న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: చెన్నై సూపర్ కింగ్స్ నన్ను నిజమైన క్రికెటర్‌ని చేసింది

హైదరాబాద్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌లో ఆడటంతోనే తాను నిజమైన క్రికెటర్‌గా పరివర్తన చెందానని సురేశ్ రైనా అన్నాడు. టీమిండియాకు దూరమైన సురేశ్‌ రైనా ఐపీఎల్‌లో ఆడటంతో తన లోటు తీరనుందని పేర్కొన్నాడు.

160 పరుగులకే కుప్పకూలి..

160 పరుగులకే కుప్పకూలి..

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ దేశవాళీ టీ20 టోర్నీలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టైన బెంగాల్‌తో తలపడింది. ఉత్తరప్రదేశ్ సారథిగా వ్యవహరించిన రైనా సోమవారం 59 బంతుల్లో 126 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేయగా.. ఛేదనలో బెంగాల్ 16.1 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలిపోయింది.

 సురేశ్ రైనాని అట్టిపెట్టుకున్న..:

సురేశ్ రైనాని అట్టిపెట్టుకున్న..:

ఐపీఎల్ 2018కిగానూ ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకునే ఆటగాళ్లను మినహాయించి వేలానికి మిగిలిన వారిని ప్రకటించింది. దీంతో రెండేళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఐపీఎల్ ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీలో మహేంద్రసింగ్ ధోని, రవీంద్ర జడేజాతో పాటు సురేశ్ రైనాని అట్టిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సురేశ్ రైనా ఇలా స్పందించాడు.

 జట్టు కాదు.. ఫ్యామిలీ:

జట్టు కాదు.. ఫ్యామిలీ:

‘చెన్నై సూపర్ కింగ్స్ తరఫున చాలా మ్యాచ్‌లు ఆడాను. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ ఆ జట్టుకి ఆడే అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉంది. చెన్నై జట్టుతోనే నేను రియల్ క్రికెటర్‌గా ఎదిగాను. జట్టు కోచ్‌లు హెడెన్, హస్సీ, మురళీధరన్ నుంచి చాలా నేర్చుకున్నా. చెన్నై ఒక జట్టు కాదు.. ఫ్యామిలీ' అని రైనా ఉద్వేగానికి లోనయ్యాడు.

 నిజం చెప్పాలంటే నేను:

నిజం చెప్పాలంటే నేను:

‘ధోనీ, జడేజా, నేనూ చాలా మ్యాచులు కలిసే ఆడాం. మేం మళ్లీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడతాం. నిజం చెప్పాలంటే నేను చెన్నైలోనే అసలైన క్రికెటర్‌గా పరివర్తన చెందా. మాథ్యూ హెడేన్‌, మైకేల్‌ హస్సీ, ముత్తయ్య మురళీధరన్‌ వంటి కోచ్‌లు, ఆటగాళ్లు నాపై ప్రభావం చూపారు. వారి నుంచి నేను చాలా నేర్చుకున్నా. అదొక జట్టు కాదు కుటుంబం' అని రైనా చెప్పాడు.

 ఎంత ప్రేమ చూపించారో:

ఎంత ప్రేమ చూపించారో:

చెన్నై సూపర్‌ కింగ్స్‌ జెర్సీ ఎప్పుడు ధరిస్తానా అని ఎదురుచూస్తున్నట్టు రైనా తెలిపాడు. ‘అక్కడి ప్రేక్షకులు నాపై ఎంత ప్రేమ చూపించారో మాటల్లో చెప్పలేను. జట్టు వాతావరణం చాలా బాగుంటుంది. అశ్విన్‌, నేగి, జడేజా వంటి వారంతా చెన్నై నుంచే వచ్చారు. తిరిగి మేమంతా కలుసుకునేందుకు అత్యంత ఆత్రుతగా ఉన్నాం' అని పేర్కొన్నాడు. తన ఫిట్‌నెస్‌ గురించి మాట్లాడాడు.

ఒకే ప్రేరణతో ఆడతా:

ఒకే ప్రేరణతో ఆడతా:

‘ఫిట్‌నెస్‌ పెంచుకునేందుకు ప్రతి రోజు జిమ్‌లో కసరత్తులు మాత్రమే కాదు ఇంకెన్నో చేస్తాం. మైదానంలో పరుగులు తీస్తాం. అటు మానసికంగా తెలివిగా ఆలోచించాలి. నెట్స్‌లో బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ సాధన చేయలి. నేను 40 శాతం జిమ్‌పై, 60 శాతం నైపుణ్యంపై ఆధారపడతా. ప్రతి మ్యాచ్‌ను ఓకే లక్ష్యంతో ఒకే ప్రేరణతో ఆడతా. దక్షిణాఫ్రికాలో ఓటమిపాలైన టీమిండియాపై విమర్శలు చేయకుండా మద్దతుగా నిలవాలి' అని పేర్కొన్నాడు.

 ఐపీఎల్ చరిత్రలో..:

ఐపీఎల్ చరిత్రలో..:

సుదీర్ఘ ఐపీఎల్ చరిత్రలో రైనా 161 మ్యాచ్‌లాడిన 139.09 స్ట్రైక్‌రేట్‌తో 4,540 పరుగులు సాధించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 23, 2018, 11:54 [IST]
Other articles published on Jan 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X