న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు: ఉమేశ్ యాదవ్ నేషనల్ విలన్, నెటిజన్ల ట్వీట్లు

India Vs Australia 2019,T20I : 'Umesh Yadav Is A National Villain' Natigens Trolling In Twitter
IND vs AUS: Umesh Yadav is a national villain, Twitter brutally trolls pacer for conceding 14 in last over

హైదరాబాద్: టీమిండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌పై నెటిజన్లు సోషల్ మీడియాలో ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. రెండు టీ20ల సిరిస్‌లో భాగంగా విశాఖ వేదికగా ఆదివారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమికి భారత బౌలర్ ఉమేశ్‌ యాదవే కారణమని అభిమానులు మండిపడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. అనంతరం 127 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు విజయానికి ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు అవసరమయ్యాయి. ఆఖరి ఓవర్ వేసిన ఉమేశ్ యాదవ్ ఆ పరుగులు సమర్పించుకోవడంతో ఆసీస్ విజయం సాధించింది.

అంతేకాదు ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన బుమ్రా కష్టాన్ని ఉమేశ్ యాదవ్ బుగ్గిపాలు చేశాడు. 19వ ఓవర్‌లో బుమ్రా రెండు వికెట్లు తీసి 2 పరుగులు ఇచ్చి మ్యాచ్‌లో భారత్ ఆశలను సజీవం చేశాడు. ఆఖరి ఓవర్‌లో 14 పరుగులకు అడ్డుకట్ట వేయలేక పోవడంతో పాటు ఆఖరి బంతికి రెండు పరుగులు కావాల్సి ఉండగా బంతి ఎలా వేయాలో కూడా తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు.

దీంతో భారత్ ఓటమికి కారణమైన ఉమేశ్ యాదవ్‌పై నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ్ ట్రోల్ చేస్తున్నారు. టీ20ల్లో.. అది చివరి ఓవర్లలో ఎలా బౌలింగ్‌ చేయాలో కూడా తెలియదా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.

భారత్‌ బ్యాట్స్‌మెన్‌లో రాహుల్‌ (36 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించగా... ధోని (37 బంతుల్లో 29 నాటౌట్‌; 1 సిక్స్‌), కోహ్లి (17 బంతుల్లో 24; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించినా మిగతా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం.. వేగంగా ఆడకపోవడం భారత విజయవకాశాలను దెబ్బతీసింది. స్వల్ప స్కోర్‌నే బుమ్రా నిలబెట్టే ప్రయత్నం ఆకట్టుకుంది. 4 ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 16 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. తన బౌలింగ్‌తో ఆసీస్‌కు ముచ్చెమటలు పట్టించాడు.

Story first published: Monday, February 25, 2019, 12:34 [IST]
Other articles published on Feb 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X