న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా ముందు బుమ్రా బేబి బౌలర్, నేనైతే చితకబాదేవాడిని: పాక్ మాజీ క్రికెటర్

I would have easily dominated and attacked Jasprit Bumrah: Abdul Razzaq

హైదరాబాద్: టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ ప్రశంసల వర్షం కురిపించాడు. తాను ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌లో చురుగ్గా ఉండి ఉంటే జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడంలో ఎలాంటి సమస్యలు ఉండేవికావని అభిప్రాయపడ్డారు.

బుమ్రా యార్కర్లు వేయడంలో దిట్ట. ఇప్పటికే బుమ్రా యార్కర్లపై చాలా మంది క్రికెట్ దిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే, వసిమ్ అక్రమ్, గ్లెన్ మెక్‌గ్రాత్, షోయబ్ అక్తర్ వంటి మాజీ బౌలర్లతో పోల్చితే బుమ్రా ఒక 'బేబీ బౌలర్' అని అబ్దుల్ రజాక్ అభిప్రాయపడ్డారు.

On this day, 2009: తృటిలో ట్రిపుల్ సెంచరీ మిస్సైన సెహ్వాగ్ (వీడియో)On this day, 2009: తృటిలో ట్రిపుల్ సెంచరీ మిస్సైన సెహ్వాగ్ (వీడియో)

అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ

అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ

తాజాగా క్రికెట్ పాకిస్థాన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ "గ్లెన్ మెక్‌గ్రాత్, వసీం అక్రమ్ లాంటి దిగ్గజ బౌలర్లతో కలిసి ఆడాను. నా ముందు బుమ్రా బేబి బౌలర్ లాంటి వాడు. నేను అతడిపై సులభంగా ఆధిపత్యం చెలాయించి పరుగుల వరద పారించేవాడిని" అని చెప్పుకొచ్చాడు.

నా కాలంలో ప్రపంచ స్థాయి బౌలర్లను

నా కాలంలో ప్రపంచ స్థాయి బౌలర్లను

"నా కాలంలో ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొన్న తరువాత, బుమ్రా వంటి బౌలర్‌పై నాకు ఎటువంటి సమస్య ఉండేది కాదు. అతనిపైనే ఒత్తిడి ఉండేది. బుమ్రా చాలా బాగా రాణిస్తున్నాడు. చాలా మెరుగయ్యాడు కూడా. అతడి యాక్షన్ భిన్నంగా ఉంటుంది. సీమ్‌ను ఖచ్చితంగా ఉంటుంది కాబట్టే అతను ప్రభావవంతమైన ఆటగాడు కాగలిగాడు" అని రజాక్ అన్నాడు.

ప్రపంచ No.1 వన్డే బౌలర్‌గా

ప్రపంచ No.1 వన్డే బౌలర్‌గా

ప్రపంచ No.1 వన్డే బౌలర్‌గా కొనసాగుతున్న జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుత యుగంలో అత్యుత్తమ పేసర్లలో ఒకడిగా కొనియాడబడుతున్నాడు. అత్యంత తక్కువ వ్యవధిలో టీమిండియా బౌలింగ్ యూనిట్‌లో ప్రధాన పేసర్‌గా నిలిచాడు. 2018లో కేప్‌టౌన్ టెస్టులో అరంగేట్రం చేసిన బుమ్రా ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో 5వ బౌలర్‌గా కొనసాగుతున్నాడు.

1996 నుంచి 2011 మధ్య కాలంలో

1996 నుంచి 2011 మధ్య కాలంలో

1996 నుంచి 2011 మధ్య కాలంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు అబ్దుల్ రజాక్ ప్రాతినిథ్యం వహించాడు. 2000ల్లో అబ్దుల్ రజాక్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ జట్టు ప్రపంచ క్రికెట్‌కు అందించిన అత్యుత్తమ ఆల్ రౌండర్లలో అబ్దుల్ రజాక్ ఒకడు.

Story first published: Wednesday, December 4, 2019, 18:29 [IST]
Other articles published on Dec 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X