న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాంచీ టెస్టు, డే3: సెంచరీతో అడ్డుపడ్డ పుజారా, భారత్ 360/6

తన కెరీర్‌లో 50వ టెస్టు ఆడుతున్న మురళీ విజయ్ అర్ధసెంచరీని సాధించాడు. ఆసీస్ స్పిన్నర్ ఓకీప్ వేసిన 50వ ఓవర్‌ తొలి బంతికి సింగిల్ తీసి మురళీ విజయ్ నాలుగు ఫోర్లు, ఒక సిక్సు సాయంతో అర్ధసెంచరీని నమోదు చేశాడ

By Nageshwara Rao

హైదరాబాద్: రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ముూడో టెస్టులో టీమిండియా దీటుగా ఆడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసింది. చటేశ్వర పుజారా 130, వృద్ధిమాన్ సాహా 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. 10 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్‌కు దిగిన పూజారా శనివారం ఆటలో ఆస్ట్రేలియా బౌలర్లకు పరీక్షగా నిలిచాడు.

దీంతో మూడో టెస్టులో కోహ్లీసేన నిలబడింది. రెండో సెషన్లలో కూడా భారత్ తన ఆధిపత్యం కొనసాగించింది. మూడో రోజు ఆసీస్ బౌలర్లను అడ్డుకోగలిగినా స్వదేశంలో చూపాల్సిన ఆటతీరును మాత్రం చూపించలేదు. 120/1 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 91 పరుగుల వెనుకంజలో ఉంది.

కోహ్లీ (6), రహానే (14), కరుణ్ నాయర్ (23), అశ్విన్ (3) పేలవంగా ఆడారు. తన సహచరులంతా పెవిలియన్‌కు చేరినా పుజారా సెంచరీతో రాణించి ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్‌ నాలుగు వికెట్లు తీసుకోగా హాజెల్ ఉడ్, ఓకీఫ్ చెరో వికెట్ తీసుకున్నారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 451 పరుగులకు ఆలౌటైంది.


మూడో రోజు ఆట సాగిందిలా:

6వ వికెట్ కోల్పోయిన టీమిండియా

ఆస్ట్రేలియా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. ఆసీస్ బౌలర్‌ కమ్మిన్స్‌ చక్కని లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బౌలింగ్‌తో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను ఒక్కొక్కరిగా అవుట్ చేస్తున్నాడు. కమ్మిన్స్ వేసిన బంతిని ఆడే క్రమంలో అశ్విన్ 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కీపర్ వేడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అంతకముందు ఇదే తరహా బంతులతో కేఎల్‌ రాహుల్‌, కోహ్లీ, రహానేను అవుట్ చేశాడు. తొలుత అశ్విన్‌ను అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే ఆసీస్ రివ్యూ కోరడంతో అందులో అవుట్ అని తేలింది. అశ్విన్ అవుటైన తర్వాత సాహా క్రీజులోకి వచ్చాడు. 124 ఓవర్లకు గాను భారత్ 6 వికెట్లు కోల్పోయి 346 పరుగులు చేసింది. ప్రస్తుతం పుజారా 125, సాహా 9 పరుగులతో ఉన్నారు.

ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా
ఆస్ట్రేలియా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు మాత్రమే చేసిన కరుణ్ నాయర్ హాజెల్‌వుడ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. దీంతో 114 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ అవుటైన తర్వాత క్రీజులోకి రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు. ప్రస్తుతం పుజారా 117, అశ్విన్‌ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఇంకా 129 పరుగులు వెనుకబడి ఉంది.

టెస్టుల్లో 11 సెంచరీ నమోదు చేసిన పుజారా
రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఆటగాడు పుజారా సెంచరీ నమోదు చేశాడు. 218 బంతులను ఎదుర్కొన్న పుజారా 14 ఫోర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేశాడు. టెస్టుల్లో పుజారాకి ఇది 11వ సెంచరీ కావడం విశేషం. దీంతో 94 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. ప్రస్తుతం పుజారా 104, కరుణ్ నాయర్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా

రాంచీ టెస్టులో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఆసీస్ పేసర్ కమ్మిన్స్ బౌలింగ్‌లో వేడ్‌కు క్యాచ్ ఇచ్చి రహానే పెవిలియన్‌కు చేరాడు. 33 బంతులను ఎదుర్కొన్న రహానే 2 ఫోర్ల సాయంతో 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. దీంతో జట్టు స్కోరు 276 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. రహానే అవుటైన తర్వాత కరుణ్ నాయర్ క్రీజులోకి వచ్చాడు. మరో ఎండ్‌లో పుజారా అద్భుతంగా ఆడుతూ సెంచరీకి చేరువయ్యాడు. 92 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయిన భారత్ 276 పరుగులు చేసింది. ప్రస్తుతం పుజారా 95, కరుణ్ నాయర్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. భారత్ ఇంకా 175 పరుగులు వెనుకబడి ఉంది.

