న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: భారత్ తరుపున రెండో బౌలర్‌గా బుమ్రా అరుదైన రికార్డు

India VS Australia T20 : What an Over ! 2 Runs, 2 Wickets; Bumrah Bowls Near-Perfect 19th Over
India vs Australia: Jasprit Bumrah becomes second Indian bowler to achieve THIS in T20Is

హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన బుమ్రా అంతర్జాతీయ టీ20ల్లో 50 వికెట్లు పూర్తి చేసిన రెండో భారత బౌలర్‌గా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

<strong>తొలి టీ20లో భారత్ ఓటమి: ధోని అతి విశ్వాసమే కొంప ముంచిందా?</strong>తొలి టీ20లో భారత్ ఓటమి: ధోని అతి విశ్వాసమే కొంప ముంచిందా?

భారత్ తరుపున బుమ్రా (51) వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా... టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ (52) వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్‌ వేసి మూడు వికెట్లు తీసి 16 పరుగులు సమర్పించుకున్నాడు.

ముఖ్యంగా ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో బుమ్రా తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన బుమ్రా కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ ఓవర్‌ ఐదో బంతికి హ్యాండ్‌ స్కాంబ్‌ను ఔట్‌ చేసిన బుమ్రా.. ఆరో బంతికి కౌల్టర్‌ నైల్‌ను బౌల్డ్‌ చేశాడు. ముఖ్యంగా కౌల్టర్‌నైల్‌ను బౌల్డ్‌ చేసిన బంతి గురించి ఎంత చెప్పినా తక్కువే.

బుమ్రా వేసిన ఇన్‌స్వింగ్‌ యార్కర్‌కు కౌల్టర్‌ నైల్‌ దగ్గర సమాధానమే లేదు. వికెట్ సైతం అమాంతం గాల్లోకి ఎగిరింది. ఆ బంతిని చూసిన అబిమానులు సైతం అవాక్కయ్యారు. తొలి బంతికి కమిన్స్‌ సింగిల్‌. రెండో బంతిని డీప్‌ స్క్వేర్‌లెగ్‌లో బౌండరీకి తరలించాడు రిచర్డ్‌సన్‌. ఆ తర్వాతి బంతికి 2 పరుగులు. నాలుగో బంతికి సింగిల్‌.

చివరి రెండు బంతుల్లో ఆసీస్ విజయానికి ఆరు పరుగులు అవసరమయ్యాయి. ఆఫ్‌ స్టంప్‌ ఆవల ఉమేశ్‌ వేసిన ఫుల్‌టాస్‌ బంతిని కమిన్స్‌ కవర్స్‌లో బౌండరీకి తరలించాడు. దీంతో ఆఖరి బంతికి 2 పరుగులు అవసరమయ్యాయి. వికెట్లను లక్ష్యంగా చేసుకుని వేసిన బంతిని కమిన్స్‌ స్ట్రెయిట్‌గా ఆడాడు.

ఆ బంతికి రెండు పరుగులు పూర్తి చేయడంతో ఆస్టేలియా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్లు తేడాతో విజయం సాధించింది. దీంతో ఆసీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య బుధవారం బెంగళూరు వేదికగా రెండో టీ20 జరగనుంది.

Story first published: Monday, February 25, 2019, 13:25 [IST]
Other articles published on Feb 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X