
ధోని మాట్లాడుతూ
మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ "నేను నాలుగో స్థానంలో ఆడినా ఆరో స్థానంలో ఆడినా జట్టు సమతూకం గురించి ఆలోచించాలి. ఆరో స్థానంలో ఆడేందుకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ జట్టు కోసం ఎక్కడైనా ఆడేందుకు సిద్ధమే. పిచ్ నెమ్మదిగా ఉండటం వల్ల షాట్లు ఆడటం కష్టంగా మారింది. అందుకే మ్యాచ్ చివరి వరకు వెళ్లింది" అని అన్నాడు.

మూడో వన్డేలో నాలుగో స్థానంలో
తొలి రెండు వన్డేల్లోనూ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన ధోని.. మూడో వన్డేలో అంబటి రాయుడిపై వేటు పడటంతో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు. మూడో వన్డేలో మహేంద్రసింగ్ ధోని (87 నాటౌట్), కేదార్ జాదవ్ (61 నాటౌట్) అజేయ అర్ధశతకాలు బాదడంతో 231 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన సంగతి తెలిసిందే.

2-1తో సిరిస్ నెగ్గిన టీమిండియా
దీంతో మూడు వన్డేల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకుంది. అంతేకాదు ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి. ఒక్క ఫార్మాట్లో కూడా సిరీస్ కోల్పోకుండా ఆసీస్ పర్యటనను ముగించిన తొలి జట్టుగా టీమిండియా అరుదైన ఘనత సాధించింది.

ధోని ఖాతాలో అరుదైన రికార్డు
ఈ సిరిస్‌లో ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్' గెలవడంతో ధోని ఖాతాలో అరుదైన రికార్డు నమోదైంది. అత్యంత పెద్ద వయసు (37 ఏళ్ల 195 రోజులు)లో ఈ అవార్డు గెలిచిన భారత ఆటగాడు ధోనీయే. గావస్కర్ (37 ఏళ్ల 191 రోజులు, 1987లో శ్రీలంకపై) రికార్డును ధోని బద్దలు కొట్టాడు.