న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్: మూడు మ్యాచ్‌ల్లో కోహ్లీసేన ధరించనున్న ఆరెంజ్ జెర్సీ ఇదే!

ICC Cricekt World Cup 2019: Team India Orange Jersey Could Look Like This

హైదరాబాద్: వరల్డ్‌కప్‌లో ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా ఉన్న టీమిండియా తొలి పోరుకు సిద్ధమవుతోంది. టోర్నీలో భాగంగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా బుధవారం దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. టీమిండియా అనగానే మనకు గుర్తుకు వచ్చేది 'Men in Blue'. ప్రపంచ వ్యాప్తంగా ఏ టోర్నీలో ఆడినా టీమిండియా బ్లూ కలర్ జెర్సీల్లోనే బరిలోకి దిగుతారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆరెంజ్ రంగు జెర్సీతో

ఆరెంజ్ రంగు జెర్సీతో

అయితే, ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్‌లో టీమిండియా నారింజ రంగు జెర్సీతో బరిలోకి దిగనున్నారు. ఆప్ఘనిస్థాన్, శ్రీలంక, ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల్లో కోహ్లీసేన నారింజ రంగు జెర్సీతో ఆడనున్నారు.

ఐసీసీ నిబంధనల ప్రకారం ఆతిథ్య దేశం మినహాయించి ప్రతి జట్టు రెండు రంగుల కిట్‌ల వివరాల్ని అందజేయాలి.

రెండు జట్ల జెర్సీల రంగు ఒకే విధంగా

రెండు జట్ల జెర్సీల రంగు ఒకే విధంగా ఉన్నప్పుడు అందులో ఒక జట్టు.. వేరే రంగు జెర్సీని ధరించాలి. ఈ మెగా టోర్నీలో ఆడుతోన్న ఇంగ్లాండ్, ఆప్ఘనిస్థాన్, శ్రీలంక దేశాల జెర్సీలు కూడా టీమిండియా ధరించే నీలి రంగు జెర్సీలను పోలి ఉండటంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇంగ్లాండ్‌, ఆప్ఘనిస్థాన్, శ్రీలంకతో జరిగే మ్యాచ్‌ల్లో కోహ్లీసేన నారింజ రంగు జెర్సీల్లో దిగనుంది.

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు కొత్త జెర్సీలతో

కాగా, ఇప్పటికే ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు కొత్త జెర్సీలతో బరిలోకి దిగుతోన్న సంగతి తెలిసిందే. 1992 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ ధరించిన నేవీ బ్లూ కలర్ జెర్సీతో ఈ టోర్నమెంట్ ఆడుతుండగా ఆప్ఘనిస్థాన్ కూడా సరిగ్గా అలాంటి జెర్సీతోనే బరిలోకి దిగుతుండటం విశేషం. లంక కూడా ఈ వరల్డ్‌కప్‌లో బ్లూ కలర్ జెర్సీతో బరిలోకి దిగుతోంది.

Story first published: Wednesday, June 5, 2019, 12:41 [IST]
Other articles published on Jun 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X