న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన రోహిత్.. టాప్‌ 10లో చోటు!!

Rohit Sharma Jumps To 10th Place In ICC Test Batsmen Rankings || Oneindia Telugu
ICC Test rankings: Rohit Sharma Enter Top 10 Rankings Across Formats

దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ 'హిట్‌మ్యాన్‌' రోహిత్ శర్మ దుమ్మురేపాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో పరుగుల వరద పారించిన రోహిత్.. ఏకంగా 12 స్థానాలు ఎగబాకి టాప్‌ 10లో చోటు దక్కించుకున్నాడు. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, భారత్ మధ్య జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్ ముగిసిన నేపథ్యంలో ఐసీసీ తాజాగా టెస్ట్ ర్యాంకులను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా ఆరంగేట్రం చేసిన రోహిత్ శర్మ మొత్తం 529 పరుగులు చేసి 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'అందుకున్నాడు.

<strong>జ‌ట్టులో కోహ్లీ ముఖ్య‌మైన వ్య‌క్తి.. అతనికి అన్ని విధాలా మ‌ద్ద‌తు ఇస్తాం: గంగూలీ</strong>జ‌ట్టులో కోహ్లీ ముఖ్య‌మైన వ్య‌క్తి.. అతనికి అన్ని విధాలా మ‌ద్ద‌తు ఇస్తాం: గంగూలీ

టాప్‌ లేపిన రోహిత్‌

టాప్‌ లేపిన రోహిత్‌

రాంచీ టెస్టుకు ముందు 22వ స్థానంలో ఉన్న రోహిత్‌.. ఆ టెస్టులో డబుల్‌ సెంచరీ చేయడంతో అతడి గ్రాఫ్‌ ఒక్కసారిగా మారిపోయింది. ఏకంగా 12 స్థానాలు ఎగబాకి.. 722 పాయింట్లతో 10వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఇది రోహిత్‌కు అత్యున్నత ర్యాంకు. ఐసీసీ అన్ని ఫార్మట్లలో టాప్‌ 10లో నిలిచిన రెండో బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ నిలిచాడు. కెప్టెన్ విరాట్‌ కోహ్లీ మాత్రమే మూడు ఫార్మట్లలో టాప్‌-10లో కొనసాగుతున్నాడు.

కెరీర్‌ అత్యుత్తమ ర్యాంకులో రహానే

కెరీర్‌ అత్యుత్తమ ర్యాంకులో రహానే

పుణే టెస్టులో డబుల్‌ సెంచరీ చేసిన విరాట్‌ కోహ్లీ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే ఆగ్రస్థానంలో కొనసాగుతున్న ఆసీస్ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌కు కోహ్లీకి మధ్య పాయింట్ల (11) వ్యత్యాసం పెరిగింది. టెస్టు బ్యాట్స్‌మన్‌ చటేశ్వర పుజారా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. రాంచీ టెస్టులో సెంచరీ చేసిన వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే కెరీర్‌లో అత్యుత్తమ ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత బ్యాట్స్‌మన్‌ టాప్‌-10లో నలుగురు ఉండటం విశేషం. మయాంక్ అగర్వాల్‌కు 18 ర్యాంకు దక్కింది.

 నాలుగో స్థానానికి పడిపోయిన బుమ్రా

నాలుగో స్థానానికి పడిపోయిన బుమ్రా

బౌలర్ల ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమైన జస్ప్రిత్‌ బుమ్రా మూడు నుంచి నాలుగో స్థానానికి పడిపోయాడు. రవిచంద్రన్ అశ్విన్ 10వ ర్యాంకు దక్కించుకున్నాడు. బుమ్రా, అశ్విన్ మినహా భారత బౌలర్లు ఎవరూ టాప్‌ 10లో లేరు. రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీలు 14, 15 స్థానాలలో కొనసాగుతున్నారు. ఉమేష్ యాదవ్ 24వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఆల్‌రౌండర్స్‌ జాబితాలో హోల్డర్‌, రవీంద్ర జడేజా, షకీబుల్‌ హసన్‌లు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

ఆగ్రస్థానంలో టీమిండియా

ఆగ్రస్థానంలో టీమిండియా

దక్షిణాఫ్రికా జట్టును 3-0తో వైట్‌వాష్‌ చేయడంతో టెస్టుల్లో టీమిండియా ఆగ్రస్తానానికి మరింత బలం చేకూరింది. 119 రేటింగ్‌ పాయింట్లతో టీమిండియా ఆగ్రస్థానంలో కొనసాగుతోంది. తరువాతి స్థానాలలో న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి.

Story first published: Wednesday, October 23, 2019, 17:33 [IST]
Other articles published on Oct 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X