న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నచ్చావ్ సిరాజ్.. నీ క్రీడా స్పూర్తికి సలాం!

India vs Australia A: Mohammed Siraj’s spirit of cricket wins hearts

హైదరాబాద్: టీమిండియా పేసర్, హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌పై యావత్ క్రికెట్ ప్రపంచం ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరుగుతున్న సన్నాహక మ్యాచ్‌లో ఈ హైదరాబాద్ గల్లీ బాయ్ చూపించిన క్రీడా స్పూర్తికి సలాం కొడుతోంది. శెభాష్ సిరాజ్ అంటూ ఆకాశానికెత్తుతుంది. మైదానంలో సిరాజ్ చూపించిన మానవత్వానికి మాజీ, సహచర క్రికెటర్లతో పాటు విశ్లేషకులు, అభిమానులు ఫిదా అయ్యారు. సోషల్ మీడియా వేదికగా అతను చేసిన పనిని కొనియాడుతున్నారు. #SpiritofCricket, #mohammadsiraj అనే యాష్ ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్నారు.

ఆసీస్ ఆల్‌రౌండర్‌కు గాయం..

గులాబీ సన్నాహక మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ సందర్భంగా ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్‌ గ్రీన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. భారత బ్యాట్స్‌మన్ జస్‌ప్రీత్ బుమ్రా కొట్టినా షాట్ నేరుగా గ్రీన్ ముఖానికి తగిలింది. దాంతో గ్రీన్ కుప్పకూలగా.. నాన్‌స్ట్రైకర్‌‌గా ఉన్న సిరాజ్‌ పరుగు పూర్తి చేయకుండా నేరుగా గ్రీన్ దగ్గరకు వెళ్లి గాయాన్ని పరిశీలించాడు. పరుగు కన్నా అతని గాయానికే ప్రాధాన్యత ఇచ్చి క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ

#SpiritofCricket అనే యాష్ ట్యాగ్‌తో ట్విటర్ వేదికగా పంచుకోగా వైరల్ అయింది.

సూపర్ సిరాజ్..

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు సిరాజ్‌ను కొనియాడుతున్నారు. ‘మానవత్వమే అన్నిటి కన్నా ముఖ్యమని నిరూపించావు బ్రదర్. హ్యాట్సాఫ్'అని ఒకరు ట్వీట్ చేయగా.. ‘వారెవ్వా ఏం క్రీడా స్పూర్తి. పరుగు తీయకుండా నేరుగా గ్రీన్ దగ్గరకు వెళ్లాడు. సూపర్ సిరాజ్'అని ఇంకొకరు కామెంట్ చేశారు. నచ్చేశావ్ సిరాజ్ అని మరికొందరూ ఈ వీడియోను రీట్వీట్ చేస్తున్నారు. ఇక ఫిజియో వచ్చి చికిత్స అందించిన అనంతరం గ్రీన్ మైదానాన్ని వీడాడు. అయితే అతడికి కంకషన్‌ స్వల్ప లక్షణాలు కనిపించాయని జట్టు వైద్యులు తెలిపారు. అతడి స్థానంలో పాట్రిక్‌ మైదానంలోకి వచ్చాడు. కాగా, తొలి వామప్‌ మ్యాచ్‌లో గ్రీన్ సెంచరీ చేయగా.. పకోస్కీ కూడా కంకషన్‌కు గురైన సంగతి తెలిసిందే. కార్తిక్‌ త్యాగి విసిరిన బౌన్సర్‌ అతని తలకు బలంగా తగిలింది.

బుమ్రా ఆల్‌రౌండ్ షో..

ఈ మూడు రోజుల వామప్ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ విఫలమైనా.. మహ్మద్ షమీ (3/29), నవ్‌దీప్ సైనీ (3/19), జస్‌ప్రీత్ బుమ్రా (2/33)లతో కూడిన పేస్ త్రయం రప్ఫాడించడంతో భారత జట్టు పై చేయి సాధించింది. భారత బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా ఏ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 108 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో అలెక్స్‌ క్యారీ (32), హ్యారిస్‌ (26) టాప్ స్కోరర్లు కాగా.. నలుగురు బ్యాట్స్‌మెన్‌ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌ చేసిన భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌‌ను 194 పరుగులకు ముగించింది. శుభ్‌మన్‌ గిల్ (43), పృథ్వీ షా (40) మినహా మిగిలిన బ్యాట్స్‌మన్‌ తేలిపోయిన వేళ జస్‌ప్రీత్ బుమ్రా (55 నాటౌట్) అజేయ అర్ధశతకంతో సత్తా చాటాడు.

Story first published: Friday, December 11, 2020, 21:41 [IST]
Other articles published on Dec 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X