న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుమ్రా సూపర్ బౌలింగ్.. 4 ఓవర్లు 7 పరుగులు!!

India vs Australia 2nd ODI: Jasprit Bumrah bowls two consecutive maidens in first spell


రాజ్‌కోట్‌: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. మొదటి స్పెల్‌లో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా.. కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే ఒక బంతి వైడ్‌ రూపంలో బౌండరీ వెళ్లడంతో ఐదు పరుగులు వచ్చాయి. ఈ ఒక్క బంతి మినహాయించి బుమ్రా అదరగొట్టాడు.

<strong>ఒంటిచేత్తో మనీష్‌ పాండే స్టన్నింగ్ క్యాచ్.. వార్నర్‌ ఔట్!!</strong>ఒంటిచేత్తో మనీష్‌ పాండే స్టన్నింగ్ క్యాచ్.. వార్నర్‌ ఔట్!!

రెండు మెయిడిన్‌ ఓవర్లు:

రెండు మెయిడిన్‌ ఓవర్లు:

బుమ్రా ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ నాలుగో బంతికి ఒక పరుగు ఇచ్చాడు. మూడో ఓవర్ మొదటి బంతికి ఒక పరుగు ఇవ్వగా.. రెండో బంతి వైడ్‌ రూపంలో బౌండరీ వెళ్లడంతో ఐదు పరుగులు వచ్చాయి. ఇక ఐదు, ఏడు ఓవర్లను మెయిడిన్‌ ఓవర్లుగా వేసాడు. ఐదో ఓవర్‌లో కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ స్టైకింగ్‌ ఎండ్‌లో ఉండగా అన్నీ బంతులను డాట్‌ బాల్స్‌ వేసాడు. స్టీవ్ స్మిత్‌ స్టైకింగ్ ఎండ్‌లో ఉన్న ఏడో ఓవర్‌ను కూడా మెయిడిన్‌గా ముగించాడు. దాంతో బుమ్రా వరుసగా రెండు మెయిడిన్లతో ఆసీస్‌కు టాప్ బ్యాట్స్‌మన్‌కు చుక్కలు చూపించాడు.

ఆసీస్‌ను ఆడుకున్న బుమ్రా:

ఆసీస్‌ను ఆడుకున్న బుమ్రా:

బుమ్రా కచ్చితమైన లెంగ్త్‌తో పాటు వైవిధ్యమైన బంతులతో ఆసీస్‌ను ఓ ఆటాడుకున్నాడు. దాంతో పరుగులు చేయడానికి ఆసీస్‌ ఆటగాళ్లు అపసోపాలు పడ్డారు. మిగతా బౌలర్ల బౌలింగ్‌లోపరుగులు చేసిన ఫించ్‌-స్మిత్‌లు బుమ్రా బౌలింగ్‌ను మాత్రం ఆచితూచి ఆడారు. అయితే రెండో స్పెల్‌లో 28వ ఓవర్ వేసిన బుమ్రా.. 7 పరుగులు ఇవ్వడం విశేషం. ఇక 30వ ఓవర్లో 3 పరుగులు ఇచ్చి మళ్లీ తన ప్రతాపం చూపించాడు. తొలి వన్డేలో ఏడు ఓవర్లు వేసి వికెట్‌ కూడా తీయకుండా 50 పరుగులిచ్చిన బుమ్రా.. రెండో వన్డేలో మాత్రం పర్వాలేదనిపించాడు.

 తడబడ్డ ఫించ్:

తడబడ్డ ఫించ్:

భారత్ నిర్దేశించిన 341 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (15) మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో మనీశ్ పాండేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆసీస్‌ స్కోరు 20 పరుగుల వద్ద వార్నర్‌ ఔట్‌ కావడంతో ఫస్ట్‌ డౌన్‌లో స్మిత్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. ఫించ్ అండతో స్మిత్ మొదటి నుంచే ధాటిగా ఆడుతున్నాడు. మొదట తడబడ్డ ఫించ్.. ఆ తర్వాత పుంజుకున్నాడు. అయితే భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రవీంద్ర జడేజా బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 48 బంతులు ఎదుర్కొన్న ఫించ్ 3 ఫోర్ల సాయంతో 33 పరుగులు చేశాడు.

స్మిత్ హాఫ్ సెంచరీ:

స్మిత్ హాఫ్ సెంచరీ:

ఫించ్ పెవిలియన్ చేరినా.. స్మిత్ మాత్రం ధాటిగానే ఆడుతున్నాడు. స్మిత్‌కు మార్నస్ లబుషేన్ మంచి సహకారం అందించాడు. ఈ క్రమంలో స్మిత్ హాఫ్ సెంచరీ చేసాడు. స్మిత్-లబుషేన్ జోడి 96 పరుగుల భాగస్వామ్యం అందించింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో లబుషేన్ (46) క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 32 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్ 77, క్యారీ 2 పరుగులతో ఉన్నారు. ఆసీస్ విజయానికి ఇంకా 159 పరుగులు కావాలి.

Story first published: Friday, January 17, 2020, 20:30 [IST]
Other articles published on Jan 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X