న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పింక్ బాల్ టెస్టులో భారత్‌కు గెలిచేంత సత్తా ఉంది: గంగూలీ

India should play day-night Test, it’s the future: Ganguly

హైదరాబాద్: ఆస్ట్రేలియా అభ్యర్థనను తోసిపుచ్చిన బీసీసీఐ భారత క్రికెట్ బోర్డు నిర్ణయంపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. 'భారత జట్టు పింక్ బాల్ టెస్టును తిరస్కరించింది. కానీ, భవిష్యత్‌లో ఈ టెస్టుల్లో తప్పక పాల్గొనాల్సి వస్తుంది. మున్ముందు టెస్టు క్రికెట్ లో ఇది ముఖ్య భాగమైపోతుంది' అన్నాడు. పింక్ బాల్ టెస్టు ఆడేందుకు అర్హత గల దేశాలలో భారత్ ఒకటి. ఇండియాతో పాటుగా బంగ్లాదేశ్ కూడా ఆ అర్హత సాధించింది.

కేవలం రంగులో మార్పే. కానీ, మరేమీ కాదు:

కేవలం రంగులో మార్పే. కానీ, మరేమీ కాదు:

'ఈ పింక్ బాల్ టెస్టును భారత్ తిరస్కరించి ఉండాల్సింది కాదు. టెస్టులో ఆడగల సామర్థ్యం టీమిండియా క్రికెటర్లకు ఉంది. వాళ్లు డై అండ్ నైట్ టెస్టులో కూడా ఆడి రాణించగలరనే నమ్మకం నాకుంది. అది కేవలం బంతి రంగులో మార్పే. కానీ, మరేమీ కాదు' అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు గంగూలీ.

ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించిన దాఖలాలేదు:

ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించిన దాఖలాలేదు:

భారత్ తిరస్కరణ విషయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ మాట్లాడుతూ.. భారత్ ఆటగాళ్లు రెడ్ బాల్‌తో అయితేనే బాగా ఆడగలమని భావిస్తున్నారు. అందుకనే పింక్ బాల్ టెస్టుకు సమ్మతించలేకపోయారు. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఇప్పటివరకూ వాళ్లు ఓడించిన దాఖలాలేదు. కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి దీన్ని కేవలం అవకాశంగా భావించి

తిరస్కరించారు. నిజానికి వాళ్లు ఆస్ట్రేలియాతో ఆడి గెలవలేరు.' అని విమర్శించాడు.

స్పిన్నర్లకు అనుకూలంగా:

స్పిన్నర్లకు అనుకూలంగా:

'పగలు భారత స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. అదే రాత్రి సమయంలో అయితే వారికి తేమతో కూడిన వాతావరణం ఉండటంతో స్పిన్ కాస్త తక్కువ ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలోనే వాళ్లు రాత్రి సమయంలో ఆడే మ్యాచ్ విషయంలో భయపడుతున్నారు. అదే పగటి సమయంలో ఆడే మ్యాచ్‌లకైతే ఆమోదాన్ని తెలియజేస్తారు' అంటూ పేర్కొన్నాడు.

కోహ్లీ లేకపోయినా గెలుస్తుందనే ధీమా:

కోహ్లీ లేకపోయినా గెలుస్తుందనే ధీమా:

భారత్ అఫ్ఘనిస్థాన్ టెస్టును కోహ్లీ లేకపోయినా ఆడి గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేశాడు గంగూలీ. అంతేకాకుండా అఫ్ఘనిస్థాన్‌తో చరిత్రాత్మక టెస్టు ఆడకూడదని కెప్టెన్‌ కోహ్లి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు. ఇంగ్లాండ్‌లో జరగనున్న కౌంటీ క్రికెట్‌పై స్పందిస్తూ.. ‘జట్టేదైనా దేశానికి ప్రాతినిథ్యం వహించడం ముఖ్యమని కోహ్లి భావిస్తాడు. అలాంటివాడు కౌంటీలను ఎంచుకోవడం ఇంగ్లాండ్‌ పర్యటనకు అతడిస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది' అని వివరించాడు.

Story first published: Friday, May 11, 2018, 10:44 [IST]
Other articles published on May 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X