కివీస్‌తో తొలి టెస్ట్: నెట్స్‌లో చెమటోడ్చిన కోచ్ రాహుల్ ద్రవిడ్: తోలు వలిచే రకం మరి

కాన్పూర్: ముంబై: భారత క్రికెట్ జట్టు.. తన టెస్ట్ సిరీస్‌ వేటను మొదలు పెట్టబోతోంది. ఇంటర్నేషనల్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో ఇది ఆరంభం కానుంది. ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ టైటిల్ విన్నర్‌ను తలపడబోతోంది. తొలి టెస్ట్‌కు ఉత్తర ప్రదేశ్‌ కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదిక కానుంది. అయిదు సంవత్సరాల తరువాత తొలి టెస్ట్ మ్యాచ్‌ ఇక్కడ షెడ్యూల్ చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఈ స్టేడియంలో భారత జట్టు చివరిసారిగా 2016లో టెస్ట్ మ్యాచ్ ఆడింది.

కోహ్లీ, బాబర్ ఆజమ్ మధ్య ఎంత తేడా: ఐసీసీ ర్యాంకుల్లో టాపర్‌గా పాక్ సారథి: టాప్ 10లో లేని విరాట్కోహ్లీ, బాబర్ ఆజమ్ మధ్య ఎంత తేడా: ఐసీసీ ర్యాంకుల్లో టాపర్‌గా పాక్ సారథి: టాప్ 10లో లేని విరాట్

 2016లో న్యూజిలాండ్‌పైనే..

2016లో న్యూజిలాండ్‌పైనే..

2016లో ఇదే న్యూజిలాండ్ జట్టును ఢీ కొట్టింది. విజయాన్ని అందుకుంది. 216 పరుగుల భారీ తేడాతో బ్లాక్ క్యాప్స్‌ను ఓడించింది. కివీస్‌ టీమ్‌కు ఏ మాత్రం అచ్చిరాని పిచ్ ఇది. ఈ స్టేడియంలో న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అంతకుముందు 1983లో చివరిసారిగా టీమిండియా.. వెస్టిండీస్‌ను ఢీ కొట్టింది. ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది. 1952లో భారత్-ఇంగ్లాండ్ మధ్య మొట్టమొదటి సారిగా ఈ పిచ్‌పై టెస్ట్ మ్యాచ్‌ను నిర్వహించారు. ఆ మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది.

టీమిండియా సక్సెస్ ట్రాక్ ఎక్కువే..

టీమిండియా సక్సెస్ ట్రాక్ ఎక్కువే..

కాన్పూర్ పిచ్.. టీమిండియాకు బాగా అచ్చి వచ్చింది. విజయాల ట్రాక్ రికార్డు అధికం. మొత్తం 22 టెస్ట్ మ్యాచ్‌లు ఇక్కడ జరగ్గా- ఏడింట్లో భారత్ విజయం సాధించింది. మూడింట్లో మాత్రమే ఓడింది. మిగిలిన 12 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. తన ట్రాక్ రికార్డును కొనసాగించడానికి భారత్ కఠోరంగా శ్రమిస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తనను ఓడించిన కివీస్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి, కాన్పూర్ పిచ్‌పై తన చెరిగిపోని రికార్డును కొనసాగించడానికి నెట్స్‌లో చెమటోడుస్తోంది.

ఈ ట్రాక్ రికార్డును కొనసాగించడంపై..

ఈ ట్రాక్ రికార్డును కొనసాగించడంపై..

ఈ ట్రాక్ రికార్డును కొనసాగించడంపై కన్నేసింది భారత జట్టు. ఎట్టి పరిస్థితుల్లోనూ తొలి టెస్ట్‌ను ఓడిపోకూడదనే పట్టుదలను ప్రదర్శిస్తోంది. దీనికోసం నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తోంది. చివరికి- హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం బరిలోకి దిగాడు. తాను స్వయంగా బౌలింగ్ చేశాడు. నెట్స్‌లో బ్యాటర్లు, బౌలర్లకు సూచనలు, సలహాలు ఇస్తూనే బౌలింగ్ చేయడం కనిపించింది. బ్యాటర్లకు ఆఫ్ స్పిన్ బౌల్ చేస్తూ వారిని ముందుండి నడిపించాడు ద్రవిడ్. దీనికి సంబంధించిన ఓ వీడియోను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది.

కోచ్‌గా తొలి టెస్ట్..

కోచ్‌గా తొలి టెస్ట్..

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఇటీవలే బాధ్యతలను స్వీకరించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌ సిరీస్‌తో అతను బోనీ కొట్టాడు. ద్రవిడ్ కోచ్‌గా అపాయింట్ అయిన తరువాత టీమిండియా ఎదుర్కొన్న మొట్టమొదటి సిరీస్ చిరస్మరణీయంగా మారింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా అలవోకగా గెలిచేసుకుంది. ఇక టెస్ట్ సిరీస్ ఆరంభం కాబోతోంది. టీ20 ఇంటర్నేషనల్స్ తరహాలోనే క్లీన్‌స్వీప్ చేయడానికి కసరత్తు చేస్తోంది.

కోచ్‌ బౌలింగ్ చేయడం అరుదుగా..

టీమిండియా హెడ్ కోచ్ బౌలింగ్ చేయడం చాలా అరుదుగా చెప్పుకోవచ్చు. ద్రవిడ్ కంటే ముందు ఈ స్థానంలో కొనసాగిన రవిశాస్త్రి పెద్దగా ఫీల్డ్‌లో దిగిన సందర్భాలు లేవు. నెట్ ప్రాక్టీస్ సమయంలో ప్లేయర్లకు సూచనలు ఇవ్వడం వారితో ఫిజికల్ ఎక్సర్‌సైజ్‌లను చేయించడం సాధారణమే అయినప్పటికీ.. స్వయంగా బంతిని అందుకున్నది తక్కువే. రవిశాస్త్రి స్వయనా ఆఫ్ స్పిన్నర్. దీనికి భిన్నంగా ద్రవిడ్- బంతిని అందుకున్నాడు. స్వయంగా బౌలింగ్ చేశాడు. ఆఫ్ స్పిన్ బంతులను బ్యాటర్లకు సంధించాడు. వాటిని ఎదుర్కొనడంపై మెళకువలను నేర్పించాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, November 24, 2021, 18:43 [IST]
Other articles published on Nov 24, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X