న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని దిగ్గజం అన్న సంగతి మాకు తెలుసు: స్లో బ్యాటింగ్ విమర్శలపై కోహ్లీ

ICC Cricket World Cup 2019 : MS Dhoni Is A Legend Of The Game Says Virat Kohli || Oneindia Telugu
ICC World Cup 2019: MS Dhoni is legend of the game, hes doing a tremendous job for us: Virat Kohli

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. టోర్నీలో భాగంగా గురువారం వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 125 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌కు చేరువైన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌లో ధోని స్లోగా ఆడటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "రెండు రోజుల క్రితమే వన్డేల్లో నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరాం అందుకు తగ్గట్లే ఆడినందుకు ఆనందంగా ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌లు బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టాయి" అని అన్నాడు.

ధోనీ చివరి వరకు ఉంటే

ధోనీ చివరి వరకు ఉంటే

"ధోనీ చివరి వరకు ఉంటే ఏం చేయగలడో అందరికీ తెలుసు. అతడు ఒక్క రోజు విఫలమైనా అంతా అతడిపై విమర్శలు చేస్తారు. మేము మాత్రం మద్దతుగా ఉంటాం. భారత్‌కు అతడు ఎన్నో విజయాలు అందించాడు. టెయిలెండర్స్‌తో కలిసి ఎలా బ్యాటింగ్ చేయాలో మహీకంటే బాగా ఎవరికీ తెలియదు" అని కోహ్లీ అన్నాడు.

పదికి ఎనిమిది సార్లు అతడిచ్చిన

పదికి ఎనిమిది సార్లు అతడిచ్చిన

"పదికి ఎనిమిది సార్లు అతడిచ్చిన సలహాలు పనిచేస్తాయంటే జట్టులో అతడెంత కీలక సభ్యుడో అర్థం చేసుకోవచ్చు. ఎంత స్కోరు చేస్తే సరిపోతుందో అతడు కచ్చితంగా చెప్పగలడు. అతడు 265 పరుగులు సరిపోతాయంటే మేమేం 300 కోసం ఆడం. అలాగని 230తో సరిపెట్టుకోం. అతడు క్రికెట్‌ దిగ్గజం అన్న సంగతి మాకు తెలుసు" ధోనికి మద్దతుగా నిలిచాడు.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా విరాట్ కోహ్లీ 82 బంతుల్లో 72(8ఫోర్లు), ధోని 61 బంతుల్లో 56(3 పోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీలతో చెలరేగగా... చివర్లో హార్ధిక్ పాండ్యా 38 బంతుల్లో 46(5 ఫోర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది.

34.2 ఓవర్లలో 143 పరుగులకే కుప్పకూలిన విండిస్

34.2 ఓవర్లలో 143 పరుగులకే కుప్పకూలిన విండిస్

అనంతరం టీమిండియా నిర్దేశించిన 269 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ జట్టు 34.2 ఓవర్లలో 143 పరుగులకే కుప్పకూలింది. ప్రపంచకప్‌లో వెస్టిండిస్‌ ఇది మూడో అతి పెద్ద ఓటమి కావడం విశేషం. భారత బౌలర్లు మహ్మద్ షమీ, బుమ్రా, చాహల్ బౌలింగ్‌‌ ముందు కరీబియన్లు నిలవలేకపోయారు. ఏ దశలోనూ కోహ్లీసేనకు పోటీ ఇవ్వలేకపోయారు. విండీస్ ఆటగాళ్లలో ఓపెనర్ సునీల్ ఆంబ్రిస్(31) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

నాలుగు వికెట్లతో చెలరేగిన షమీ

నాలుగు వికెట్లతో చెలరేగిన షమీ

ఆ తర్వాత నికోలస్ పూరన్(28), హెట్‌మెయిర్(18) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో షమీ నాలుగు... బుమ్రా, చాహల్ చెరో రెండు వికెట్లు, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు. తాజా విజయంతో టీమిండియా సెమీస్‌కు చేరుకోగా, విండీస్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. తాజా విజయంతో భారత్ 11 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా కోహ్లీ నిలిచాడు.

Story first published: Friday, June 28, 2019, 12:39 [IST]
Other articles published on Jun 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X