న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ప్రపంచకప్‌ ముందు ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో భారత్ ప్రయోగాలు చేయాలి'

Shane Warne Says 'India's Paceattack Is The Best Fast-Bowling Unit In A Long Time | Oneindia Telugu
India’s pace attack is the best fast-bowling unit in a long time: Shane Warne

హైదరాబాద్: ఈ ఏడాది మేలో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ జట్టులో ధోని తప్పకుండా ఉంటాడని ఆసీస్ మాజీ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ ధీమా వ్యక్తం చేశాడు. యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియాకు ధోని సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయని వార్న్ చెప్పాడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయడం ధోని అదనపు బలమంటూ వార్న్ ప్రశంసల వర్షం కురిపించాడు. వరల్డ్‌‌కప్‌లో టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలంటే కొన్ని సూచనలు పాటించాలని షేన్ వార్న్‌ సూచించాడు. భారత్‌కే ఈ మెగా టోర్నీలో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న వార్న్‌, జట్టులో కొన్ని మార్పులు జరగాలని సూచించాడు.

మోడ్రన్ ఎరాలో బెస్ట్ ఫీల్డర్ అతడే!: జాంటీ రోడ్స్ కితాబుమోడ్రన్ ఎరాలో బెస్ట్ ఫీల్డర్ అతడే!: జాంటీ రోడ్స్ కితాబు

ధోని కోసం పంత్‌ను పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు

ధోని కోసం పంత్‌ను పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు

ఈ వరల్డ్‌కప్‌లో ధోని కోసం పంత్‌ను పక్కకు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. ఇందులో భాగంగా టీమిండియా ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ, రిషబ్‌ పంత్‌లు రావాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే దీనిపై షేన్ వార్న్ సరైన వివరణే ఇచ్చాడు. వరల్డ్‌కప్ 1992లో భాగంగా న్యూజిలాండ్‌ ఓపెనర్లను మార్చిందని, అదేవిధంగా తొలి ఓవర్‌ను స్పిన్నర్‌తో బౌలింగ్‌ వేయించి సక్సెస్ అయిన విషయాన్ని గుర్తుచేశాడు.

మార్పులు చేయడంతో ప్రత్యర్థి జట్టు గందరగోళానికి

మార్పులు చేయడంతో ప్రత్యర్థి జట్టు గందరగోళానికి

ఇలాంటి మార్పులు చేయడంతో ప్రత్యర్థి జట్టు గందరగోళానికి గురవుతుందని అన్నాడు. ఇలాంటి విభిన్న మార్పులతోనే టీమిండియా బరిలోకి దిగితే తప్పక విజయం సాధిస్తుందని వార్న్ అన్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లోనే పంత్‌ను ఓపెనర్‌గా పంపించి ప్రయోగం చేయాలన్నాడు. భవిష్యత్‌ క్రికెట్‌ పంత్‌దే అంటూ కితాబిచ్చాడు.

పంత్‌కు చోటు లభిస్తుందా అన్న చర్చ

పంత్‌కు చోటు లభిస్తుందా అన్న చర్చ

"పంత్‌కు చోటు లభిస్తుందా అన్న చర్చ సాగుతోంది. నిజానికి ధోనితో పాటు పంత్‌నూ జట్టులోకి తీసుకోవచ్చు. పంత్‌ అసాధారణ ఆటగాడు. అతడిని ప్రధాన బ్యాట్స్‌మన్‌గా ఎంపిక చేయొచ్చు. రోహిత్‌ శర్మకు జోడీగా ఓపెనర్‌గా కూడా పంపొచ్చు. ఆ బాధ్యతను ధావన్‌ గొప్పగా నిర్వర్తిస్తుండొచ్చు" అని చెప్పుకొచ్చాడు.

పంత్‌, రోహిత్‌ ఓపెనింగ్‌ చేస్తే భారత్‌కు మంచి జరుగుతుంది

పంత్‌, రోహిత్‌ ఓపెనింగ్‌ చేస్తే భారత్‌కు మంచి జరుగుతుంది

"పంత్‌, రోహిత్‌ ఓపెనింగ్‌ చేస్తే భారత్‌కు మంచి జరుగుతుంది. ఇలా భిన్నమైన వ్యూహాలతో ప్రత్యర్థి జట్లను దెబ్బతీసే అవకాశం భారత్‌కు ఉంది. టాప్‌ ఆర్డర్‌లో రాణించగల నైపుణ్యం పంత్‌ సొంతం. ప్రపంచకప్‌ ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో టీమిండియా ప్రయోగాలు చేయాలి'' అని వార్న్‌ వివరించాడు. ఇక బౌలింగ్‌లోనూ టీమిండియా ఎప్పుడూ లేనివిధంగా బలంగా ఉందన్నాడు. సుదీర్ఘ కాలం ప్రపంచ క్రికెట్‌ను శాసించగల సత్తా ప్రస్తుత భారత జట్టుకు ఉందని వార్న్ చెప్పాడు.

Story first published: Thursday, February 14, 2019, 11:09 [IST]
Other articles published on Feb 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X