న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ధోనీ స్థానాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేను.. కనీసం ఆ ఆలోచనల జోలికే పోను'

I’ll never be able to fill MS Dhoni’s shoes says Hardik Pandya

ముంబై: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ స్థానాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేను. అసలు ఆ ఆలోచనల జోలికే పోను. అయితే ఆ సవాల్‌ను ఎదుర్కోవడానికి మాత్రం సిదంగా ఉన్నా అని టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య అన్నాడు. గతంలో టీమిండియా ఏడో స్థానంలో ధోనీ ఆడేవాడు. ఇప్పుడు ఆ ఫినిషర్ పాత్రను పాండ్య పోషించగలడు అని పోలికలు వస్తుండటంపై పైవిధంగా హార్దిక్‌ స్పందించాడు.

<strong>ఇంగ్లండ్‌కు షాక్‌.. గాయం కారణంగా స్టార్ బౌలర్ దూరం!!</strong>ఇంగ్లండ్‌కు షాక్‌.. గాయం కారణంగా స్టార్ బౌలర్ దూరం!!

ధోనీ స్థానాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేను:

ధోనీ స్థానాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేను:

తాజాగా ఇండియా టుడే 'ఇన్‌స్పిరేషన్' కార్యక్రమంలో ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌తో కలిసి పాండ్య పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు విషయాలను పంచుకున్నాడు. 'ధోనీ స్థానాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేను. అసలు ఆ ఆలోచనల జోలికే పోను. అయితే ఆ సవాల్‌ను ఎదుర్కోవడానికి మాత్రం సిదంగా ఉన్నా. నేనేం చేసినా అది జట్టు కోసమే. నిచ్చెన మెట్లను ఒక్కొక్కటిగా ఎక్కితేనే ట్రోఫీ దొరుకుతుంది' అని పాండ్య పేర్కొన్నాడు.

బంతి నా కోర్టులో లేదు:

బంతి నా కోర్టులో లేదు:

'కాఫీ విత్‌ కరణ్‌' షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు బంతి తన కోర్టులో లేదని పాండ్య అంటున్నాడు. 'క్రికెటర్లుగా అక్కడ ఏం జరగబోతోందో మాకేం తెలియదు. బంతి నా కోర్టులో లేదు. అది మరొకరి కోర్టులో ఉంది. అక్కడి నుంచి బంతిని తన్నాల్సింది కూడా వారే. ఏదేమైనా అది కచ్చితంగా చాలా ప్రమాదకరమైన ప్రదేశం. ఎవరూ అక్కడ ఉండాలనుకోరు' అని హాక్‌ పాండ్య చెప్పుకొచ్చాడు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో బీసీసీఐ రాహుల్-పాండ్యలను సస్పెండ్‌ చేసింది. అయితే క్షమాపణలు చెప్పడంతో బీసీసీఐ వెనక్కు తగ్గింది.

ఇంగ్లాండ్‌లో శస్త్రచికిత్స:

ఇంగ్లాండ్‌లో శస్త్రచికిత్స:

గత ఏడాది సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20లో హార్దిక్ చివరిసారిగా భారత్ తరఫున ఆడాడు. వెన్నెముక దిగువ భాగంలో నొప్పి అధికమవడంతో.. పాండ్యకు ఇంగ్లాండ్‌లో శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. త్వరలో న్యూజిలాండ్‌లో జరిగే భారత్‌-ఏ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ రాణిస్తే జట్టులోకి వస్తాడు.

నటాషాతో ఎంగేజ్‌మెంట్‌:

నటాషాతో ఎంగేజ్‌మెంట్‌:

పాండ్య ఎంగేజ్‌మెంట్‌ బాలీవుడ్‌ నటి, సెర్బియాకు చెందిన నటాషా స్టాన్‌కోవిచ్‌తో తాజాగా జరిగింది. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో స్పీడ్‌ బోట్‌లో విహరిస్తూ హార్దిక్ త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌కు రింగ్ తొడిగాడు. ఫొటోలు షేర్ చేసి.. 'నీకు నేను, నాకు నువ్వు, హిందుస్తాన్ మొత్తానికి ఇది తెలియాలి' అని క్యాప్షన్ పెట్టాడు.

Story first published: Thursday, January 9, 2020, 14:54 [IST]
Other articles published on Jan 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X