న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: ఫించ్‌కు 100వ వన్డే, కోహ్లీ ముంగిట మరో రికార్డు

India vs Australia: Statistical preview of the first ODI in Hyderabad

హైదరాబాద్: భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా శనివారం జరగనున్న తొలి వన్డేతో ప్రారంభం కానుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ గెలిచిన ఉత్సాహాంతో ఉన్న ఆస్ట్రేలియా వన్డే సిరిస్‌ను కూడా కైవసం చేసుకుని సొంతగడ్డపై జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది.

"Our Hero": వింగ్ కమాండర్ అభినందన్ కోసం బీసీసీఐ స్పెషల్ జెర్సీ

మరోవైపు టీ20 సిరిస్ ఓటమితో వన్డే సిరిస్‌ను గెలుపుతో ప్రారంభించాలని కోహ్లీసేన భావిస్తోంది. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య శనివారం మధ్యాహ్నాం 1.30 గంటలకు తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఉప్పల్‌ స్టేడియంలో తొలి వన్డే నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నమోదైన గణాంకాలను ఒక్కసారి పరిశీలిస్తే...

ఏడు వన్డేల్లో ఆరింటి భారత్‌ విజయం

ఏడు వన్డేల్లో ఆరింటి భారత్‌ విజయం

ఉప్పల్ స్టేడియంలో గత ఐదు మ్యాచుల్లో నాలుగింటిల్లో టాస్‌ గెలిచిన జట్టే విజయం సాధించడం విశేషం.

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య గత ఏడు వన్డేల్లో భారత్‌ ఆరింటిలో విజయం సాధించింది.

గత ఐదు మ్యాచుల్లో ఈ స్టేడియంలో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు మూడుసార్లు విజయం సాధించింది.

ఉప్పల్‌ స్టేడియంలో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు సగటు పరుగులు 286.

గతంలో ఈ స్టేడియంలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు వన్డేల్లో ఆస్ట్రేలియానే విజయం సాధించింది.

ఆరోన్ ఫించ్‌కి 100వ వన్డే

ఆరోన్ ఫించ్‌కి 100వ వన్డే

హైదరాబాద్ వన్డే ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌కి 100వ వన్డే.

వన్డే జట్టు కెప్టెన్‌గా ఆరోన్ ‌ఫించ్‌ సగటు 17.87 కాగా, ఆటగాడిగా 38.38. అలాగే కోహ్లీ కెప్టెన్‌గా సగటు 82.89 కాగా ఆటగాడిగా 51.29.

స్వదేశంలో గత ఐదుసార్లు 50కి పైగా పరుగులు చేసిన కోహ్లీ వాటిని సెంచరీలుగా మార్చాడు.

రోహిత్‌-ధావన్‌ల జోడీ మరో 77 పరుగులు చేస్తే వన్డేల్లో ఆస్ట్రేలియాపై వెయ్యి పరుగులు చేసిన రెండో జోడీగా చరిత్ర సృష్టిస్తుంది.

విరాట్ కోహ్లీ మరో 16 బౌండరీలు

విరాట్ కోహ్లీ మరో 16 బౌండరీలు

ఆసీస్ బౌలర్ జాసన్‌ బెహ్రెండార్ఫ్‌ ఏడు మ్యాచుల్లో ఇప్పటివరకూ శిఖర్‌ధావన్‌ను నాలుగుసార్లు ఔట్‌ చేశాడు. మరే ఇతర ఆసీస్ బౌలర్‌కు ఈ అవకాశం దక్కలేదు.

విరాట్ కోహ్లీ మరో 16 బౌండరీలు బాదితే వన్డేల్లో వెయ్యి ఫోర్లు కొట్టిన ఆటగాడిగా నిలుస్తాడు.

ఓపెనింగ్‌ జోడీల్లో శిఖర్‌ధావన్‌ ఇప్పటి వరకూ ఆరు సార్లు మాత్రమే బ్యాటింగ్‌ స్ట్రైక్‌ చేశాడు. మిగతా 116 సార్లు నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో కొనసాగాడు.

జడేజా మరో పది పరుగులు చేస్తే

జడేజా మరో పది పరుగులు చేస్తే

ఈ సిరిస్‌లో రవీంద్ర జడేజా మరో పది పరుగులు చేస్తే వన్డేల్లో రెండు వేల పరుగులు పూర్తి చేస్తాడు. వన్డేల్లో రెండు వేల పరుగులతో పాటు 150 వికెట్లు పడగొట్టిన 26వ ఆల్‌రౌండర్‌గా నిలుస్తాడు. భారత్‌ తరఫున కపిల్‌దేవ్‌, సచిన్ తర్వాత జడేజా మూడోస్థానంలో కొనసాగుతాడు.

ఈ సిరిస్‌లో మరో 92 పరుగులు చేస్తే మొత్తంగా 17 వేల పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. భారత్‌ తరఫున ఆరో ఆటగాడిగా నిలుస్తాడు. అంతకుముందు సచిన్‌(34,357), ద్రవిడ్‌(24,208), కోహ్లీ(19,409), గంగూలీ(18,575) సెహ్వాగ్‌ (17,253)లు ఈ జాబితాలో ఉన్నారు.

Story first published: Saturday, March 2, 2019, 11:56 [IST]
Other articles published on Mar 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X