న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

71 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్ రికార్డు

Ind vs Aus 3rd Test: Mayank Agarwal Breaks 71-Year-Old Indian Record On Test Debut In Australia
India Vs Australia: Mayank Agarwal becomes first Indian opener in 71 years to debut on Aussie soil

హైదరాబాద్: భారత్ తరుపున టెస్టు క్రికెట్ ఆడాలన్న అతడి కల నిజమైంది. ప్రతిష్టాత్మక మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో భారత్ తరుపున బుధవారం 295 టెస్టు క్రికెటర్‌గా ఆతిథ్య ఆస్ట్రేలియాపై ఓపెనర్‌గా అరంగేట్రం చేశాడు. తద్వారా మయాంక్ అగర్వాల్ ఓ అరుదైన ఘనత సాధించాడు.

<strong>ట్యాంపరింగ్ చేయమని చెప్పింది అతనే..: బాన్‌క్రాఫ్ట్</strong>ట్యాంపరింగ్ చేయమని చెప్పింది అతనే..: బాన్‌క్రాఫ్ట్

1947 తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై మయాంక్ అగర్వాల్ రూపంలో ఓ భారత బ్యాట్స్‌మన్ ఓపెనర్‌గా క్రీజులోకి అడుగుపెట్టాడు. మయాంక్‌కు ముందు డిసెంబర్‌, 1947న సిడ్నీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ తరుపున అమిర్ ఎలాహి ఓపెనర్‌గా బరిలోకి దిగి... తొలి ఇన్నింగ్స్‌లో 10 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.

ఆస్ట్రేలియా గడ్డపై బాక్సింగ్ డే టెస్టులో

ఆస్ట్రేలియా గడ్డపై బాక్సింగ్ డే టెస్టులో హనుమ విహారితో కలిసి మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్‌ జోడీగా మైదానంలోకి అడుగుపెట్టాడు. భారత్ తరుపున టెస్టుల్లో ఇది మూడో కొత్త ఓపెనింగ్ జోడి కావడం విశేషం. అంతకముందు జె నవ్లీ, ఎన్ జోమాల్(1932 లార్డ్స్ టెస్టు), డి హిందల్కర్, వి మర్చంట్ (1936, లార్డ్ టెస్టు)లు మాత్రమే ఓపెనింగ్ జోడీలుగా ఉన్నారు. బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మయాంక్ అగర్వాల్, హనుమ విహారి ఓపెనర్లుగా వచ్చారు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ ద్వారా అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా మయాంక్ చరిత్ర సృష్టించాడు.

ఓపెనర్‌గా విఫలమైన హనుమ విహారి

ఓపెనర్‌గా విఫలమైన హనుమ విహారి

ఓపెనర్‌గా విహారి విఫలమైన మయాంక్ శుభారంభాన్ని ఇచ్చాడు. ప్యాట్ కమ్మిన్స్ విసిరిన బౌన్సర్‌ను అంచనా వేయలేకపోయిన హనుమ విహారి(8) పరుగుల వద్ద స్లిప్‌లో ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 40 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి మయాంక్ అగర్వాల్ (76; 161 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్)రెండో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. పాట్ కమ్మిన్స్ వేసిన బౌన్సర్‌ను అంచనా వేయడంలో తికమక పడిన మయాంక్ అగర్వాల్ దానిని డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి చేతి గ్లౌజులను రాసుకుంటూ కీపర్ టిమ్ పైన్ చేతిలో పడింది.

టీ విరామానికి ముందే మయాంక్ ఔట్

టీ విరామానికి ముందే మయాంక్ ఔట్

దీంతో ఓ మంచి ఇన్నింగ్స్‌కు తెరపడినట్లయింది. మయాంక్ ఔట్ కాగానే అంపైర్లు టీ విరామాన్ని ప్రకటించారు. టీ విరామ సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. పుజారా 33 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మయాంక్, పుజారా కలిసి రెండో వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతకముందు మయాంక్ అగర్వాల్ అదరగొట్టాడు. తన తొలి అంతర్జాతీయ టెస్టులోనే హాఫ్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా

ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా

తనకు ఇది తొలి టెస్టే అయినా ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా బలమైన ఆసీస్ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొని ఆస్ట్రేలియా గడ్డపై ఆరంగేట్ర టెస్టులోనే హాఫ్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా మయాంక్ రికార్డు సాధించాడు. 1947 డిసెంబర్‌లో సిడ్నీలో జరిగిన టెస్ట్‌లో దత్తు ఫాడ్కర్(51) హాఫ్ సెంచరీ చేశాడు. ఆసీస్ గడ్డపై ఆరంగేట్ర టెస్టులో హాఫ్ సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. మళ్లీ 71 సంవత్సరాల తరవాత మయాంక్ రూపంలో మరో భారత బ్యాట్స్‌మన్‌గా ఈ ఘనత సాధించాడు.

1
43625
Story first published: Wednesday, December 26, 2018, 13:34 [IST]
Other articles published on Dec 26, 2018
Read in English: Mayank makes his Test debut
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X