న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రనౌటై వస్తోన్న ధోనీని చూసి కన్నీళ్లు ఆగలేదు!: ప్రపంచకప్‌‌లో కివీస్‌తో సెమీస్ మ్యాచ్‌పై చాహల్

'Held Back My Tears When Mahi Bhai Got Run Out' : Yuzvendra Chahal || Oneindia Telugu
“I was trying to hold back my tears when Mahi bhai got out”, Chahal recalls the agony of WC semi loss

హైదరాబాద్: ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో ధోని ఔటైన సమయంలో తన కళ్ల నుంచి వచ్చిన కన్నీళ్లను నిలువరించడానికి ప్రయత్నించినట్లు చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ చెప్పుకొచ్చాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా బుధవారం(జులై 10)న కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను ఎమోషనల్‌కు గురైనట్లు చాహల్ తెలిపాడు.

న్యూజిలాండ్ చేతిలో ఓటమిని తాను జీర్ణించుకోలేకపోయానని న్యూఢిల్లీలో ఇండియా టుడే 10వ ఎడిషన్ మైండ్ రాక్స్ యూత్ సమ్మిట్‌లో చాహల్ వివరించాడు. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజాతో కలిసి ఏడో వికెట్‌కు మహేంద్ర సింగ్ ధోని 116 పరుగులు జోడించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాపార్డర్ విఫలం కావడంతో గెలిపించే బాధ్యతను ధోని తన భుజానికి ఎత్తుకున్నాడు.

ఓపెనర్‌గా ఒక అవకాశం ఇవ్వాలని జట్టుని వేడుకున్నా: సచిన్ఓపెనర్‌గా ఒక అవకాశం ఇవ్వాలని జట్టుని వేడుకున్నా: సచిన్

ధోని రనౌట్

ధోని రనౌట్

జడేజా 59 బంతుల్లో 77 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరగా... ఆ తర్వాత ధోని (72 బంతుల్లో 50) దూకుడుగా ఆడే క్రమంలో మార్టిన్ గుప్టిల్ రనౌట్‌కు బలయ్యాడు. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ధోని ఔటై పెవిలియన్‌కు చేరే క్రమంలో యజువేంద్ర చాహల్ క్రీజులోకి వెళ్లాడు. తాజాగా ఆ సంఘటనను గుర్తు చేసుకున్నాడు.

చాహల్ మాట్లాడుతూ

చాహల్ మాట్లాడుతూ

చాహల్ మాట్లాడుతూ "ఇది నాకు తొలి వరల్డ్‌‌కప్. మహీ భాయ్(ధోని) ఔటై పెవిలియన్‌కు చేరే క్రమంలో నేను బ్యాటింగ్‌కు వెళ్తున్నాను. ఆ సమయంలో నా కళ్ల వెంట వస్తోన్న కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నించా. అది నన్ను చాలా నిరుత్సాహపరిచింది. టోర్నీలో వరుసగా 9 మ్యాచ్‌ల్లో అద్భుతంగా ఆడి ఆఖర్లో నిష్క్రమించాం" అని తెలిపాడు.

వర్షం మన చేతుల్లో లేదు

వర్షం మన చేతుల్లో లేదు

"వర్షం మన చేతుల్లో లేదు కాబట్టి ఏమీ చెప్పడం సరైనది కాదు(అంతరాయం గురించి). మైదానం నుంచి వీలైనంత త్వరగా తిరిగి హోటల్‌కు తిరిగి వెళ్లాలని మేము కోరుకోవడం ఇదే మొదటిసారి. నేను 5-6 సంవత్సరాలు కొనసాగించాలనుకుంటున్నాను. నేను కనీసం ఒక ప్రపంచ కప్ గెలవాలనుకుంటున్నాను" అని చాహల్ తెలిపాడు.

వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ గెలిస్తే

వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ గెలిస్తే

"నేను ఆడుతున్న విధానం, మా జట్టు ప్రస్తుతం ఎలా రూపాంతరం చెందుతుంతో... అదొక సానుకూల సంకేతం. మేము న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లలో గెలిచాము. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ గెలిస్తే, విమర్శలన్నీ ఆగుతాయి" అని చాహల్ చెప్పుకొచ్చాడు. వెస్టిండిస్ పర్యటనతో పాటు స్వదేశంలో సఫారీలతో జరిగిన టీ20 సిరిస్‌కు చాహల్ ఎంపిక కాలేదు.

Story first published: Saturday, September 28, 2019, 16:55 [IST]
Other articles published on Sep 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X