న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పీసీబీకి మరో షాక్: బీసీసీఐకి లీగల్ ఖర్చుల కింద 60 శాతం చెల్లించండి

ICC orders PCB to pay 60 per cent of BCCI costs after legal dispute

హైదరాబాద్: ఒప్పందం ప్రకారం ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడనందుకు బీసీసీఐ నుంచి నష్టపరిహారం కోరుతూ ఐసీసీ వివాద పరిష్కార ప్యానెల్‌ను ఆశ్రయించిన పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ఎదురు చెల్లించుకోవాల్సి వచ్చింది. నష్టపరిహారం కోసం పీసీబీ చేసిన అభ్యర్థనను నెలకింద ఐసీసీ ప్యానెల్‌ తిరస్కరించిన సంగతి తెలిసిందే.

'టిమ్ పైన్-విరాట్ కోహ్లీ మాటల యుద్ధం హాస్యభరితంగా కనిపించింది''టిమ్ పైన్-విరాట్ కోహ్లీ మాటల యుద్ధం హాస్యభరితంగా కనిపించింది'

అయితే తమను ఇబ్బంది పెట్టిన పీసీబీ నుంచి న్యాయపరమైన ఖర్చులు రాబట్టుకునే అవకాశం ఉండటంతో డీఆర్‌సీని బీసీసీఐ ఆశ్రయించింది. బుధవారం బీసీసీఐ పిటీషన్‌ను విచారించిన డీఆర్‌సీ న్యాయ ఖర్చులు, ఇతర ఖర్చులు కలుపుకొని 60 శాతాన్ని భారత బోర్డుకు చెల్లించాలని తాజాగా పీసీబీని ఆదేశించింది. 60 శాతమంటే 20 లక్షల అమెరికా డాలర్లు.

ఇది భారత కరెన్సీలో రూ. 14 కోట్లు. అసలే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పీసీబీకి ఈ మొత్తం గుదిబండగా మారే అవకాశముంది. ఒప్పందం (ఎంఓయూ) ప్రకారం పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ ఆడకుండా ఎంవోయూను బేఖాతరు చేసిన బీసీసీఐ నుంచి రూ. 447 కోట్ల నష్టపరిహారంగా ఇప్పించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు... ఐసీసీలో పీటిషన్ వేసింది.

దీనిపై విచారణ అనంతరం పాక్‌ పిటిషన్‌ను ఐసీసీ డీఆర్‌సీ ప్యానెల్‌ కొట్టేసింది. ఎంఓయూ అనేది ఒక ఒప్పందం మాత్రమేనని కానీ దాని ప్రకారం అంతా నడుచుకోవాలని ఏమీ లేదని పీసీబీకి స్పష్టం చేసింది.

Story first published: Thursday, December 20, 2018, 9:00 [IST]
Other articles published on Dec 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X