న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టుల్లో కెప్టెన్ కోహ్లీని కట్టడి చేస్తాం: ఆసీస్ వికెట్ కీపర్ ధీమా

India vs Australia 3rd T20: Australian Wicket-Keeper Hopes Team Can Stop Virat Kohli In Test Series
India vs Australia 2018: Australian wicket-keeper hopes team can stop Virat Kohli in Test series

హైదరాబాద్: డిసెంబర్ 6 నుంచి ప్రారంభమయ్యే నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కట్టడి చేస్తామని ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీ ధీమా వ్యక్తం చేశాడు. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20లో హాఫ్ సెంచరీ సాధించి విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

<strong>నీ హద్దులు దాటడానికి ప్రయత్నించొద్దు: యాంకర్‌కు పాక్ క్రికెటర్ వార్నింగ్</strong>నీ హద్దులు దాటడానికి ప్రయత్నించొద్దు: యాంకర్‌కు పాక్ క్రికెటర్ వార్నింగ్

ఆతిథ్య ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన మూడో టీ20లో విరాట్ కోహ్లీ (61 నాటౌట్) హాఫ్ సెంచరీ సాధించడంతో 165 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో ఛేదించింది. దీంతో మూడు టీ20లను సిరీస్‌ 1-1తో సమం చేసింది. మ్యాచ్ అనంతరం ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీ మాట్లాడాడు.

"సిడ్నీ టీ20లో కోహ్లీ బాగా ఆడాడు. మ్యాచ్ ఆఖరి వరకూ ఆస్ట్రేలియా బౌలర్లపై ఒత్తిడిని కొనసాగించాడు. తొలి పవర్‌ప్లేలోనే భారత్ జట్టుకి ధావన్, రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్నిచ్చారు. దీంతో మ్యాచ్ మధ్యలో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వికెట్లు పడగొట్టినా.. మ్యాచ్‌లో పుంజుకోలేకపోయాం" అని తెలిపాడు.

ఛేదనలో కోహ్లీ ఎలా ఆడతాడో చూశాం

ఛేదనలో కోహ్లీ ఎలా ఆడతాడో చూశాం

"ఛేదనలో కోహ్లీ ఎలా ఆడతాడో ఇప్పటికే చాలాసార్లు చూశాం. సిడ్నీలో మరోసారి చూపించాడు. టీ20లతో పోలిస్తే టెస్టులు భిన్నం. దీంతో పాటు ఆసీస్ జట్టులో నాణ్యమైన పేసర్లు, స్పిన్నర్ నాథన్ లియాన్ ఉన్నాడు. కాబట్టి, టెస్టుల్లో కోహ్లీ పరుగులు చేయకుండా కట్టడి చేస్తాం" అని అలెక్స్ అన్నాడు.

20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు

20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు

ఆదివారం జరిగిన మూడో టీ20లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. డార్సీ షార్ట్‌ (33), ఫించ్‌ (28), క్యారీ (27) రాణించగా చివర్లో స్టొయినిస్‌ (25 నాటౌట్‌) దూకుడుగా ఆడాడు. ఆ తర్వాత లక్ష్య చేధనలో భారత్‌ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 168 పరుగులు చేసి గెలిచింది.

డిసెంబరు 6న అడిలైడ్ వేదికగా తొలి టెస్టు

డిసెంబరు 6న అడిలైడ్ వేదికగా తొలి టెస్టు

ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ (22 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 41), రోహిత్‌ శర్మ (16 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లతో 23), దినేశ్‌ కార్తీక్‌ (18 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌తో 22 నాటౌట్‌) రాణించారు. ఈ సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ధావన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ లభించింది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య డిసెంబరు 6న అడిలైడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది.

భారత టెస్టు జట్టు:

భారత టెస్టు జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, ఆజింక్య రహానె, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థివ్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్

Story first published: Monday, November 26, 2018, 15:51 [IST]
Other articles published on Nov 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X