న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: ప్రపంచ రికార్డుకి రెండు మ్యాచ్‌ల దూరంలో ధోని

MS Dhoni On Verge Of Another World Record As Wicket-Keeper | Oneindia Telugu
India vs Australia: MS Dhoni looks to beat Mark Boucher to another World Record as wicket-keeper

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డుకి అడుగు దూరంలో నిలిచాడు. టీమిండియా తరుపున వికెట్ కీపర్‌గా మహేంద్ర సింగ్ ధోని ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 594 మ్యాచ్‌లకి ప్రాతినిథ్యం వహించాడు. మరో రెండు మ్యాచ్‌ల్లో ధోని ఆడితే, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన వికెట్‌ కీపర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు.

జీవితకాల నిషేధం విధించాలి: మాజీ క్రికెటర్‌పై హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు, సైకిల్ చైన్లతో దాడిజీవితకాల నిషేధం విధించాలి: మాజీ క్రికెటర్‌పై హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు, సైకిల్ చైన్లతో దాడి

అగ్రస్థానంలో మార్క్ బౌచర్

అగ్రస్థానంలో మార్క్ బౌచర్

ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ 596 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఆతడి తర్వాత మహేంద్రసింగ్ ధోని (594)తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మూడో స్థానంలో శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగక్కర 499 మ్యాచ్‌లతో ఉండగా... ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్(485)తో నాలుగో స్థానంలొ ఉన్నాడు.

ఫిబ్రవరి 24 నుంచి ఆస్ట్రేలియాతో సిరిస్

ఫిబ్రవరి 24 నుంచి ఆస్ట్రేలియాతో సిరిస్

ఫిబ్రవరి 24 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సొంతగడ్డపై సుదీర్ఘ సిరిస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరస్‌లో ధోని అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక మ్యాచ్‌లాడిన వికెట్ కీపర్ రికార్డుని అందుకోనున్నాడు.

ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న ధోని

ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న ధోని

గతేడాది పేలవ ఫామ్‌తో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయిన ధోనీ.. ఈ ఏడాది ఆరంభంలోనే ఆస్ట్రేలియాపై మూడు వన్డేల సిరీస్‌లో ‘హ్యాట్రిక్' హాఫ్ సెంచరీలు బాది ఫామ్‌లోకి వచ్చాడు. ఇటీవల న్యూజిలాండ్ గడ్డపై ముగిసిన ఐదు వన్డేల సిరీస్, మూడు టీ20ల సిరీస్‌లోనూ ధోని చెలరేగాడు. దీంతో ఈ ఏడాది మే నెలలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో ధోని ఆడటంపై గత కొంతకాలంగా నెలకొన్న అనుమానాలు పూర్తిగా తొలగిపోయాయి.

Story first published: Tuesday, February 12, 2019, 17:07 [IST]
Other articles published on Feb 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X