న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసక్తికరం: కివీస్ ఓడిన మూడు సూపర్ ఓవర్ మ్యాచ్‌లకు కామెంటేటర్ అతడే!

‘I’ve lost years of my life’: Three Super Overs, three New Zealand defeats and the same commentator


హైదరాబాద్: సూపర్ ఓవర్.. బ్లాక్ క్యాప్స్‌ను నీడలా వెంటాడుతోంది. గత ఏడు నెలల కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో న్యూజిలాండ్ మూడు సూపర్ ఓవర్లు ఆడగా... మూడింట పరాజయాన్నే చవిచూసింది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఈ మూడు సందర్భాల్లోనూ న్యూజిలాండ్‌ తరఫున కామెంటరీ బాక్స్‌లో ఇయాన్‌ స్మిత్‌ ఉన్నాడు.

న్యూజిలాండ్‌ మాజీ వికెట్‌ కీపర్‌ అయిన ఇయాన్‌ స్మిత్‌ వరుసగా కివీస్‌ ఓడిపోయిన మూడు సూపర్‌ ఓవర్ల మ్యాచ్‌లకు కామెంటేటర్‌గా వ్యవహరించాడు. ఐదు టీ20ల సిరిస్‌లో భాగంగా బుధవారం సెడాన్ పార్కులో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీయడంతో స్మిత్‌ తనదైన శైలిలో ఛలోక్తులు విసిరాడు.

అదే మా కొంప ముంచింది: విలియమ్సన్అదే మా కొంప ముంచింది: విలియమ్సన్

మూడు సూపర్‌ మ్యాచ్‌ల్లో

మూడు సూపర్‌ మ్యాచ్‌ల్లో

"న్యూజిలాండ్‌ ఆడిన గత మూడు సూపర్‌ మ్యాచ్‌ల్లో నేను కామెంటేటర్‌గా ఉన్నా. ఈ సమయంలో నా జీవితాన్ని కోల్పోయాననే అనుకుంటున్నా. ఈ మ్యాచ్‌ కూడా టైగా ముగిస్తే నేను రిటైర్డ్‌ అయిపోయినట్లే. కానీ సూపర్‌ ఓవర్‌ను నేను ప్రేమిస్తా.. కచ్చితంగా ప్రేమిస్తా" అని ఇయాన్ స్మిత్ కామెంటేటర్‌ బాక్సులో నవ్వులు పూయించాడు.

టీ20ల్లో మొత్తం ఏడు సార్లు

టీ20ల్లో మొత్తం ఏడు సార్లు

అంతర్జాతీయ టీ20ల్లో మొత్తం ఏడు సార్లు సూపర్ ఓవర్ ఆడిన న్యూజిలాండ్ 6 సార్లు ఓడి కేవలం ఒక్కసారి మాత్రమే గెలిచింది. 2008 ఆస్ట్రేలియాపై గెలిచిన తర్వాత ఇప్పటి వరకు సూపర్ ఓవర్‌లో కివీస్ గెలవలేదు. అంతర్జాతీయ టీ20ల్లో తొలి సూపర్ ఓవర్ ఆడిన న్యూజిలాండ్.. అత్యధిక సార్లు ఆడిన జట్టుగా కూడా రికార్డుకెక్కింది.

వరల్డ్‌కప్ ఫైనల్లో

వరల్డ్‌కప్ ఫైనల్లో

టీ20ల్లో ఐదుసార్లు, వన్డేల్లో ఒకసారి కివీస్‌ సూపర్‌ ఓవర్‌లో ఓడిపోయింది. గతేడాది వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో సూపర్‌ ఓవర్‌తోనే కివీస్ టైటిల్‌ను చేజార్చుకుంది. ఆ సూపర్ ఓవర్ టైగా ముగిసినా బౌండరీల నిబంధన ఆధారంగా ఇంగ్లాండ్‌ను విశ్వ విజేతగా ప్రకటించగా... న్యూజిలాండ్‌ రన్నరప్‌గా నిలిచింది.

నవంబర్‌లో సొంతగడ్డపై

నవంబర్‌లో సొంతగడ్డపై

వరల్డ్‌కప్ ముగిసిన అనంతరం నవంబర్‌లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడిన కివీస్.. ఆక్లాండ్ వేదికగా జరిగిన డిసైడర్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లోనే పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 146 పరుగులే చేయగా.. అనంతరం ఇంగ్లండ్ కూడా 146 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది.

సూపర్ ఓవర్‌లో ఇంగ్లాండ్ 17 పరుగులు

సూపర్ ఓవర్‌లో ఇంగ్లాండ్ 17 పరుగులు

ఇక సూపర్ ఓవర్‌లో ఇంగ్లాండ్ 17 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ ఏడు పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. తాజాగా టీమిండియాతో టీ20 మ్యాచ్‌ ఆడిన సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌లో కివీస్‌ పరాజయం పాలైంది. ఈ మూడు సూపర్‌ ఓవర్‌ సందర్భాల్లోనూ కివీస్‌ ఒక వరల్డ్‌కప్‌తో పాటు రెండు సిరీస్‌లను కోల్పోయింది.

Story first published: Thursday, January 30, 2020, 17:19 [IST]
Other articles published on Jan 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X