న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేడు విండీస్‌–పాక్‌ మధ్య మ్యాచ్‌.. విండీస్‌ను పాక్ ఆపేనా!!

ICC Cricket World Cup 2019: West Indies vs Pakistan, When and where to watch today’s match score

ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం అండర్ డాగ్స్ జట్లు పాకిస్తాన్, వెస్టిండీస్‌ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. నిలకడ లేని, అనూహ్య ఆటతీరుకు ఈ రెండు జట్లు పెట్టింది పేరు. ఈ రెండు జట్లు తమదైన రోజున చెలరేగుతాయి. అయితే భారీ హిట్టర్లతో కూడిన విండీస్‌ను పాక్ ఎంతమేరకు నిలువరిస్తుందనే అసలు విషయం. మరోవైపు ఆమిర్‌ వంటి నాణ్యమైన పేసర్లను కరీబియన్లు ఎదుర్కుంటారో చూడాలి.

{headtohead_cricket_8_5}

 అందరూ హిటర్లే:

అందరూ హిటర్లే:

విండీస్ జట్టులో అందరూ హిటర్లే. ఓపెనింగ్ నుంచి దాదాపు చివరి బౌలర్ వరకు హిట్టింగ్ చేయగలరు. ఓపెనింగ్ లో 'యూనివర్సల్‌ బాస్‌' క్రిస్‌ గేల్ జట్టుకు పెద్ద అండ. ఇంగ్లాండ్ సిరీస్, ఐపీఎల్-12లో చెలరేగిన గేల్.. మొదటి మ్యాచులో కూడా ఆడితే విండీస్ భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. గేల్‌కు తోడుగా ఇన్నింగ్స్‌ ప్రారంభించే ఎవిన్‌ లూయిస్‌ సైతం భారీ షాట్లతో హడలెత్తించగలడు. అయితే మిడిలార్డర్‌లో డారెన్‌ బ్రావో ఫామ్‌ అందుకోవాల్సి ఉంది.

హోల్డర్, రసెల్‌ కీలకం:

హోల్డర్, రసెల్‌ కీలకం:

ఇక నిలకడగా ఆడే షై హోప్, దూకుడుగా బాదే హెట్‌మైర్‌ జట్టుకు మరింత సానికూలాంశం. ఈ మధ్య షై హోప్ సెంచరీలు చేసి మంచి ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇక బౌలింగ్ దళం కూడా బాగానే ఉంది. రోచ్, కాట్రెల్‌ ప్రధాన పేసర్లు. పేస్‌ ఆల్‌రౌండర్లు హోల్డర్, రసెల్‌లు ఉండడంతో.. ఒషేన్‌ థామస్, గాబ్రియెల్‌లో ఒకరికే అవకాశం దక్కనుంది. స్పిన్నర్‌గా ఆష్లే నర్స్‌ ఆడనున్నాడు. హోల్డర్, రసెల్‌లు బ్యాటింగ్‌లో చెలరేగితేనే విండీస్‌కు విజయావకాశాలు మరిన్ని ఎక్కువగా ఉంటాయి.

 అపజయాల పరంపర:

అపజయాల పరంపర:

ప్రాక్టీస్‌ మ్యాచ్‌ సహా గత 10 వన్డేల్లో పాక్‌ ఓటములతో సతమవుతుంది. దీన్నిబట్టే పాక్ పరిస్థితి తెలుస్తోంది. అయితే ఈ అపజయాల పరంపరకు విండీస్‌పై విజయంతో అడ్డువేయాలని భావిస్తోంది. ఓపెనర్లు ఇమాముల్‌ హక్, ఫఖర్‌ జమాన్.. వన్‌డౌన్‌లో బాబర్‌ ఆజమ్‌ ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. అనంతరం హారిస్‌ సొహైల్, మొహమ్మద్‌ హఫీ, సర్ఫరాజ్‌లు ఆదుకునేందుకు ఉన్నారు. ఆమిర్, హసన్‌ అలీ, ఆఫ్రిది పేస్‌ త్రయం ఫామ్ అందుకోలేదు. బౌలింగ్‌లో పదును తగ్గడం పాక్ జట్టును ఆందోళన కలిగిస్తోంది. అయితే తమదైన రోజున ఆడగల సత్తా ఉంది.

పాకిస్తాన్‌ జట్టు:

పాకిస్తాన్‌ జట్టు:

సర్ఫరాజ్‌ అహ్మద్‌ (కెప్టెన్‌), ఫకార్‌ జమాన్‌, ఇమామ్‌ ఉల్‌ హక్‌‌, బాబర్‌ అజమ్‌, హ్యారిస్‌ సోహైల్‌, అసీఫ్‌ అలీ, షోయబ్‌ మాలిక్‌, మహ్మద్‌ హఫీజ్‌, ఇమాద్‌ వసీం, షాదాబ్‌ ఖాన్‌, హసన్‌ అలీ, షాహిన్‌ అఫ్రిదీ, మహ్మద్‌ అమిర్‌, వాహబ్‌ రియాజ్‌, మహ్మద్‌ హస్‌నైన్‌.

వెస్టిండీస్‌ జట్టు:

వెస్టిండీస్‌ జట్టు:

జేసన్‌ హోల్డర్‌ (కెప్టెన్‌), క్రిస్ గేల్‌, ఎవిన్‌ లూయిస్‌, డారెన్‌ బ్రావో, ఆండ్రి రసెల్‌, షై హోప్‌, హెట్‌మయర్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, నికోలస్‌ పూరన్‌ (వికెట్‌ కీపర్‌), ఆష్లే నర్స్‌, ఫాబియన్‌ అలెన్‌, కీమర్‌ రోచ్‌, ఒషానె థామస్‌, గాబ్రియల్‌, షెల్డన్‌ కాట్రెల్‌.

Story first published: Friday, May 31, 2019, 10:14 [IST]
Other articles published on May 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X