న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మళ్లీ చెబుతున్నా... పంత్‌ విషయంలో సెలక్టర్లు ఘోర తప్పిదం చేశారు

ICC World Cup 2019: ‘India made wrong choice’ by not picking Rishabh Pant, says Ricky Ponting

హైదరాబాద్: వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కనందుకు గాను రిషబ్ పంత్ ఎంత బాధపడ్డాడో తనకు తెలుసుని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అన్నాడు. తన ఓపీనియన్ ప్రకారం పంత్‌ విషయంలో టీమిండియా ఘోర తప్పిదాన్ని చేసినట్లు వెల్లడించాడు. ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి జరగనున్న వన్డే వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన జట్టులో రిషబ్ పంత్‌కు చోటు దక్కని సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

రిషబ్ పంత్ 78 నాటౌట్‌‌

రిషబ్ పంత్ 78 నాటౌట్‌‌

ఆ‌ తర్వాత విమర్శలు రావడంతో పంత్‌తో పాటు అంబటి రాయుడిని బీసీసీఐ స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లో పంత్ చెలరేగి ఆడాడు. ‌36 బంతుల సాయంతో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 78 నాటౌట్‌‌గా నిలిచి ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

చిన్నబోయిన భారీ లక్ష్యం

చిన్నబోయిన భారీ లక్ష్యం

పంత్ మెరుపు ఇన్నింగ్స్‌తో భారీ లక్ష్యం కూడా చిన్నబోయింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకముందు రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది.

రికీ పాంటింగ్ మాట్లాడుతూ

రికీ పాంటింగ్ మాట్లాడుతూ

పంత్ మెరుపు ఇన్నింగ్స్‌పై మ్యాచ్ అనంతరం రికీ పాంటింగ్ మాట్లాడుతూ "వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కనందుకు పంత్‌ ఎలా బాధపడ్డాడో నాకు తెలుసు. నా అభిప్రాయం ప్రకారం పంత్‌ ఎంపిక విషయంలో భారత్ ఘోర తప్పు చేసింది. ఇంగ్లీషు పరిస్థితులను పంత్ చక్కగా అర్ధం చేసుకోగలడు. ముఖ్యంగా మిడిల్‌ ఓవర్స్‌లో స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొనగలడు" అని అన్నాడు.

పంత్‌కు మూడు నాలుగు వరల్డ్‌కప్‌లు ఆడే సత్తా ఉంది

పంత్‌కు మూడు నాలుగు వరల్డ్‌కప్‌లు ఆడే సత్తా ఉంది

"పంత్‌ను జట్టులోకి ఎంపిక చేయనప్పుడే చెప్పా, మళ్లీ చెబుతున్నా.. ఆరోగ్యంగా ఫిట్‌గా ఉంటే... పంత్‌కు మూడు నాలుగు వరల్డ్‌కప్‌లు ఆడే సత్తా ఉంది. పంత్ లాంటి ఆటగాళ్లు పేస్‌తో కూడిన పిచ్‌లపై చెలరేగుతారు. అదే మనం చూశాం. ఇదే తరహా పిచ్‌ అయిన ముంబైలో కూడా 20 బంతుల్లో 70 పరుగులు చేశాడు" అని పాంటింగ్‌ చెప్పుకొచ్చాడు. ఢిల్లీ జట్టులోని యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారని పాంటింగ్‌ కొనియాడాడు.

Story first published: Tuesday, April 23, 2019, 16:41 [IST]
Other articles published on Apr 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X