న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ : అదే నా కెప్టెన్సీ మంత్ర.. వాళ్ల వల్లే ఈ ట్రోఫీ: హార్దిక్ పాండ్యా

Hardik Pandya reveals his captaincy mantra after INDvsNZ series win

కివీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. ఈ సిరీస్‌లో అద్భుతంగా ఆడిన భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు కూడా దక్కింది. భారత ఆటగాళ్లు కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారని, సపోర్ట్ స్టాఫ్ కూడా తమ విజయంలో చాలా కీలక పాత్ర పోషించారని పాండ్యా చెప్పాడు. ఇప్పటి వరకు పాండ్యాకు పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ లభించిన తర్వాత ఒక్క సిరీస్ కూడా ఓడిపోకపోవడం గమనార్హం.

వాళ్లదే కీలక పాత్ర..

వాళ్లదే కీలక పాత్ర..

తనకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కడంపై సంతోషం వ్యక్తం చేసిన పాండ్యా.. 'నాకు ఓకే. కానీ కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు కూడా ఉన్నాయి. అవి చాలా గొప్పవి' అంటూ తన సహచర ఆటగాళ్లను మెచ్చుకున్నాడు. అలాగే తనకు ఈ అవార్డు దక్కడంలో సహాయక సిబ్బంది, జట్టు చాలా కీలక పాత్ర పోషించారని కొనియాడాడు. ఈ జట్టు తరఫునే తను ఈ ట్రోఫీ తీసుకుంటున్నానని, ఈ విషయంలో చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన సిరీస్ డిసైడర్‌లో పాండ్యా 30 పరుగులు చేయడంతోపాటు 4 కీలక వికెట్లు తీసుకున్న సంగతి తెలిసిందే.

టాప్ వికెట్ టేకర్..

టాప్ వికెట్ టేకర్..

కివీస్‌తో సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో అదరగొట్టిన పాండ్యా అంతకుముందు బ్యాటుతో అంతగా రాణించలేదు. ఈ సిరీస్‌లో పాండ్యా మొత్తం 66 పరుగులు మాత్రమే చేశాడు. సిరీస్‌లో ఎక్కువ మ్యాచులు బౌలింగ్‌కు సహకరించే పిచ్‌లపై జరగడంతో ఏ ఆటగాడూ బ్యాటుతో అంతగా రాణించలేదు. అదే సమయంలో మూడు మ్యాచుల్లో కలిపి 5 వికెట్లు తీసుకున్న పాండ్యా.. సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచాడు. మరో పేసర్ అర్షదీప్ సింగ్ కూడా ఐదు వికెట్లు తీసుకోవడం గమనార్హం. అయితే పాండ్యా ఎకానమీ కూడా మెరుగ్గానే ఉంది. దానికితోడు అడపాదడపా బ్యాటుతో కూడా ఫర్వాలేదనిపించాడు. దీంతో అతనికి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు దక్కింది.

 కెప్టెన్సీ మంత్ర..

కెప్టెన్సీ మంత్ర..

ఇప్పటి వరకు పాండ్యా సారధ్యంలో టీమిండియా 11 టీ20లు మ్యాచులు ఆడింది. వీటిలో ఎనిమిదింట గెలిచిన భారత జట్టు.. కేవలం రెండింట్లో మాత్రమే ఓడింది. ఈ రికార్డుపై కూడా పాండ్యా స్పందించాడు. తను కెప్టెన్సీ చేసే సమయంలో మరీ ఎక్కువగా ఆలోచించనని చెప్పాడు. పరిస్థితిని బట్టి చాలా సింపుల్‌గా నిర్ణయాలు తీసుకుంటానని, తర్వాత ఏం జరుగుతుందో అనే ఆలోచనతో ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోనని చెప్పాడు. 'ఒకవేళ నేను కింద పడితే.. అది కూడా నా నిర్ణయమే' అదే తన కెప్టెన్సీ మంత్ర అని వెల్లడించాడు.

Story first published: Thursday, February 2, 2023, 12:38 [IST]
Other articles published on Feb 2, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X