ఓల్డ్ మ్యాన్ అంటూ ధోనీ టీజ్ చేసేవాడు.. దీంతో అతనికో సవాల్ విసిరా: బ్రావో

చెన్నై: వయసు అయిపోయిందంటూ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనను ఆటపట్టించేవాడని వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో తెలిపాడు. ఇక ఈ విండీస్ వీరుడు ఐపీఎల్‌లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ 2018 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ అందుకోగా.. జట్టు విజయంలో బ్రావో కీలక పాత్ర పోషించాడు. అవసరమైనప్పుడల్లా బ్యాట్‌తోను అలరించాడు. కానీ.. ఆ సీజన్‌లో తనకు వయసు అయిపోయిందంటూ ధోనీ ఏడిపించేవాడని తాజాగా బ్రావో గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్ నిరవధికంగా వాయిదాపడటంతో చెన్నై ఫ్రాంచైజీ తమ ఆటగాళ్లతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్స్ నిర్వహిస్తుంది. ఇందులో పాల్గొన్న ఈ విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ నేపథ్యంలోనే ధోనీ టీజింగ్ వ్యవహారాన్ని ప్రస్తావించాడు.

పరుగుపందెం పెట్టుకున్నాం..

ధోనీ టీజింగ్‌తో అతనికో ఓ సవాల్ విసిరినట్లు గుర్తు చేసుకున్నాడు. 2018 ఐపీఎల్ సీజన్ ఫైనల్‌ అనంతరం వికెట్ల మధ్య పరుగెత్తాలని తాము నిర్ణయించుకున్నట్లు బ్రావో చెప్పుకొచ్చాడు. ‘2018 ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుంచి ధోనీ నన్ను.. నీకు వయసు అయిపోయింది.. వేగంగా పరుగెత్తలేకపోతున్నావ్..! అంటూ టీజ్ చేశాడు. దీంతో.. ఇద్దరం వికెట్ల మధ్య పరుగు పందెంలో పోటీపడదామని సవాల్ విసిరాను. దానికి ఫస్ట్ ధోనీ నో చెప్పాడు. అయితే ఫైనల్ తర్వాత పోటీపడదామని చెప్పాను. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఫైనల్ ముగిసిన అనంతరం సవాల్ మేరకు ఇద్దరం పోటీపడ్డాం. కానీ.. ధోనీ కొద్ది తేడాతో రేసులో విజయం సాధించాడు'అని బ్రావో గుర్తు చేసుకున్నాడు.

దూరం మరచి.. వైరం పెరిగి.. మైదానంలోనే చితక్కొట్టుకున్న ఆటగాళ్లు!! (వీడియో)

 సీఎస్‌కే ఓ కుటుంబం..

సీఎస్‌కే ఓ కుటుంబం..

2011 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే ) జట్టుకు ఆడుతున్న బ్రావో.. కెప్టెన ధోనీ, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. చెన్నై జట్టు ఒక కుటుంబం లాంటిద‌న్నాడు. ధోనీ,కోచ్ ఫ్లెమింగ్ త‌న‌పై పూర్తి విశ్వాసం ఉంచుతార‌న్నాడు. 'చెన్నై సూప‌ర్ కింగ్స్ కేవ‌లం జ‌ట్టే కాదు. అది ఒక కుటుంబం లాంటిది. చెన్నై త‌ర‌ఫున చాన్నాళ్లుగా ఆడుతున్న ఆట‌గాళ్ల‌కు ఈ విష‌యం బాగా తెలిసి ఉంటుంది. ఆ టీమ్‌లో చేరిన ఆటగాళ్లు ఎంతో నేర్చుకుంటారు. నేను వేరే ఫ్రాంచైజీలో కూడా ఆడాను. కానీ.. నాకు ఇక్కడ లభించిన మద్దతు ఎక్కడా దొరకలేదు' అని అన్నాడు.

 రాయుడికి టెంపర్ ఎక్కువ..

రాయుడికి టెంపర్ ఎక్కువ..

తన సహచర ప్లేయర్, హైదరాబాద్ క్రికెటర్‌ అంబటి రాయుడిపై బ్రావో సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాయుడికి టెంపర్ ఎక్కువని, అలాంటి ఆటగాడిని చెన్నై ఎందుకు తీసుకుందో అర్థం కాలేదన్నాడు. అతనికి కోపం ఎక్కువ‌ని, అందుకే త‌ర‌చూ రెచ్చ‌గొట్టేవాడినన్నాడు. సీఎస్‌కే తరఫున 104 మ్యాచులు ఆడిన బ్రావో 121 వికెట్లు తీశాడు. అంతేకాక 2013, 2015 సీజన్లలో అత్యధిక వికెట్లు తీసి 'పర్పుల్ క్యాప్‌'ని కూడా సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఏడాది తర్వాత బ్రేవో తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. బ్రేవో 2018 అక్టోబర్‌లో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 2012, 2016ల్లో విండీస్‌ గెలిచిన టీ20 వరల్డ్‌కప్‌లో సభ్యుడు. విండీస్‌ క్రికెట్‌ బోర్డు పెద్దలపై తిరుగుబాటు చేసి రిటైర్మెంట్‌ ఇచ్చాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, April 21, 2020, 11:37 [IST]
Other articles published on Apr 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X