న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ ముంగిట మరో ప్రపంచ రికార్డు

In Virat Kohlis absence, Rohit Sharma on course to bag a T20I World Record against West Indies

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ గైర్హాజరీతో రోహిత్‌ శర్మ నేతృత్వంలో టీమిండియా విండీస్‌తో తొలి టీ20 సిరీస్‌కు సమాయత్తమవుతోంది. ఇప్పటికే టెస్టుల్లో 2-0తో, వన్డేల్లో 3-1తో విజయం సాధించిన భారత్.. పొట్టి ఫార్మాట్‌లోనూ పర్యాటక జట్టుపై అదే ప్రదర్శన కొనసాగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో కోల్‌కతా చేరుకున్న రోహిత్‌ సేన ప్రాక్టీస్‌ ముమ్మరం చేసింది.

అదే జోరు కొనసాగిస్తే మరో ప్రపంచ రికార్డు

అదే జోరు కొనసాగిస్తే మరో ప్రపంచ రికార్డు

ఇదిలా ఉండగా, ఇప్పటికే వన్డేల్లో అదరగొట్టి వెస్టిండీస్‌పై తన సత్తా చాటుకున్నాడు రోహిత్‌ శర్మ. ఈ క్రమంలో టీ20 సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగిస్తే మరో ప్రపంచ రికార్డు అతని ఖాతాలో వచ్చి చేరనుంది. ఈ సిరీస్‌కు కెప్టెన్సీ వహిస్తూనే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవచ్చు.

 2086 పరుగులతో రోహిత్‌ ఐదో స్థానంలో

2086 పరుగులతో రోహిత్‌ ఐదో స్థానంలో

టీ20ల్లో.. న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ మార్టిన్‌ గఫ్తిల్‌(2271పరుగులు) అందరికంటే ముందున్నాడు. రెండో స్థానంలో పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయాబ్‌ మాలిక్‌(2161), మూడో స్థానంలో న్యూజిలాండ్‌ ఆటగాడు బ్రెండన్‌ మెక్‌కలమ్‌(2140), నాలుగో స్థానంలో విరాట్‌ కోహ్లీ(2102) ఉన్నాడు. ఈ జాబితాలో రోహిత్‌(2086 పరుగులతో) అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లీ విండీస్‌తో ఈ టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉండడు.

పాకిస్థాన్‌-న్యూజిలాండ్‌ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌

పాకిస్థాన్‌-న్యూజిలాండ్‌ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌

మరోవైపు పాకిస్థాన్‌-న్యూజిలాండ్‌ మధ్య ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగుతుండగా, అందులో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ సిరీస్‌లో గఫ్తిల్‌ చోటు దక్కించుకోలేదు. పాక్ జట్టులో మాలిక్‌ ఆడుతున్నా.. మొదటి రెండు మ్యాచ్‌ల్లో నామమాత్రపు ప్రదర్శన చేసిన అతను .. మూడో మ్యాచ్‌లో భారీ స్కోరు చేసే అవకాశాలు కనిపించడం లేదు.

 ఆ 185పరుగుల వ్యత్యాసాన్ని దాటేస్తే మాత్రం

ఆ 185పరుగుల వ్యత్యాసాన్ని దాటేస్తే మాత్రం

ఈ క్రమంలో ప్రస్తుతం విండీస్‌తో మూడు టీ20ల్లోనూ రోహిత్‌ శర్మ బ్యాట్‌ ఝళిపించి ఆ 185పరుగుల వ్యత్యాసాన్ని దాటేస్తే మాత్రం టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా అగ్రస్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కెప్టెన్ కంటే ముందు నేనొక బ్యాట్స్‌మెన్‌ని. కెప్టెన్సీలోనూ మంచి సంతృప్తితో ఆడుతున్నాను. బ్యాట్స్‌మన్‌గానూ మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపాడు.

Story first published: Sunday, November 4, 2018, 11:38 [IST]
Other articles published on Nov 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X