న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫామ్‌లోకి ఆస్ట్రేలియా: రెండో టీ20లో కోహ్లీసేన ఓటమి

గువహటి వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్టేలియా జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. లక్ష్య చేధన తేలిక అవుతుందనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా కెప్టెన్ డేవిడ్ వార్నర్ మ

By Nageshwara Rao

హైదరాబాద్: గువహటి వేదికగా జరిగిన రెండో టీ20లో ఆసీస్ ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో మూడు టీ20ల సిరిస్ 1-1తో సమమైంది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 హైదరాబాద్ వేదికగా శుక్రవారం జరగనుంది.

హెన్రిక్స్ (62 నాటౌట్), ట్రావిస్ హెడ్ (48 నాటౌట్) ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఛేదనలో ఓపెనర్లు ఫించ్, వార్నర్ వికెట్లను త్వరగా కోల్పోయినప్పటికీ ఆ తర్వాత క్రీజులోకి దిగిన హెన్రిక్, హెడ్ జాగ్రత్తగా ఆడి ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కోహ్లీసేన 118 పరుగులు చేసిన ఆలౌటైంది.


ఆసీస్ ఇన్నింగ్స్ సాగిందిలా:

ఆసీస్‌కు ఎదురుదెబ్బ: ఆదిలోనే ఓపెనర్లు అవుట్
భారత్ నిర్దేశించిన 119 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి మూడు ఓవర్లకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. 1.3 ఓవర్‌ వద్ద బుమ్రా బౌలింగ్‌లో ఓపెనర్‌ వార్నర్‌ (2) కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగా, ఆ తర్వాత 2.5 ఓవర్‌ వద్ద భువనేశ్వర్‌ బౌలింగ్‌ మరో ఓపెనర్‌ ఫించ్‌ (8) క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. వీరిద్దరి క్యాచ్‌లనూ కోహ్లీనే అందుకున్నాడు. ప్రస్తుతం ఆ జట్టు 3 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 14 పరుగులు చేసింది. హెన్రిక్స్‌ (2), హెడ్‌ (1) క్రీజులో ఉన్నారు.

ఆసీస్ విజయ లక్ష్యం 119
అంతకముందు టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 118 పరుగులు చేసిన ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియాకు 119 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు తక్కువ పరుగులకే విలువైన వికెట్లు కోల్పోయింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో కేదార్ జాదవ్ 27, హార్థిక్ పాండ్యా 25 పరుగులతో మెరిశారు.

2nd T20I

వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో భారత జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. హర్దిక్ పాండ్య (25), కుల్దీప్ యాదవ్ (16) ఆదుకోవడంతో జట్టు 100 పరుగుల మార్క్ దాటింది. చివర్లో భారీ షాట్లు ఆడేందుకు యత్నించిన పాండ్యా అవుటయ్యాడు. టెయిలెండర్లు కూడా చేతులెత్తేయడంతో భారత జట్టు 20 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటయ్యింది.

కెరీర్లో రెండో టీ20 మ్యాచ్ ఆడుతున్న జాసన్ బెహ్రెండార్ఫ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ నమ్మకాన్ని నిలబెట్టాడు. నాలుగు వికెట్లతో బెహ్రెండార్ఫ్ అద్భుత ప్రదర్శన చేశాడు. అంతేకాదు టీ20ల్లో భారత్‌పై అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన ఆసీస్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో అతడు 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. 2008లో నాథన్ బ్రాకెన్ మెల్‌బోర్న్‌లో 11 పరులిచ్చి 3 వికెట్లు తీశాడు.

కేదార్ జాదవ్ క్లీన్ బౌల్డ్
గువహటి వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాప్‌ స్కోరర్‌ కేదార్‌ జాదవ్‌ (27 అవుటయ్యాడు. ఆడమ్‌ జంపా వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన జాదవ్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఇక కౌల్టర్‌నైల్‌ వేసిన 13వ ఓవర్‌ నాలుగో బంతికి భువనేశ్వర్‌ (1) థర్డ్‌మ్యాన్‌ దిశలో హెన్రిక్స్‌కు చిక్కాడు. 13 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. ప్రస్తుతం హార్దిక్‌ పాండ్యా (7), కుల్దీప్‌ యాదవ్‌ (1) క్రీజులో ఉన్నారు.

