న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ Vs ఆప్ఘన్ ఏకైక టెస్టు: తేదీ, సమయం, టీవీ ఛానల్ సమాచారం

By Nageshwara Rao
India V/s Afghanistan Test Series : Date & Venue
India vs Afghanistan Test Match: Date, Time, Squads, TV Channels & Live Stream Information

హైదరాబాద్: భారత్-ఆప్ఘనిస్థాన్ దేశాల మధ్య చారిత్రాత్మక టెస్టు మ్యాచ్‌కి సర్వం సిద్ధమైంది. టెస్టు హోదా పొందిన తర్వాత ఆప్ఘనిస్థాన్ తన తొలి టెస్టు మ్యాచ్‌ని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రహానే నాయకత్వంలోని టీమిండియాతో తలపడనుంది. ఈ ఏకైక టెస్టు మ్యాచ్ గురువారం(జూన్ 14) నుంచి ప్రారంభం కానుంది.

అస్గర్ సారథ్యంలోని ఆప్ఘనిస్థాన్ జట్టు ప్రస్తుతం టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకులో ఉన్న టీమిండియాతో తలపడుతుండటంతో ఈ టెస్టుపై ఎంతో ఆసక్తి నెలకొన్నది. మెడ గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ ఏకైక టెస్టు నుంచి తప్పుకోవడంతో ఆతడి స్థానంలో వైస్ కెప్టెన్ రహానే కెప్టెన్ బాధ్యతలు స్వీకరించనున్నాడు.

ఆప్ఘనిస్థాన్ దేశానికి జూన్ 14 మరిచిపోలేని రోజు. సుదీర్ఘ చరిత్ర కలిగిన టెస్టు క్రికెట్‌లోకి ఆప్ఘన్ అడుగపెట్టడమే ఇందుకు కారణం. ఇటీవల కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న ఆప్ఘనిస్థాన్ టెస్టు క్రికెట్‌లో కూడా సత్తా చాటాలని ఊవిళ్లూరుతోంది.

మ్యాచ్ టైమింగ్: ఉదయం 9:30 గంటలకు

ఏ ఛానెల్‌లో ప్రసారం: భారత్-ఆప్ఘన్ ఏకైక టెస్టు మ్యాచ్‌ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం చేస్తోంది. హాట్ స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్

జట్ల వివరాలు:
ఆప్ఘనిస్థాన్:
అశ్గర్ స్టాకిక్జాయి(కెప్టెన్), మహ్మద్ షాజాద్, జావేద్ అహ్మది, రహ్మాత్ షా, ఇష్సునూల్లా జనత్, నాసిర్ జమాల్, హష్మతుల్లా షహీదీ, అఫర్సర్ జజాయ్, మొహమ్మద్ నబి, రషీద్ ఖాన్, జహీర్ ఖాన్, అమీర్ హంజా హోలాక్, సయద్ అహ్మద్ షిరాజాద్, యామిన్ అహ్మద్జై వఫాదర్, ముజీబ్ ఉర్ రెహమాన్.

టీమిండియా:
అజింక్య రహానే (కెప్టెన్), అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్, నవదీప్ సైని, హర్డిక్ పాండ్యా, ఇషాంత్ శర్మ, శార్తుల్ ఠాకూర్, శిఖర్ ధావన్, ఎం విజయ్, కెఎల్ రాహుల్, చేతేశ్వర్ పుజారా, కరుణ్ నాయర్, వృద్దిమాన్ సాహా(వికెట్ కీపర్)

Story first published: Wednesday, June 13, 2018, 14:02 [IST]
Other articles published on Jun 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X