న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా.. 1991 తర్వాత ఇంత చెత్తగా అవుటయింది లేదు!!

India lose four Tests in a five-match series for first time since 1991

న్యూ ఢిల్లీ: టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ జట్టైన భారత్‌... ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఇంత ఘోరంగా ఓడిపోతుందని ఎవరూ అంచనా వేయలేదు. ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 1-4 తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో భారత్‌ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అది కూడా 27 ఏళ్ల నాటిది కావడం గమనార్హం.

1991-92 సీజన్‌లో ఆస్ట్రేలియాతో భారత్‌

1991-92 సీజన్‌లో ఆస్ట్రేలియాతో భారత్‌

ఇంతకీ ఆ రికార్డు ఏమిటంటే... ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను నాలుగు ఓటములతో ముగించడం. 1991-92 సీజన్‌లో ఆస్ట్రేలియాతో భారత్‌ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడింది. ఇరు జట్ల మధ్య అడిలైడ్‌లో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. మిగతా నాలుగు టెస్టుల్లో ఆతిథ్య ఆసీస్‌దే విజయం. అప్పుడు 0-4తో ఓడిపోయిన భారత్ మళ్లీ ఇన్నాళ్లకు ఇంతటి ఘోర సిరీస్‌ ఓటమిని మూటకట్టుకుంది.

27 ఏళ్ల వ్యవధిలో ఏ జట్టుతోనూ భారత్‌

27 ఏళ్ల వ్యవధిలో ఏ జట్టుతోనూ భారత్‌

27 ఏళ్ల వ్యవధిలో ఏ జట్టుతో ఆడిన టెస్టు సిరీస్‌నూ భారత్‌ నాలుగు ఓటములతో ముగించలేదు. 1991లో అజారుద్దీన్‌ నాయకత్వంలో భారత్‌.. ఆసీస్‌ పర్యటనకు వెళ్లింది. తాజాగా కోహ్లీ నాయకత్వంలో ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లిన భారత్‌ ఒక టెస్టులో విజయం సాధించి 1-4 తేడాతో సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ సిరీస్‌ ఓడిపోయినా తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత్‌ అగ్రస్థానంలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు.

ఆఖరి టెస్టులో టీమిండియా 118 పరుగులతో

ఆఖరి టెస్టులో టీమిండియా 118 పరుగులతో

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరిదైన ఆఖరి టెస్టులో టీమిండియా 118 పరుగులతో ఓడిపోయింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో టెస్టు మినహా అన్నింటిని గెల్చుకున్న ఇంగ్లండ్‌ 4-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. సిరీస్ వైఫల్యం పక్కా అని తెలిసినా పోరాటంలో మాత్రం వెనుకంజ వేయలేదు. చివరి టెస్టులో అద్భుతమైన ఆటతీరుతో భారత బ్యాట్స్‌మెన్ పోరాటం ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఓపెనర్ కేఎల్ రాహుల్ (149), రిషబ్ పంత్ (114) అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్‌ను వణికించారు.

కొంతకాల వ్యవధితోనే మరో సమరానికి సిద్ధం:

కొంతకాల వ్యవధితోనే మరో సమరానికి సిద్ధం:

ఈ పర్యటన అనంతరం టీమిండియా కొద్ది రోజుల విశ్రాంతి తీసుకుని మళ్లీ సెప్టెంబర్ 15 నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్ టోర్నీలో ఆడనుంది. ఇందులో భారత్‌కు తొలి మ్యాచ్ సెప్టెంబర్ 18న హాంగ్‌కాంగ్ జట్టుతో జరగనుంది. రెండో మ్యాచ్ సెప్టెంబర్ 19న దాయాది జట్టు చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్‌తో తలపడనుంది.

Story first published: Wednesday, September 12, 2018, 16:27 [IST]
Other articles published on Sep 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X