
82 ఓవర్ తర్వాత ఆసీస్ చేతికి రెండో కొత్త బంతి
చివరి సెషన్‌లో 82 ఓవర్ తర్వాత ఆస్ట్రేలియా రెండో కొత్త బంతిని తీసుకుంది. అప్పటికే క్రీజులో పాతుకుపోయి నిలకడగా ఆడుతోన్న పుజారా-కోహ్లీ భాగస్వామ్యాన్ని విడదీయడానికి ఆసీస్ పేసర్లు గంటకు 150 కిమీ వేగంతో బంతులేశారు. 83వ ఓవర్లో 47 పరుగుల వద్దనున్న కోహ్లీ.. 89 ఓవర్లు ముగిసేవరకు కనీసం ఒక్క పరుగు కూడా చేయలేకపోవడం గమనార్హం.
చాలా జాగ్రత్తగా ఆడిన విరాట్ కోహ్లీ
ఇన్నింగ్స్ 83వ ఓవర్‌లో స్టార్క్ కొత్త బంతిని అందుకున్నాడు. అందుకే, అతనికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు కోహ్లీ చాలా జాగ్రత్తగా ఆడాడు. అయినప్పటికీ 87వ ఓవర్‌లో ఆసీస్‌కు కోహ్లీ వికెట్ తీసే అవకాశం వచ్చింది. స్టార్క్ వేసిన ఈ ఓవర్‌లోని రెండో బంతి కోహ్లీ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కీపర్ చేతుల్లోకి వెళ్లింది.
బౌండరీని తాకిన బంతిని చూసి నవ్విన స్టార్క్
అయితే క్లిష్టమైన ఈ క్యాచ్‌ను ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ జారవిడిచాడు. ఆ తర్వాత స్టార్క్ విసిరిన బంతి వికెట్ కీపర్ టిమ్ పైన్‌కు కూడా అందనంత ఎత్తులో వెళ్లి బౌండరీని తాకింది. ఈ బంతిని చూసి స్టార్క్ సైతం నవ్వు ఆపుకోలేకపోయాడు. బంతిని ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ సైతం ఆ బౌన్సర్‌కు ఆశ్చర్యపోయాడు.

బౌన్సర్లతో భారత బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టిన ఆసీస్ బౌలర్లు
తొలిరోజు ఆటలో భాగంగా ఆసీస్ పేసర్లను ఎదుర్కోడానికి కోహ్లీతో పాటు మిగతా బ్యాట్స్‌మెన్ కూడా బాగానే కష్టపడాల్సి వచ్చింది. పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజల్‌వుడ్, మిచెల్ మార్ష్‌లు బౌన్సర్లతో భయపెట్టారు. కమ్మిన్స్ బౌలింగ్‌లో బంతి హనుమ విహారి హెల్మెట్‌కు బలంగా తాకింది. అలాగే తొలి రోజు హాఫ్ సెంచరీతో రాణించిన మయాంక్ అగర్వాల్‌కు కూడా రెండు సార్లు బౌన్సర్లు చాతి, వీపుపై తగిలాయి.


Click it and Unblock the Notifications












