డకౌట్‌తో టీ20ల్లో సరికొత్త రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ

Posted By:

హైదరాబాద్: గువహటి వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన వరుసగా వికెట్లు కోల్పోయి సాధారణ స్కోరుకే పరిమితమైంది. దీంతో నిర్ణీత ఓవర్లలో 118 పరుగులు చేసిన ఆలౌటైంది.

జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ వేసిన తొలి ఓవర్లో రెండు బౌండరీలు బాది ఊపు మీద కనిపించిన రోహిత్ శర్మను నాలుగో బంతికి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపగా, అదే ఓవర్ చివరి బంతికి కెప్టెన్ విరాట్ కోహ్లీ(0) జాసన్‌కే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. చక్కటి ఇన్‌స్వింగర్‌తో జాసన్ కోహ్లీని డకౌట్ చేశాడు.

ఆరంభంలోనే కీలక వికెట్లను కోల్పోయిన భారత్

ఆరంభంలోనే కీలక వికెట్లను కోల్పోయిన భారత్

దీంతో మ్యాచ్ ఆరంభంలోనే కీలక వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే, (6), శిఖర్ ధావన్‌‌ (2)లు కూడా తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాటపట్టారు. దీంతో టీమిండియా 27 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో కోహ్లీ డకౌట్ కావడం ఓ రికార్డు.

 టీ20ల్లో తొలిసారి కోహ్లీ డకౌట్

టీ20ల్లో తొలిసారి కోహ్లీ డకౌట్

తన కెరీర్‌లో 48వ టీ20 మ్యాచ్ ఆడిన కోహ్లీ ఈ ఫార్మాట్‌లో తొలిసారి డకౌట్‌గా నిష్క్రమించాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ఇన్నింగ్స్‌లు ఆడిన తరువాత డకౌటైన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకూ ఈ రికార్డు పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్ పేరిట ఉంది.

 మాలిక్ రికార్డుని సవరించిన కోహ్లీ

మాలిక్ రికార్డుని సవరించిన కోహ్లీ

టీ 20ల్లో మాలిక్ 40 ఇన్నింగ్స్‌లు తర్వాత డకౌట్ కాగా, దానిని తాజాగా విరాట్ కోహ్లీ సవరించాడు. యువరాజ్ సింగ్(39), షెన్వారీ(38), మోర్గాన్(35), మెకల్లమ్(33), గ్రేమ్ స్మిత్ (31) తరువాత స్థానాల్లో ఉన్నారు. కాగా, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 118 పరుగులు చేసి అలౌటైంది.

మూడు టీ20ల సిరిస్ 1-1తో సమం

మూడు టీ20ల సిరిస్ 1-1తో సమం

టీమిండియా నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో మూడు టీ20ల సిరిస్ 1-1తో సమమైంది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 హైదరాబాద్ వేదికగా శుక్రవారం జరగనుంది. కెరీర్లో రెండో టీ20 మ్యాచ్ ఆడుతున్న జాసన్ బెహ్రెండార్ఫ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ నమ్మకాన్ని నిలబెట్టాడు.

 నాలుగు వికెట్లతో బెహ్రెన్‌డార్ఫ్ అద్భుత ప్రదర్శన

నాలుగు వికెట్లతో బెహ్రెన్‌డార్ఫ్ అద్భుత ప్రదర్శన

గువహటి టీ20లో నాలుగు వికెట్లతో బెహ్రెన్‌డార్ఫ్ అద్భుత ప్రదర్శన చేశాడు. అంతేకాదు టీ20ల్లో భారత్‌పై అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన ఆసీస్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో అతడు 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. 2008లో నాథన్ బ్రాకెన్ మెల్‌బోర్న్‌లో 11 పరులిచ్చి 3 వికెట్లు తీశాడు.

Story first published: Wednesday, October 11, 2017, 9:59 [IST]
Other articles published on Oct 11, 2017
Please Wait while comments are loading...
POLLS