న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి వన్డే.. అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్‌-ధావన్‌!!

IND VS AUS 2020 : Rohit Sharma, Shikhar Dhawan Eye On Huge Record ! || Oneindia Telugu
India vs Australia: Rohit Sharma, Shikhar Dhawan on cusp of special ODI record


ముంబై: జనవరి 14 నుండి భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సరీస్‌ ప్రారంభం కానుంది. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముంబైలోని వాంఖేడే స్టేడియంలో తొలి వన్డే జరుగనుంది. ఈ వన్డే కోసం ఇరు జట్లు వాంఖేడేలో తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. శ్రీలంకతో సిరీస్‌కు దూరంగా ఉన్న టీమిండియా వైస్‌ కెప్టెన్‌ 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ తిరిగి జట్టులో చేరాడు. ఈ రోజు వాంఖేడేలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసాడు రోహిత్.

పాకిస్థాన్‌కు షాక్.. టెస్టు సిరీస్‌ ఆడబోమని తేల్చి చెప్పిన బంగ్లా!!పాకిస్థాన్‌కు షాక్.. టెస్టు సిరీస్‌ ఆడబోమని తేల్చి చెప్పిన బంగ్లా!!

అరుదైన రికార్డుపై రోహిత్‌-ధావన్‌ కన్ను:

అరుదైన రికార్డుపై రోహిత్‌-ధావన్‌ కన్ను:

తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్‌ ఓ అరుదైన రికార్డుపై కన్నేశారు. రోహిత్‌-ధావన్‌ ఆస్ట్రేలియాపై సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పితే.. వన్డేల్లో ఒకే జట్టుపై అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు సాధించిన జోడీగా రికార్డు సృష్టిస్తారు. ప్రస్తుతం వెస్టిండీస్ ఆటగాళ్లు గ్రీనిడ్జ్‌-హేన్స్‌ జంటతో (భారత్‌పై 6) కలిసి రోహిత్‌-ధావన్‌ సమంగా నిలిచారు. ఇక మూడో స్థానంలో ఎంఎస్ ధోనీ-యువరాజ్‌ సింగ్ జంట ఉంది. వీరిద్దరూ కలిసి పాకిస్థాన్‌పై ఐదు సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పారు.

22 ఇన్నింగ్స్‌ల్లో 1,273 పరుగులు:

22 ఇన్నింగ్స్‌ల్లో 1,273 పరుగులు:

ఆస్ట్రేలియాపై రోహిత్-ధావన్‌లకు మంచి రికార్డు ఉంది. వీరిద్దరు కలిసి ఆసీస్‌పై 22 ఇన్నింగ్స్‌ల్లో 1,273 పరుగులు చేశారు. ఈ రికార్డు చూస్తే గ్రీనిడ్జ్‌-హేన్స్‌ జంటను అధిగమించే అవకాశం ఉంది. మరోవైపు హిట్‌మ్యాన్‌ పరుగుల వరద పారిస్తూ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇక ధావన్ కూడా శ్రీలంకపై హాఫ్ సెంచరీ బాది టచ్‌లోకి వచ్చాడు.

ఓపెనర్లుగా రోహిత్‌-ధావన్‌:

ఓపెనర్లుగా రోహిత్‌-ధావన్‌:

ధావన్ గాయం కారణంగా ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. ధావన్‌ కూడా శ్రీలంకపై అర్ధ శతకం బాదడంతో పోటీ తీవ్రమైంది. అయితే రాహుల్‌ను నాలుగో స్థానంలో పంపించి.. రోహిత్‌-ధావన్‌ను ఓపెనర్లుగా పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం:

మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం:

ప్రస్తుత సిరీస్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు వన్డేలు ఆడనుంది. ముంబై వేదికగా మంగళవారం తొలి మ్యాచ్ జరగనుంది. జనవరి 17న రాజ్‌కోట్‌లో రెండో వన్డే, జనవరి 19న బెంగళూరులో మూడో మ్యాచ్ జరగనుంది. అన్ని మ్యాచులు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

భారత వన్డే జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), చాహల్, కుల్దీప్ యాదవ్, నవదీప్ షైనీ, జస్‌ప్రీత్ బుమ్రా, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ షమీ.

Story first published: Monday, January 13, 2020, 15:35 [IST]
Other articles published on Jan 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X