న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మిడిలార్డర్ గజిబిజి: రాహుల్, రహానే ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందా?

By Nageshwara Rao
India’s Middle-Order Muddle Hurting KL Rahul, Ajinkya Rahane Confidence
India’s middle-order muddle hurting KL Rahul, Ajinkya Rahane confidence

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ జట్లలో టీమిండియా ఒకటి. అలాంటి టీమిండియాను ఓ సమస్య వెంటాడుతోంది. వన్డేల్లో నాణ్యమైన మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ లేక గత వరల్డ్ కప్ నుంచి భారత జట్టు ఇబ్బందులు పడుతోంది. 2015 వరల్డ్‌కప్ తర్వాత టీమిండియా 62 వన్డేలాడితే అందులో 11 సార్లు నాలుగో నంబర్‌ స్థానం కోసం ఎంతోమంది బ్యాట్స్‌మెన్లను మార్చింది.

నిజం చెప్పాలంటే బ్యాట్స్‌మెన్‌‌ల మధ్య నాలుగో నంబర్ స్థానం ఓ కుర్చీలాటలాగా తయారైంది. ఈ స్థానం కోసం దినేశ్‌ కార్తిక్‌, మనీశ్‌ పాండే, శ్రేయాస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, సురేశ్‌రైనా, అజ్యింకె రహానేల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 2015 వరల్డ్‌కప్ తర్వాత మిడిలార్డర్‌లో రాణించిన టాప్‌-25 బ్యాట్స్‌మెన్‌ జాబితాలో కేవలం ఒకే ఒక్క భారత బ్యాట్స్‌మెన్‌ ఉన్నాడు.

మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కోసం ప్రయత్నాలు

మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కోసం ప్రయత్నాలు

వన్డేల్లో మంచి మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కోసం సెలక్టర్లతో పాటు జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి సైతం విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో రాణించిన యువ ఆటగాళ్లకు జాతీయ జట్టులో అవకాశం కల్పించినా ఎవరూ నిరూపించుకోలేకపోయారు. పెద్ద జట్లతో ఆడిన టోర్నీల్లో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఎప్పుడోగానీ రాణించడం లేదు.

ప్రపంచంలోని మిగతా జట్లతో పోలిస్తే

ప్రపంచంలోని మిగతా జట్లతో పోలిస్తే

దీంతో భారమంతా టాపార్డర్‌పై పడుతోంది. టాపార్డర్‌లో ప్రపంచంలోని మిగతా జట్లతో పోలిస్తే భారత టాపార్డర్ బ్యాట్స్‌మెన్ చేస్తోన్న పరుగులే ఎక్కువ. అదే సమయంలో భారత టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌ విఫలమైనప్పుడు మిడిలార్డర్‌లో సరైన బ్యాట్స్‌మెన్ లేకపోడవంతో టీమిండియా ఓటమి పాలవుతుంది. ధోని కొన్ని సందర్భాల్లో 4, 5 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చినప్పటికీ ఒత్తిడి కారణంగా విఫలమవుతున్నాడు.

టాప్‌-10లో ఉన్న ధోని

టాప్‌-10లో ఉన్న ధోని

నిజానికి 6, 7 స్థానాల్లో వచ్చిన బ్యాట్స్‌మెన్‌లో ధోని టాప్‌-10లో ఉన్నాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో ముగిసిన పరిమిత ఓవర్ల సిరిస్‌ను ఒక్కసారి గమనిస్తే, మిడిలార్డర్‌లో నిలకడగా రాణిస్తూ జట్టుకు విజయాలు అందించే ఆటగాళ్లు ఉన్నారు. దీంతో ఆ జట్టు టాపార్డర్‌పై ఎటువంటి భారం పడటం లేదు. దీంతో వారు సులువుగా పరుగులు రాబడుతున్నారు.

 వరల్డ్‌‌కప్‌కు ఇంకా ఏడాది సమయం

వరల్డ్‌‌కప్‌కు ఇంకా ఏడాది సమయం

వరల్డ్‌‌కప్‌కు ఇంకా ఏడాది సమయం ఉన్న తరుణంలో టీమిండియా మిడిలార్డర్‌ను ఏ ఆటగాడు భర్తీ చేయగలడో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే, సుదీర్ఘ పర్యటన కోసం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆగస్టు 1 నుంచి ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.

Story first published: Wednesday, July 25, 2018, 17:24 [IST]
Other articles published on Jul 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X