న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును చిన్నారికి ప్ర‌జెంట్ చేసిన వార్న‌ర్

ICC Cricket World Cup 2019: David Warner Gifts Young Australian Fan Man Of The Match Award After Hundred

తన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును ఓ చిన్నారి అభిమానికి ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్న‌ర్ ప్ర‌జెంట్ చేసాడు. టాంటన్‌ మైదానంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. డేవిడ్ వార్నర్‌ (107; 111 బంతుల్లో 11ఫోర్లు, 1 సిక్సర్‌) శతకం చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న త‌ర్వాత స్టాండ్స్‌లో ఉన్న ఆస్ట్రేలియా అభిమాన‌ల‌కు వార్న‌ర్ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే అక్క‌డ ఉన్న ఓ చిన్నారికి త‌న చేతిలో ఉన్న మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును ప్ర‌జెంట్ చేసాడు. అవార్డును అందుకున్న చిన్నారి ఫుల్ కుష్ అయ్యాడు. 'మేం ఆసీస్ జెండా ఊపుతున్నాం. వార్న‌ర్ మా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి అవార్డును ఇచ్చాడు' అని చిన్నారి తెలిపాడు.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఆసీస్‌ 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ ఆటగాళ్లలో వార్నర్‌ (107; 111 బంతుల్లో 11ఫోర్లు, 1 సిక్సర్‌) శతకం సాధించగా.. ఫించ్‌ (82; 84 బంతుల్లో 6ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. పాక్‌ స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ అమిర్‌ అమిర్‌ (5/30), షాహిన్‌ ఆఫ్రిది (2/70)లు రాణించారు. 308 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌ 45.4 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. ఇమాముల్‌ హక్‌ (53) అర్ద సెంచరీతో రాణించగా.. హఫీజ్‌ (46), సర్ఫరాజ్‌ (40)లు ఫర్వాలేదనిపించారు.

Story first published: Thursday, June 13, 2019, 17:29 [IST]
Other articles published on Jun 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X