న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ చేతిలో ఓటమికి అసలు కారణం ఇదీ!: ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్

India Vs Australia : Tim Paine Accepts India Were Better Team | Oneindia Telugu
India Vs Australia: Tim Paine accepts India were better team

హైదరాబాద్: టీమిండియా బౌలింగ్ దళం అత్యుత్తమంగా ఉందని, ఈ సిరిస్ అసాంతం మాపై ఒత్తిడి కొనసాగించారని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ వ్యాఖ్యానించాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్‌ వర్షం కారణంగా ఈరోజు డ్రాగా ముగియగా.. నాలుగు టెస్టుల సిరీస్‌ని టీమిండియా 2-1తో కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

ఏది గొప్ప?: ఆసీస్ గడ్డపై టెస్టు సిరిస్ Vs 2011 వరల్డ్‌కప్ విజయంఏది గొప్ప?: ఆసీస్ గడ్డపై టెస్టు సిరిస్ Vs 2011 వరల్డ్‌కప్ విజయం

మ్యాచ్ అనంతరం టిమ్ పైన్ మాట్లాడుతూ "భారత బౌలింగ్‌ దళం అద్భుతంగా ఉంది. వారు సిరీస్‌ అసాంతం మాపై ఒత్తిడి కొనసాగించారు. తొలి టెస్టులో మాకు అంది వచ్చిన పలు అవకాశాలను చేజార్చుకోవడమే ఫలితాన్ని శాసించింది. అక్కడ పట్టు కొనసాగించి ఉంటే 2-1తో మేమే గెలిచేవాళ్లమేమో" అని టిమ్ పైన్ వెల్లడించాడు.

భారత్‌ను ఓడించగలమని

భారత్‌ను ఓడించగలమని

"సొంతగడ్డపై మేం భారత్‌ను ఓడించగలమని సిరీస్‌కు ముందు అనుకున్నాం. కానీ, భారత ఆటగాళ్లు కీలక సమయాల్లో జట్టును ఆదుకున్నారు. భారత్‌ నుంచి మేం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మా టాప్‌-7 పూర్తిగా విఫలమైంది" అని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ పేర్కొన్నాడు. 1947 నుంచి ఆస్ట్రేలియా పర్యటనకి 12 సార్లు వెళ్లిన భారత్ జట్టు.. అక్కడ టెస్టు సిరీస్‌ గెలవడం మాత్రం ఇదే తొలిసారి.

చరిత్ర సృష్టించిన కోహ్లీసేన

చరిత్ర సృష్టించిన కోహ్లీసేన

గతంలో 1980-81, 1985-86, 2003-04 పర్యటనల్లో భారత్‌ టెస్టు సిరిస్‌ను డ్రా చేసుకోగలిగింది కానీ, విజయం మాత్రం సాధించలేదు. ఇప్పటి వరకు ఆసీస్ గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో టీమిండియా 7 టెస్టుల్లో విజయం సాధించింది. తాజా టెస్ట్ సిరిస్ విజయంతో కోహ్లీసేన చరిత్ర సృష్టించింది.

72 ఏళ్ల నిరీక్షణకు తెర

72 ఏళ్ల నిరీక్షణకు తెర

దీంతో ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆస్ట్రేలియా జట్టుని ఆస్ట్రేలియాలో తొలిసారి ఓడించి టీమిండియా సగర్వంగా నిలిచింది. ఆసీస్ గడ్డపై నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను టీమిండియా గెలవడంలో భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ పుజారా క్రియాశీలక పాత్ర పోషించాడు. సిరీస్‌లో జరిగిన నాలుగు టెస్టుల్లో ఏకంగా మూడు సెంచరీలు నమోదు చేసిన అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

521 పరుగులతో టాప్ స్కోరర్‌గా పుజారా

521 పరుగులతో టాప్ స్కోరర్‌గా పుజారా

మొత్తం ఏడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మొత్తం 521 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించగా, పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో ఆసీస్‌ 146 పరుగుల తేడాతో నెగ్గింది. ఆ తర్వాత మెల్‌ బోర్న్‌ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 137 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించి సిరిస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది.

Story first published: Tuesday, January 8, 2019, 10:32 [IST]
Other articles published on Jan 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X