న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ind vs Eng 5th Test: బౌలింగ్ ఎంచుకున్న స్టోక్స్.. తెలుగబ్బాయికి నిరాశే.. టీమిండియా ప్లేయింగ్ 11లో వీరే..!

Ind vs Eng 5th Test: India Lost the Toss and Bat first, Team Goes With Four Pacers, Playing 11 is..?

బర్మింగ్ హామ్ : ఇంగ్లాండ్‌లోని బర్మింగ్ హామ్‌ ఎడ్జ్‌బాస్టన్‌లో రీషెడ్యూల్ చేసిన అయిదో టెస్ట్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. గతేడాది ఈ సిరీస్లో కరోనా కారణంగా రద్దయిన అయిదో మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు జరగ్గా.. 2-1తో భారత్ ఆధిక్యంలో ఉంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగనున్న చివరి మ్యాచ్‌లో భారత్ గెలిచినా.. కనీసం డ్రా చేసుకున్నా సిరీస్ భారత్ వశమవుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా గెలవడం అతిపెద్ద సవాల్ అనే చెప్పాలి. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌‌ను ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్ చేసి జోరు మీదుండడంతో పాటు కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లాండ్ టీమ్ కొత్త రకమైన టెస్ట్ ఆట ఆడుతూ ప్రత్యర్థులను వణికిస్తోంది. ఇక ఆ జట్టుకు మంచి ప్రాక్టీస్‌ కూడా ఉంది. ఈ టెస్ట్‌కు బుమ్రా కెప్టెన్సీ పగ్గాలు స్వీకరించడం విశేషం. ఏదేమైనా కనీసం డ్రా చేసుకున్న సిరీస్ టీమిండియా సొంతమవుతుంది. ఈ మ్యాచ్‌లో అందరూ అనుకున్నట్లు తెలుగబ్బాయి కేఎస్ భరత్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు.

 సేమ్ టూ సేమ్ ఆడతాం

సేమ్ టూ సేమ్ ఆడతాం

ఇకపోతే ఈ మ్యాచ్‌కు ముందు టాస్ కోసం ఇరు జట్ల కెప్టెన్లు గ్రౌండ్లోకి రాగా.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. మేము ఛేజింగ్ బాగా చేయగలం. వికెట్ ఎలా ఉందో ముందుగా బౌలింగ్ వేస్తే అవగాహన వస్తుంది. ఇంత త్వరగా కొత్త జట్టుతో మరో టెస్ట్ ఆడడం బాగుంది. మా మూమెంటం రోలింగ్‌ను కొనసాగించడానికి మాకు ఇది అవకాశాన్ని ఇస్తుంది. మేము న్యూజిలాండ్‌తో ఎలా ఆడామో అలాగే ఆడతాం అని స్టోక్స్ పేర్కొన్నాడు.

నలుగురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి..

నలుగురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి..

టాస్ ఓడిన జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ.. కెప్టెన్‌గా ఓ గొప్ప అనుభూతి ఉంది. ఇది నాకో పెద్ద విశేషం. మా ప్రిపరేషన్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. టీ20ల నుంచి తిరిగి వచ్చినందున ఎక్కువ సమయం వెచ్చించాలని, ఇంగ్లాండ్ పరిస్థితులకు అలవాటు పడాలని అనుకున్నా. మా సైడ్ నుంచి నలుగురు పేసర్లను బరిలోకి దించుతున్నాను. నేను, సిరాజ్, శార్దూల్ షమీ ఈ మ్యాచ్‌లో ఆడతారు. జడేజా ఆల్‌రౌండర్‌గా ఆడనున్నాడు. ఇక అందరూ ఊహించినట్లే రవిచంద్రన్ అశ్విన్‌కు బదులు నాలుగో పేసర్‌ను ఆడించడమే మేలని ఇండియా భావించింది. ఇక నలుగురు స్పెషలిస్టు బౌలర్లు బరిలోకి దిగనుండడం మరింత ఆసక్తికరంగా ఉండబోతుంది.

తుది జట్లు :

తుది జట్లు :

భారత్ (ప్లేయింగ్ XI): శుభ్‌మన్ గిల్, చటేశ్వర్ పుజారా, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్)

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): అలెక్స్ లీస్, జాక్ క్రాలీ, ఓలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్ స్టో, సామ్ బిల్లింగ్స్(కీపర్), జాక్ లీచ్, మ్యాటీ పోట్స్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్

Story first published: Friday, July 1, 2022, 15:11 [IST]
Other articles published on Jul 1, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X