న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కింగ్ కోహ్లీకి పాకిస్తాన్ కేప్టెన్ ఫుల్ సపోర్ట్: ఏం చెప్పాడంటే?: రెండు దేశాల ఫ్యాన్స్ ఫిదా

IND vs ENG 2022 2nd ODI: This too shall pass: Babar Azam tweets in the support of Kohli
కోహ్లీకి పాకిస్తాన్ కేప్టెన్ ఫుల్ సపోర్ట్, రెండు దేశాల ఫ్యాన్స్ ఫిదా *Cricket | Telugu OneIndia

లండన్: ఇంగ్లాండ్‌తో లార్డ్స్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి విఫలం కావడం.. ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ డిబేట్‌గా మారింది. ఇంగ్లాండ్ గడ్డపై అడుగు పెట్టినప్పటి నుంచి రెండో వన్డే ఇంటర్నేషనల్ వరకు విరాట్ కోహ్లీ ఒక్క భారీ ఇన్నింగ్ కూడా ఆడలేకపోయాడు. టీ20 సిరీస్‌లోనూ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొన్నాడు. చివరి రెండు టీ20ల్లో అతను చేసిన స్కోర్ 12 పరుగులే.

రెండో వన్డేలోనూ..

వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్‌ కూడా విరాట్ కోహ్లీని ఫెయిల్యూర్స్ వెంటాడుతూనే వస్తోన్నాయి. గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరం అయ్యాడు. రెండో మ్యాచ్‌లో ఆడినా జట్టుకు అతని ఇన్నింగ్ ఏ మాత్రం హెల్ప్ కాలేదు. 25 బంతుల్లో మూడు ఫోర్లతో 16 పరుగులు చేశాడు.డేవిడ్ విల్లే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. కోహ్లీ బలహీనత మీద దెబ్బకొట్టాడు విల్లే. ఆఫ్ స్టంప్‌ కాస్త దూరంగా వెళ్తోన్న బంతిని ఆడి.. అవుట్ అయ్యేలా చేశాడు.

విమర్శల సునామీ వేళ..

వరుస వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతోన్న విరాట్ కోహ్లీపై ఇప్పుడు విమర్శల సునామీ మొదలైంది. ఇదివరకే టీమిండియా మాజీ కేప్టెన్, లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్.. ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వరల్డ్ నంబర్ వన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌ను టెస్ట్ మ్యాచ్‌ల నుంచి తొలగించినప్పుడు ఆ పని- విరాట్ కోహ్లీ విషయంలో ఎందుకు చేయట్లేదంటూ ప్రశ్నించారాయన. కోహ్లీని కొద్దిరోజుల పాటు బెంచ్‌కే పరిమితం చేయడమా? లేక విశ్రాంతి ఇవ్వడమా అనేది బీసీసీఐ సెలెక్టర్లు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

బాబర్ ఆజమ్ అండ

ఈ పరిస్థితుల మధ్య కోహ్లీకి అనూహ్యమైన ప్లేయర్ నుంచి మద్దతు లభించింది. పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్.. కోహ్లీకి ఫుల్ సపోర్ట్ చేశాడు. ఈ కఠిన పరిస్థితులు కూడా దాటిపోతాయని భరోసా ఇచ్చాడు. ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోహ్లీకి సూచించాడు. ఈ మేరకు బాబర్ ఆజమ్ ఓ ట్వీట్ చేశాడు. దాన్ని కోహ్లీకి ట్యాగ్ చేశాడు. తాను ఎదుర్కొంటోన్న ఈ కఠిన పరిస్థితులను కూడా విరాట్ కోహ్లీ త్వరలోనే దాటుకుంటాడని వ్యాఖ్యానించాడు. కోహ్లీతో కలిసి దిగిన ఫొటోను దీనికి జత చేశాడు.

ఫ్యాన్స్ ఖుష్..

బాబర్ ఆజమ్ చేసిన ఈ ట్వీట్- రెండు దేశాల క్రికెట్ అభిమానులను ఉత్సాహ పరిచింది. టూ లెజెండ్స్ అంటూ రిప్లై ఇస్తోన్నారు. కోహ్లీకి అండగా నిలిచినిందుకు టీమిండియా తరఫున బాబర్ ఆజమ్‌కు థ్యాంక్స్ చెబుతున్నారు. పాకిస్తాన్ కేప్టెన్.. తన క్రీడాస్ఫూర్తిని చాటుకున్నారని కామెంట్స్ చేస్తోన్నారు. క్రీడారంగానికి ఎలాంటి సరిహద్దులు లేవనే విషయాన్ని బాబర్ మరోసారి నిరూపించుకున్నాడని వ్యాఖ్యానిస్తోన్నారు. విరాట్ కోహ్లీ-బాబర్ ఆజమ్ ఇద్దరూ క్రికెట్ ప్రపంచంలో ఓ రోల్ మోడల్స్‌గా నిలిచిపోతారనీ ప్రశంసిస్తోన్నారు.

Story first published: Friday, July 15, 2022, 10:37 [IST]
Other articles published on Jul 15, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X