదు. అందుకే.. ఇప్పుడు నెల్సన్ నుంచి సలహాలు తీసుకుంటున్నా. సిడ్నీ వేదికగా ముగిసిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో నెల్సన్ చాలా చక్కగా అశ్విన్‌ని ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం ఆసీస్ జట్టులోనూ స్పిన్‌ని సమర్థంగా ఆడగలిగే బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. అయితే.. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌గా అశ్విన్‌ను ఎదుర్కోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నా' అని ట్రావిస్ హెడ్ వివరించాడు.

బుమ్రా లాస్ట్‌ వికెట్‌ తీయడంతో 544కు ఆలౌట్‌

ఇక వార్మప్‌ మ్యాచ్‌లో భారత ఫాస్ట్‌ బౌలర్‌ బుమ్రా తీసిన వికెట్‌ హైలైట్‌గా నిలిచింది. 65 బంతుల్లో 36 పరుగులు చేసి జోరుమీదున్న ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ జాక్సన్‌ కోల్‌మన్‌.. బుమ్రా విసిరిన బంతికి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. బుమ్రా లాస్ట్‌ వికెట్‌ తీయడంతో ఎలెవన్‌ జట్టు 544 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది.

బుమ్రా ఎంత ప్రమాదకరమో తెలిసొచ్చింది

బుమ్రా వికెట్‌ తీసిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘బుమ్రా బౌలింగ్ ఎంత ప్రమాదకరమో ఇప్పుడు ఆసీస్‌ జట్టుకు తెలిసొచ్చింది' అని, ‘అందుకే బుమ్రాను జట్టులోకి తీసుకోవాలనేది' అని ప్రశంసిస్తున్నారు. టీమిండియా-ఆసీస్‌ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ డిసెంబర్‌ 6 నుంచి మొదలు కానుంది.

Story first published: Sunday, December 2, 2018, 16:45 [IST]
Other articles published on Dec 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X