న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెట్టింపు పాయింట్లు ఇవ్వాల్సిందే: టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కోహ్లీ కొత్త సూచన

IND vs SA 2019,2nd Test : Kohli Wants World Test Championships Points Doubled For Away Test Wins
I would have doubled points for away wins: Virat Kohli on World Test Championship table

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాయింట్ల వ్యవస్థను మార్చాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించాడు. కోహ్లీని గనుక పాయింట్ల పట్టిక చేయమని అడిగితే... విదేశీ గడ్డపై టెస్టు గెలిస్తే పాయింట్లను రెట్టింపు చేస్తానని పేర్కొన్నాడు.

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆటగాళ్లకు చాలా ఎక్కువ డిమాండ్ ఉన్నాయని... ప్రస్తుత ఫార్మాట్‌లో తాను చేయాలనుకుంటున్న ఏకైక మార్పు ఏదైనా ఉందంటే విదేశాల్లో టెస్టు సిరిస్ గెలిస్తే రెట్టింపు పాయింట్లు ఇవ్వాలని విరాట్ కోహ్లీ తెలిపాడు. గత కొన్నేళ్లుగా స్వదేశంలో జరిగే టెస్టుల్లో ఆతిథ్య జట్టుదే పైచేయిగా ఉంటోంది.

ముఖ్యంగా సొంతగడ్డపై ప్రత్యర్ధి జట్లు తమకు అనుకూలంగా పిచ్‌లను రూపొందించుకుంటాయనే అపవాదు కూడా ఉంది. ఈ నేపథ్యంలో విదేశీ గడ్డపై టెస్టులను నెగ్గితే రెట్టింపు పాయింట్లు ఇవ్వాలనే సూచనను కోహ్లీ తెరపైకి తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "మీరు నన్ను పాయింట్ల పట్టిక తయారు చేయమని అడిగితే... విదేశాల్లో టెస్టు గెలిస్తే నేను రెట్టింపు పాయింట్లు ఇస్తాను" అని అన్నాడు.

అసలేం జరిగింది?: జహీర్ vs పాండ్యా, అహంకారం ప్రదర్శించకుండా మర్యాదగా వ్యవహరించుఅసలేం జరిగింది?: జహీర్ vs పాండ్యా, అహంకారం ప్రదర్శించకుండా మర్యాదగా వ్యవహరించు

నాకు ఇష్టమైన విషయం అదే

"ఈ తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ముగిసిన తర్వాత నేను ఖచ్చితంగా చూడటానికి ఇష్టపడే విషయం ఇదీ. ఈ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ప్రతి గేమ్ కూడా ఎంతో ముఖ్యం. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ వంటి పరిస్థితులలో గతంలో జట్లు డ్రా కోసం ఆడేవి... కానీ, జట్లు ఇప్పుడు విజయం కోసం ఆడుతున్నాయి. అదనపు పాయింట్లను పొందుతాయి. టెస్టుల్లో ఇది గొప్పదని నా అభిప్రాయం" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మ్యాచ్‌లు ఎంతో ఆసక్తికరంగా

"ప్రస్తుతం మ్యాచ్‌లు ఎంతో ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రతి సెషన్‌లోనూ మేం పూర్తి ప్రొపెషనల్స్ మాదిరి ఆడాలి. ఆటగాళ్లకు మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే క్రికెట్ ప్రమాణాలను అత్యుత్తమంగా ఉంచాలి. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ వచ్చిన తర్వాత టెస్టులలో ఏవైనా మార్పులు వచ్చాయంటే అవి ఇవి మాత్రమే" అని కోహ్లీ తెలిపాడు.

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా గురువారం నుంచి పూణె వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది 50వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. కెప్టెన్‌గా టీమిండియాకు ఇప్పటికే అనేక విజయాలను సాధించిన విరాట్ కోహ్లీ.... పూణె టెస్టుతో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకోనున్నాడు.

అన్ని వేదికల్లోనూ విజయం

అన్ని వేదికల్లోనూ విజయం

కోహ్లీ సారథ్యంలో టీమిండియా స్వదేశంలో ఆడిన అన్ని వేదికల్లోనూ విజయాన్ని సాధించింది. ఒక్క పూణెలో తప్ప. ఈ స్టేడియంలో జరిగిన ఒకే ఒక్క టెస్టులో టీమిండియా ఓడిపోయింది. 2017లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్టులో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీతో చెలరేగడంతో ఆస్ట్రేలియా 333 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కోహ్లీ

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కోహ్లీ

ఈ నేపథ్యంలో ఈ టెస్టుని కోహ్లీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇప్పటికే టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. విశాఖ టెస్టులో భారత్ 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంతో భారీ విజయాన్ని అందుకుని సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. ఈ టెస్ట్ విజయంలో భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 160 పాయిట్లతో అగ్రస్థానంలో ఉంది.

Story first published: Wednesday, October 9, 2019, 15:24 [IST]
Other articles published on Oct 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X