న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆరేళ్ల చిన్నారితో కోహ్లీని అవుట్ చేస్తామంటూ ట్విట్టర్‌లో ఆసీస్ పోస్టు

India vs Australia: Six-year-old Aussie confident of dismissing Virat Kohli

న్యూ ఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా పట్ల ఆసీస్ చులకనగా ప్రవర్తిస్తోంది. రెండ్రోజుల ముందు ఓ మ్యాగజైన్‌లో టీమిండియా ముగ్గురు క్రికెటర్ల ఫొటోలు పోస్టు చేసి వణికిపోయే బ్యాటర్లు అంటూ పోస్టు చేసింది. ఇప్పుడేమో ఓ ఆరేళ్ల పిల్లాడితో కోహ్లీని అవుట్ చేయగలనంటూ తెలిపిన మాటలను ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా మధ్య రసవత్తరమైన టెస్టు సిరీస్‌కి ముందు ఇరు జట్ల ఆటగాళ్ల సవాళ్లు విసురుకుంటున్న వేళ ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారనున్నాయి.

బుడ్డోడితో కోహ్లీని అవుట్ చేస్తామంటూ:

కోహ్లీని ఔట్ చేస్తానంటూ రంగలోకి దిగాడు ఓ బుడతడు. అడిలైడ్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు ప్రారంభంకానుండగా.. ఆ మ్యాచ్‌ కోసం బుధవారం ప్రాక్టీస్ చేస్తున్న ఆస్ట్రేలియా జట్టుతో కలిసి ఆ పిల్లాడు కాసేపు ప్రాక్టీస్ కూడా చేశాడు. తన లెగ్ స్పిన్‌తో విరాట్ కోహ్లీ వికెట్ పడగొడతానని ఆరేళ్ల ఆర్చీ స్కిల్లర్ ధీమా వ్యక్తం చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

లెగ్ స్పిన్ వేసి పడగొడతానని

ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ నేరుగా ఫోన్ చేసి స్కిల్లర్‌తో మాట్లాడాడు. ఆసీస్ జట్టులోకి తీసుకుంటే ఏం చేస్తావంటే విరాట్ కోహ్లీని అవుట్ చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. నీకది అంత సులువా అంటే అవునంటూ చెప్పాడు. అవునా బౌలింగ్ చేస్తావా.. అంటే లెగ్ స్పిన్ వేస్తానని తెలిపాడు. మూడు గంటపాటు ఆస్ట్రేలియా జట్టు చేసిన ప్రాక్టీస్‌లో ఆ పిల్లాడు పాల్గొన్నాడు. ఆ తర్వాత చిన్నారితో ఆసీస్ జట్టు సభ్యులు సరదాగా ఫొటోలు దిగారు. వీటిని ఆస్ట్రేలియా అధికారిక ట్విట్టర్ ద్వారా తన అకౌంట్‌లో పోస్టు చేసింది.

నాలుగు సెంచరీలతో పాటు 692 పరుగులతో

నాలుగు సెంచరీలతో పాటు 692 పరుగులతో

ఆస్ట్రేలియా గడ్డపై 2014-15లో చివరిసారి భారత్ జట్టు టెస్టు సిరీస్ ఆడగా.. విరాట్ కోహ్లి నాలుగు సెంచరీలతో పాటు 692 పరుగులతో సత్తాచాటాడు. ఈ నేపథ్యంలో.. తాజాగా పర్యటనలోనూ అతను చెలరేగుతాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతుండగా.. ఆస్ట్రేలియా బౌలర్లు అతడ్ని నిలువరించేందుకు ప్రత్యేక వ్యూహాలు రూపొందిస్తున్నారు.

ఒక్కసారి కూడా టెస్టు సిరీస్‌ని గెలవలేక

ఒక్కసారి కూడా టెస్టు సిరీస్‌ని గెలవలేక

దీంతో.. పోరు కోహ్లి vs ఆస్ట్రేలియాగా మారిపోయింది. ఆస్ట్రేలియా గడ్డపై సుదీర్ఘ కాలంగా పర్యటిస్తున్న భారత్ జట్టు కనీసం ఒక్కసారి కూడా టెస్టు సిరీస్‌ని గెలవలేకపోయింది. దీంతో.. అందని ద్రాక్షగా మిగిలిపోయిన టెస్టు సిరీస్‌ని ఈసారి కైవసం చేసుకోవాలని కోహ్లీసేన ఉవ్విళ్లూరుతోంది.

Story first published: Wednesday, December 5, 2018, 12:05 [IST]
Other articles published on Dec 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X