న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే అది ధోనీ పెట్టిన బిక్షే: హార్దిక్ పాండ్యా

Hardik Pandya reveals how MS Dhoni saved his career

న్యూఢిల్లీ: కెరీర్ ప్రారంభంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇచ్చిన మద్దతుతోనే తాను ఈ రోజు ఈ స్థాయికి చేరుకోగలిగానని స్టార్ ఆల్‌రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే దారుణంగా విఫలమైన తనపై ధోనీ అపార నమ్మకం చూపించాడని తెలిపాడు. కెరీర్‌‌లో ఆడిన మూడు మ్యాచ్‌లకే ప్రపంచకప్ జట్టులోకి ఎంపిక చేసాడని గుర్తుచేసుకున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో హార్దిక్ పాండ్యా వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన కనబర్చడంతో పాటు కెప్టెన్‌గా సత్తా చాటి గుజరాత్ టైటాన్స్‌కు తొలి టైటిల్ అందించాడు. దాంతో హార్దిక్‌ను ధోనీకి జూనియర్ వర్షన్ అంటూ కితాబిచ్చారు. అచ్చం ధోనీలానే ప్రశాంతంగా ఉంటూ చురుకైన నిర్ణయాలు తీసుకుంటున్నాడని ప్రశంసించారు.

ఈ క్రమంలోనే ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో తన కెప్టెన్సీని ధోనీతో పొల్చడంపై స్పందించిన హార్దిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అసలు ధోనీ వల్లనే తాను ఈ స్థాయికి రాగలిగానని, ఇదంతా అతను పెట్టిన బిక్షేనని తెలిపాడు. 'నా అరంగేట్ర మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాను. ఎంతలా అంటే నేను వేసిన తొలి ఓవర్‌లోనే 21 పరుగులు సమర్పించుకున్నాను. నాకు తెలిసి ఇలా కెరీర్ తొలి ఓవర్‌లోనే ఇన్ని పరుగులిచ్చుకున్న తొలి క్రికెటర్ నేనే అనుకుంట. ఆ క్షణం ఇదే నా చివరి ఓవర్ కావచ్చనుకున్నా. కానీ నేను చాలా అదృష్టవంతుడిని. ధోనీ సారథ్యంలో ఆ ఓవర్ వేసాను కాబట్టి అతను నన్ను పక్కనపెట్టకుండా అండగా నిలిచాడు. నాపై అపార నమ్మకం ఉంచాడు. కెరీర్‌లో నా సక్సెస్‌కు సహకరించాడు.

నేను భారత జట్టులో చేరినప్పుడు నేను ఏ ఆటగాళ్లను చూసి పెరిగానో వారే ఉన్నారు. సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, ఆశిష్ నెహ్రాలు నేను ఇండియాకు ఆడకముందే స్టార్ ఆటగాళ్లు. నేను వారితో ఆడటం గొప్పగా ఫీలయ్యాను. ఇంటర్నేషన్ క్రికెట్‌లో ఆడిన మూడో మ్యాచ్‌లకే ధోనీ నన్ను ప్రపంచకప్ జట్టులోకి తీసుకున్నాడు. నువ్వు వరల్డ్ కప్ టీమ్‌లో ఆడుతున్నావని ధోనీ భాయ్ చెప్పాడు. ఆ క్షణం నా కల నెరవేరినట్లు అనిపించింది'అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.

ఇక ఐపీఎల్‌-2022 సీజన్‌లో హార్దిక్ పాండ్యా 15 మ్యాచ్‌లు ఆడి 487 పరుగులతో పాటు, 8 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్లో 3/17 బెస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టు ఓటమిని శాసించాడు. ఈ ప్రదర్శనతో హార్దిక్ మళ్లీ టీమిండియా పిలుపును అందుకున్నాడు. సౌతాఫ్రికాతో గురువారం నుంచి ప్రారంభం కానున్న 5 టీ20ల సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ సిరీస్ కోసం హార్దిక్ సమాయత్తం అవుతున్నాడు.

Story first published: Monday, June 6, 2022, 21:39 [IST]
Other articles published on Jun 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X