న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

9 సార్లు టీమిండియాదే: సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే ఆఖరి వన్డే

India Vs Australia 2019 : The Final Firoz Shah kotla Match Will Decide Who Is The Winner Of Series
India vs Australia, 5th ODI: Team India win record in a bilateral series final match

హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న సుదీర్ఘ పర్యటన ముగింపు దశకు చేరుకుంది. భారత్‌లో సుదీర్ఘ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ఈ సిరిస్‌లో బుధవారం చివరి మ్యాచ్ ఆడబోతోంది. తొలుత జరిగిన రెండు టీ20ల సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా ఆ తర్వాత జరిగిన వన్డే సిరిస్‌లో తడబడింది. తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలైన ఆస్ట్రేలియా ఆ తర్వాత అనూహ్యాంగా పుంజుకుని రెండు వన్డేల్లో విజయం సాధించింది.

'ఆస్ట్రేలియా పర్యటన మాదిరి వరల్డ్‌కప్‌లో మార్పులు ఉండవు''ఆస్ట్రేలియా పర్యటన మాదిరి వరల్డ్‌కప్‌లో మార్పులు ఉండవు'

2-2తో సిరిస్ సమం

2-2తో సిరిస్ సమం

దీంతో సిరిస్ 2-2తో సమం అయింది. దీంతో బుధవారం ఢిల్లీ వేదికగా జరగనున్న ఆఖరి వన్డే ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ కైవసం చేసుకోవాలని ఇరు జట్లు గట్టి పట్టుదలగా ఉన్నాయి. ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించి సొంతగడ్డపై ఎదురైన పరాభవానికి ఎలాగైనా బదులు తీర్చుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తుండగా.. వరల్డ్‌కప్‌కు ముందు సిరీస్‌ నెగ్గి ఆత్మవిశ్వాసంతో మెగా టోర్నీలో పాల్గొనాలని కోహ్లీసేన భావిస్తోంది.

భారత్ తలపడిన ద్వైపాక్షిక సిరీస్‌లో 11 సార్లు

భారత్ తలపడిన ద్వైపాక్షిక సిరీస్‌లో 11 సార్లు

2015 వరల్డ్‌కప్ తర్వాత టీమిండియా తలపడిన ద్వైపాక్షిక సిరీస్‌లో 11 సార్లు (సిరీస్‌ విజేతను నిర్ణయించే మ్యాచ్‌) మ్యాచ్‌ ద్వారానే విజయం ఆయా జట్ల సొంతమైంది. ఇలాంటి సందర్భాల్లో కేవలం రెండు సార్లు మినహా మిగిలిన అన్ని సార్లు టీమిండియానే విజయం సాధించింది. 2015-2016 సీజన్‌లో ముంబైలో దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఓడిపోగా... 2018-2019 సీజన్‌లో ఇంగ్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన సిరీస్‌ కోల్పోయింది.

మిగతా తొమ్మిదిసార్లూ టీమిండియాదే విజయం

మిగతా తొమ్మిదిసార్లూ టీమిండియాదే విజయం

మిగతా తొమ్మిదిసార్లూ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో నిర్ణయాత్మక మ్యాచ్‌లను భారత్ సొంతం చేసుకుంది. దీంతో ఢిల్లీలో బుధవారం మధ్యాహ్నాం జరగనున్న ఆఖరి వన్డేపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు 2009లో ఆస్ట్రేలియా ఇక్కడ ద్వైపాక్షిక సిరీస్ గెలిచింది. అయితే సిరీస్‌లో 0-2తో వెనుకబడ్డ సందర్భాలలో భారత్ వన్డే సిరీస్ గెలిచిన దాఖలాల్లేవు.

భారత్-ఆసీస్ మధ్య చివరి ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఇది

భారత్-ఆసీస్ మధ్య చివరి ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఇది

2020లో వన్డే లీగ్ మొదలుకానున్న నేపథ్యంలో.. భారత్-ఆసీస్ మధ్య చివరి ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఇది. ఇక నుంచి జరుగబోయే ప్రతి సిరీస్‌లో మూడు మ్యాచ్‌లే ఉంటాయి. గత రెండు మ్యాచ్‌ల్లో ఇక్కడ భారీ స్కోర్లు నమోదు కాలేదు. 2016 అక్టోబర్‌లో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమ్‌ఇండియా.. 2014లో మాత్రం విండీస్‌పై 48 పరుగుల తేడాతో గెలిచింది

1
45589
Story first published: Wednesday, March 13, 2019, 12:55 [IST]
Other articles published on Mar 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X