మళ్లీ నిరాశపర్చిన కోహ్లీ

రాంచీ టెస్టులో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఎన్నో అనుమానాల మధ్య బ్యాటింగ్‌‌కు దిగిన కోహ్లీ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. ఆసీస్ పేసర్ కమ్మిన్స్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లీ అవుటయ్యాడు. 23 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 6 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. కొత్త బంతి తీసుకున్న వెంటనే కమ్మిన్స్‌కు బౌలింగ్ ఇచ్చిన స్మిత్.. కోహ్లీని అవుట్ చేయడం విశేషం. మరోవైపు పుజారా ఆకట్టుకుంటున్నాడు. దీంతో 81 ఓవర్లకు గాను టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. కోహ్లీ అవుటైన తర్వాత రహానే క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం పుజారా 66, రహానే 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

బౌండరీతో అర్ధసెంచరీ పూర్తి చేసిన పుజారా
రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో పుజారా అర్ధసెంచరీని నమోదు చేశాడు. 155 బంతులను ఎదుర్కొన్న పుజారా ఏడు ఫోర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. టెస్టుల్లో పుజారాకి ఇది 15వ అర్ధసెంచరీ కావడం విశేషం. పుజారా అర్ధసెంచరీ పూర్తి అయిన వెంటనే కోహ్లీని అతడిని అభినందించాడు. దీంతో 75 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. ప్రస్తుతం పుజారా 52, విరాట్ కోహ్లీ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ
దీంతో లంచ్ తర్వాత నాలుగో స్ధానంలో కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. మైదానంలోకి విరాట్ కోహ్లీ అడుగుపెట్టగానే 'కోహ్లీ.. కోహ్లీ.. కోహ్లీ' అంటూ అభిమానులు అరిచారు. దీంతో ఆస్ట్రేలియన్లలో బెంగ మొదలైంది. 82 పరుగుల వద్ద మురళీ విజయ్ అవుటైన తర్వాత కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. త రెండు టెస్టుల్లో 0, 13, 12, 15 స్వల్ప స్కోర్లకే కోహ్లీ వెనుదిరిగాడు. దీంతో మూడో టెస్టులో సెంచరీ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు.

లంచ్ విరామానికి టీమిండియా 193/2

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. తన కెరీర్‌లో 50వ టెస్టు ఆడుతున్న మురళీ విజయ్ ఓకీఫ్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 183 బంతులను ఎదుర్కొన్న విజయ్ పది ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 82 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. దీంతో లంచ్ విరామానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. మరోవైపు పుజారా ఆచితూచి ఆడుతూ అర్ధ సెంచరీకి చేరువయ్యాడు. పుజారా 40 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు భారత్ ఇంకా 258 పరుగులు వెనుకబడి ఉంది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

బ్యాటింగ్‌కు సిద్ధమైన కెప్టెన్ కోహ్లీ
రాంచీ వన్డేలో తొలి రోజు భుజం నొప్పితో గాయపడిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా కోహ్లీ టెస్టు డ్రస్సులో బాక్సులో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో ఏదో బ్యాటింగ్ టిప్స్‌పై మాట్లాడుతున్న వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

రెండో వికెట్ కోసం ఆసీస్ బౌలర్లు విఫల యత్నం
120/1 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్‌ను కొనసాగించిన టీమిండియా నిలకడగా ఆడుతోంది. అర్ధసెంచరీ పూర్తి చేసిన మురళీ విజయ్ సెంచరీ దిశగా సాగుతున్నాడు. అతడికి మద్దతుగా ఛటేశ్వర్ పుజారా నెమ్మదిగా ఆడుతూ అదును చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా బౌలర్లు రెండో వికెట్ కోసం తమ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో 66 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 173 పరుగులు చేసింది. ప్రస్తుతం పుజారా 32, మురళీ విజయ్‌ 72 పరుగులతో క్రీజులో ఉన్నారు.

50వ టెస్టులో అర్ధ సెంచరీ చేసిన మురళీ విజయ్
తన కెరీర్‌లో 50వ టెస్టు ఆడుతున్న మురళీ విజయ్ అర్ధసెంచరీని సాధించాడు. ఆసీస్ స్పిన్నర్ ఓకీప్ వేసిన 50వ ఓవర్‌ తొలి బంతికి సింగిల్ తీసి మురళీ విజయ్ నాలుగు ఫోర్లు, ఒక సిక్సు సాయంతో అర్ధసెంచరీని నమోదు చేశాడు. పూణెలో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 12 పరుగులు చేసిన విజయ్ ఆ తర్వాత బెంగుళూరులో జరిగిన రెండో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే.

గాయం నుంచి కోలుకోవడంతో మూడో టెస్టులో చోటు దక్కించుకున్న విజయ్‌ చక్కని ప్రదర్శన కనబరుస్తున్నాడు. టెస్టుల్లో మురళీ విజయ్‌కి ఇది 15వ అర్ధ సెంచరీ కావడం విశేషం. దీంతో 53 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 140 పరుగులు చేసింది. ప్రస్తుతం పుజారా 19, మురళీ విజయ్‌ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మూడో రోజు ప్రారంభమైన ఆట
రాంచీ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు మూడో రోజు ఆట మొదలైంది. 120/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో టీమిండియా బ్యాటింగ్‌ కొనసాగిస్తోంది. 43 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్‌ నష్టానికి 129 పరుగులు చేసింది. ప్రస్తుతం పుజారా 13, మురళీ విజయ్‌ 48 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో రోజు ఓపెనర్ కేఎల్ రాహుల్ 67 పరుగుల వద్ద అవుటైన సంగతి తెలిసిందే.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 120/1
రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఇంకా 331 పరుగుల వెనుకంజలో ఉంది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్‌కు ఒక వికెట్ లభించింది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 451 పరుగులకు ఆలౌటైంది.

తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
రాంచీ టెస్టులో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ 67 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. కమిన్స్‌ వేసిన 31.2వ బంతిని ఆడబోయి కీపర్‌ మాథ్యూవేడ్‌కు క్యాచ్ ఇచ్చాడు. రాహుల్ అవుటైన తర్వాత పుజారా క్రీజులోకి వచ్చాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X