న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాగ్‌పూర్‌లో రెండో వన్డే: కోహ్లీ సెంచరీ, ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 251

India vs Australia 2nd ODI Live Cricket Score: Virat Kohlis Scintillating Ton Helps India Post 250

హైదరాబాద్: నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా విరాట్ కోహ్లి (116; 120 బంతుల్లో 10 ఫోర్లు) సెంచరీకి తోడు విజయ్‌ శంకర్‌(46; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకోవడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన 48.2 ఓవర్లలోనే 250 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియాకు 251 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆస్ట్రేలియా జట్టులో పాట్ కమిన్స్ నాలుగు వికెట్లు తీయగా.. ఆడమ్ జంపా రెండు, కౌల్టర్‌ నైల్, మాక్స్‌వెల్, నాథన్ లయాన్ తలో వికెట్ తీశారు.

India vs Australa: నాగ్‌పూర్ వన్డేలో ధోని గోల్డెన్ డకౌట్India vs Australa: నాగ్‌పూర్ వన్డేలో ధోని గోల్డెన్ డకౌట్

టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్‌ డకౌట్‌గా పెవిలియన్ చేరడంతో భారత జట్టు పరుగులేమీ చేయకుండానే తొలి వికెట్‌ను నష్టపోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీతో కలిసి శిఖర్ ధావన్ స్కోరు బోర్డుని నడిపించాడు. వీరిద్దరూ 38 పరుగుల జత చేసిన తర్వాత ధావన్‌(21) రెండో వికెట్‌గా నిష్క్రమించాడు. మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో ధావన్‌ ఎల్బీగా ఔటయ్యాడు.

విజయ్ శంకర్ రనౌట్

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడుతో కలిసి కోహ్లీ మరో 37 పరుగులు జత చేశాడు. అనంతరం అంబటి రాయుడు(18) మూడో వికెట్‌గా పెవిలియన్‌ బాట పట్టాడు. లయాన్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ రాయుడు చేరాడు. ఈ దశలో కోహ్లీతో కలిసి విజయ్ శంకర్ నిలకడగా స్కోర్ పెంచుకుంటూ పోయాడు. కానీ దురదృష్టవశాత్తు ఆడం జంపా వేసిన 29వ ఓవర్ ఐదో బంతికి శంకర్(46) నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో రనౌట్ అయ్యాడు.

వరుస బంతుల్లో ధోని, కేదార్ జాదవ్ ఔట్

ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన కేదార్ జాదవ్(11), ధోనీ(0) వరుస బంతుల్లో పెవిలియన్ చేరడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి కోహ్లీ స్కోర్‌ను పెంచే ప్రయత్నం చేశాడు. అంతకుముందు 55 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్కును చేరిన కోహ్లీ దానిని సెంచరీగా మలచుకున్నాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 40 సెంచరీ కావడం విశేషం.

250 పరుగులకు ఆలౌటైన టీమిండియా

అయితే కాగా ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో జడేజా(21) ఖవాజాకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కొంత సమయానికే కోహ్లీ(116) భారీ షాట్‌కు ప్రయత్నించి స్టోయినిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో 248 పరుగుల వద్ద భారత్‌ ఎనిమిదో వికెట్‌ను నష్టపోయింది. మరొక పరుగు వ్యవధిలో కుల్దీప్‌ యాదవ్‌(3) నిష్క్రమించాడు. ఇక చివరి వికెట్‌గా బుమ్రా డకౌట్‌గా పెవిలియన్‌ చేరడంతో భారత్‌ 48.2 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది.

1
45586
Story first published: Tuesday, March 5, 2019, 17:44 [IST]
Other articles published on Mar 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X