న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ : సిరీస్ డిసైడర్‌లో పాండ్యా చేసిన పొరపాట్లు ఇవే.. మాస్టర్‌స్ట్రోక్ ఏదంటే?

 Hardik Pandya made two mistakes and a masterstroke Third T20 match

కివీస్‌తో నిర్ణయాత్మక మూడో టీ20లో భారత జట్టు అద్భుతమైన విజయం సాధించింది. ఏకంగా 168 పరుగుల తేడాతో టీమిండియా భారీ విక్టరీ సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో కూడా కెప్టెన్ హార్దిక్ పాండ్యా కొన్ని పొరపాట్లు చేశాడు. కానీ ఒక మాస్టర్ స్ట్రోక్‌ కారణంగా ఆ పొరపాట్లు పనిచేయలేదు. అవేంటంటే..

బౌలర్ల వాడకం..

బౌలర్ల వాడకం..

కీలకమైన ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా తన బౌలర్లను సరిగా వాడుకోలేదు. కొత్త బంతితో తనే ఎటాక్ ప్రారంభించిన అతను.. ఆ తర్వాతైనా శివమ్ మావికి అవకాశం ఇవ్వాల్సింది. కానీ అలా చేయలేదు. తన కోటా ఓవర్లు పూర్తి చేశాడు. కానీ అర్షదీప్ సింగ్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ ముగ్గురూ కూడా తమ కోటా పూర్తి చేయలేదు. అందుకని పాండ్యా బౌలింగ్‌ను తప్పుబట్టలేం. అతను నాలుగు వికెట్లు తీసుకున్నాడు కదా. అయితే ఇలాంటి ప్రెషర్ మ్యాచ్‌లోనే మావిని టెస్ట్ చేసి ఉండాల్సింది.

 కిషన్ వేస్ట్..

కిషన్ వేస్ట్..

సిరీస్ డిసైడర్‌లో పాండ్యా చేసిన మరో పెద్ద పొరపాటు ఇషాన్ కిషన్‌ను ఆడించడం. ఇటీవలి కాలంలో ఏమాత్రం ఫామ్ లేకుండా క్రీజులో కదలడానికే తంటాలు పడుతున్న ఆటగాడు కిషన్. అలాంటి వాడి బదులు పృథ్వీ షాను తీసుకోవాలని చాలా మంది డిమాండ్ చేశారు. కానీ పాండ్యా వీటిని పట్టించుకోలేదు. ఈ క్రమంలో కిషన్ కేవలం ఒక్క పరుగుకే అవుటయ్యాడు. ఇతనితోపాటు ఫినిషర్ రోల్‌లో ఇబ్బంది పడుతున్న దీపక్ హుడాకు కూడా విశ్రాంతి ఇచ్చేయాలని, అతని స్థానంలో జితేశ్ శర్మను ఆడించాలని కూడా డిమాండ్లు వచ్చాయి. కానీ పాండ్యా ఆ పని చేయలేదు. వీళ్లిద్దరూ ఈ మ్యాచ్‌లో చేసిందేం లేదు కూడా.

మాస్టర్ స్ట్రోక్ గిల్!

మాస్టర్ స్ట్రోక్ గిల్!

పాండ్యా ఈ మ్యాచ్‌లో వేసిన అతి గొప్ప మాస్టర్ స్ట్రోక్ ఏదైనా ఉందంటే? అది శుభ్‌మన్ గిల్‌కు మద్దతుగా నిలవడమే. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న గిల్.. టీ20ల్లో కూడా రాణిస్తాడని అందరికీ తెలుసు. కానీ అది ఎప్పుడనేది తెలియదు. ఈ ప్రశ్నకు కూడా గిల్ సమాధానం చెప్పేశాడు. అద్భుతమైన ఆటతీరుతో భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. తన సహజమైన ఆడేందుకు ప్రయత్నించాలని సలహా కూడా ఇచ్చాడట. దీంతో గిల్ రెచ్చిపోయాడు. అతని వల్లనే టీమిండియా భారీ స్కోరు చేసిన మాట మాత్రం వాస్తవం.

Story first published: Thursday, February 2, 2023, 7:40 [IST]
Other articles published on Feb 2, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X