న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: ఫిట్‌‌గా ఉన్నాడు: న్యూజిలాండ్‌తో 4వ వన్డేలో ధోని!

India vs New Zealand : MS Dhoni Fit For Team India Return? | Oneindia Telugu
IND vs NZ: MS Dhoni fit for Team India return? Former skipper spotted in nets ahead of 4th ODI

హైదరాబాద్: గాయం కారణంగా న్యూజిలాండ్‌తో గత సోమవారం బే ఓవల్ స్టేడియంలో జరిగిన మూడో వన్డేకి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దూరమైన సంగతి తెలిసిందే. అయితే, ఇరు జట్ల మధ్య గురువారం ఉదయం హామిల్టన్ వేదికగా జరగనున్న నాలుగో వన్డేతో మళ్లీ టీమ్‌లోకి ధోని పునరాగమం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మూడో వన్డేకి ముందు తొడ కండరాలు పట్టేయడంతో ధోని స్థానంలో వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్‌కి జట్టు మేనేజ్‌మెంట్ అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే. హామిల్టన్ స్టేడియంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్‌లో ధోని తీవ్రంగా చెమటోట్చాడు. దీంతో ధోని ఫిటెనెస్‌పై నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి.

నాలుగో వన్డేలో ధోని

నాలుగో వన్డేలో ధోని

దీంతో నాలుగో వన్డేలో ధోనికి జట్టు మేనేజ్‌మెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినివ్వడంతో కెప్టెన్‌గా రోహిత్ శర్మని ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మకు అండగా మైదానంలో ధోని ఉండటం ముఖ్యమని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

నాలుగు క్యాచ్‌లు అందుకున్న కార్తీక్

నాలుగు క్యాచ్‌లు అందుకున్న కార్తీక్

మరోవైపు మూడో వన్డేలో నాలుగు క్యాచ్‌లు అందుకున్న దినేశ్ కార్తీక్ బ్యాటింగ్‌లో 38 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతోనాలుగో వన్డేకి దినేశ్ కార్తీక్‌పై వేటు వేయాలా? లేక కొనసాగించాలా? అని జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచన చేస్తోంది.

కోహ్లీకి విశ్రాంతి

కోహ్లీకి విశ్రాంతి

మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీకి చివరి రెండు వన్డేలతో పాటు ఫిబ్రవరి 6 నుంచి జరిగే మూడు వన్డేల సిరిస్‌కు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో కోహ్లీ స్థానంలో యువ క్రికెటర్ శుభమాన్ గిల్‌‌కి అవకాశమివ్వాలని గంగూలీ లాంటి మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. తుది జట్టులో చోటుకు గిల్‌ అర్హుడని గంగూలీ చెప్పాడు.

కోహ్లీ స్థానంలో గిల్

కోహ్లీ స్థానంలో గిల్

దీంతో గురువారం నాలుగో వన్డేలో అతనికి తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో గురువారం ఉదయం 7.30 గంటలకు ప్రారంభమయ్యే తుది జట్టు ఎలా ఉండబోతుంది? అనేదానిపై అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత పేసర్లు భువనేశ్వర్, మహ్మద్ షమీలో ఒకరికి లేదా ఇద్దరికీ విశ్రాంతినిచ్చి.. ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్‌కి మరో అవకాశం ఇవ్వడంపై కూడా మేనేజ్‌మెంట్ చర్చిస్తోంది.

Story first published: Wednesday, January 30, 2019, 15:34 [IST]
Other articles published on Jan 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X