పది ఓవర్లకు టీమిండియా 60/5
ఆసీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా పది ఓవర్లకే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. పది ఓవర్లకు గాను 60 పరుగులు చేసి ఐదు వికెట్లను కోల్పోయింది. రోహిత్ శర్మ (8), కోహ్లీ (0), శిఖర్ ధావన్ (2), మనీష్ పాండే(6)లు పెవిలియన్ చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోని ఆదుకుంటాడనుకుని అందరూ భావించారు. అయితే భారీ షాట్ కోసం ప్రయత్నించి జంపా బౌలింగ్‌లో 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.

భారత్ నాలుగు వికెట్లు కోల్పోయిందిలా?
రెండో టీ20లో ఆస్ట్రేలియా కొత్త బౌలర్‌ బెహ్రండార్ఫ్‌ టీమిండియా టాప్‌ ఆర్డర్‌ని కుప్పకూల్చాడు. ఈ ఎడమచేతి వాటం పేసర్‌ లైన్‌ అండ్‌ లెంగ్త్‌ను అంచనా వేయడంలో భారత బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు. తొలి ఓవర్‌ నాలుగో బంతికి రోహిత్‌ శర్మ (8) ఎల్బీ కాగా, ఆరో బంతికి విరాట్‌ కోహ్లీ డకౌటయ్యాడు. మూడో ఓవర్‌ రెండో బంతికి మనీశ్‌ పాండే (6) కీపర్‌ పైనీ చేతికి చిక్కాడు. ఐదో ఓవర్‌ మూడో బంతికి శిఖర్‌ ధావన్‌ (2) లాంగాఫ్‌లో వార్నర్‌ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

ధావన్ అవుట్: నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
గువహటి వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 27 పరుగుల వద్ద బెహ్రెండార్ఫ్ బౌలింగ్‌లో కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి ధావన్ (2) వెనుదిరిగాడు. ధావన్ అవుటైన తర్వాత క్రీజులోకి ధోని వచ్చాడు. ప్రస్తుతం 5 ఓవర్లకు గాను భారత్ 4 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది. జాదవ్ (11), ధోని పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నాడు.

మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా

గువహటి వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆదిలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లో రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లీ (0) వికెట్లను కోల్పోయిన భారత్ మూడో ఓవర్ రెండో బంతికి మనీష్ పాండే (6) రూపంలో మూడో వికెట్‌ను కోల్పోయింది. ఈ మూడు వికెట్లూ బెహ్రెండార్ఫ్ తీయడం విశేషం. ప్రస్తుతానికి 3 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 16 పరుగులు చేసింది.

2nd T20I

తొలి ఓవర్‌లోనే 2 వికెట్లు కోల్పోయిన భారత్
రెండో టీ20లో భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్ బౌలర్ బెహ్రెండార్ఫ్ టీమిండియాను దెబ్బకొట్టాడు. తొలి ఓవర్ నాలుగో బంతికి వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ (8), చివరి బంతికి కెప్టెన్ విరాట్ కోహ్లీ (0)లను పెవిలియన్ పంపాడు. దీంతో రెండో ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
గువహటి వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్టేలియా జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. లక్ష్య చేధన తేలిక అవుతుందనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా కెప్టెన్ డేవిడ్ వార్నర్ ముందుగా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

మూడు టీ20ల సిరిస్‌లో ఇప్పటికే తొలి టీ20లో గెలిచిన టీమిండియా ఈ రోజు గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో నెగ్గి ఆసీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగింది.

ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఒక్క మార్పు చేసింది. స్టోయినిస్‌కు తుది జట్టులో చోటు కల్పించింది. ఈ స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. 2013-14 సీజన్ లో నాలుగు రంజీ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన బర్సపరా స్టేడియం.. మొదటిసారి అంతర్జాతీయ మ్యాచ్‌కు వేదిక అయింది.

అంతకుముందు 2010లో గువహటిలో న్యూజిలాండ్-భారత జట్ల మధ్య చివరిసారి వన్డే జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్ 40 పరుగుల తేడాతో గెలిచింది. అయితే అది నగరంలోని నెహ్రూ స్టేడియం కాగా, ఆ తర్వవాత అస్సోం క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) తమ అంతర్జాతీయ మ్యాచ్‌లను నెహ్రూ స్టేడియం నుంచి బర్సపరాకు మార్చింది.

ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, ట్రావిస్ హెడ్, హెన్రిక్యూస్, స్టోయినిస్, పైన్, కౌల్టర్ నైల్, టై, ఆడమ్ జంపా, బెహ్రన్‌డ్రాఫ్.

భారత జట్టు: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మనీష్ పాండే, ధోనీ, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, చాహల్, బుమ్రా.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X