న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: జింబాబ్వేపై గెలిచిన భారత్.. సెమీస్‍లో ఎవరితో ఫైట్ అంటే..

India beat Zimbabwe by 71 runs in T20 World Cup 2022

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సిడ్నీలో జరిగిన చివరి సూపర్-12 మ్యాచ్ లో జింబాబ్వేపై భారత్ 71 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. సూర్యా కుమార్ యాదవ్ 25 బంతుల్లో 4 సిక్స్ లు 6 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 35 బంతుల్లో 3 సిక్స్ లు, 3 ఫోర్లతో 51 పరుగులు చేశాడు.

రోహిత్ శర్మ
టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మరోసారి కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశ పరిచాడు. . 13 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. ముజారబానీ బౌలింగ్ లో షాట్ కు యత్నంచి మసకద్జాకు చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ ఉన్నంత సేపు స్వేచ్ఛగా ఆడాడు. 25 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేశాడు. సిక్స్ కొట్టే ప్రయత్నంలో క్యాచ్ ఔట్ అయ్యాడు. దినేక్ కార్తీక్ స్థానంలో జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ 5 బంతుల్లో 3 పరుగులు చేసి ఔటయ్యాడు.

రవిచంద్రన్ అశ్విన్
జింబాబ్వే బౌలర్లలో సీన్ విలియమ్స్ 2 వికెట్లు తీయగా..రిచర్డ్ నగరవ, ముజారబానీని, సికిందర్ రజా ఒక్కో వికెట్ పడగొట్టారు. 187 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 17.2 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ షమీ,హార్దిక్ పాండ్యా రెండేసి వికెట్లు తీశారు. భువనేశ్వర్, హర్ష్ దీప్ సింగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. సెమీస్ భారత్ ఇంగ్లాండ్ తో తలడపనుంది. పాకిస్థాన్ న్యూజిలాండ్ తో పోటీ పడనుంది.

Story first published: Sunday, November 6, 2022, 17:07 [IST]
Other articles published on Nov 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X