న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'మ్యాచ్‌ని మలుపు తిప్పడానికి... పంత్‌కు అవకాశమివ్వాలి'

Harbhajan Singh wants Rishabh Pant in Indias ODI squad, backs MS Dhoni to return to his best

హైదరాబాద్: వన్డేల్లో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి సెలక్టర్లు అవకాశమివ్వాలని భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూచించాడు. సిడ్నీ వేదికగా నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ, ధోని మినహా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో టీమిండియా 34 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

భజ్జీ మాట్లాడుతూ

భజ్జీ మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో భజ్జీ మాట్లాడుతూ "ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ తరహాలో రిషబ్ పంత్ హిట్టింగ్ చేయగలడు. ఎంతలా అంటే ఒక ఓవర్‌లోనే ఆరు సిక్సర్లు కొట్టలేడుగానీ.. ఓ 30 బంతులు ఆడితే మాత్రం కనీసం ఆరు సిక్సర్లు కొట్టే సామర్థ్యం అతనిలో ఉంది. ఆ మాత్రం హిట్టింగ్ చాలదా? మ్యాచ్‌ని మలుపు తిప్పడానికి" అని అన్నాడు.

ఓ పవర్ హిట్టర్ అవసరం

ఓ పవర్ హిట్టర్ అవసరం

"ప్రస్తుతం భారత్ జట్టుకి ఓ పవర్ హిట్టర్ అవసరం ఉంది. ఆరంభంలోనే వేగంగా మూడు వికెట్లు చేజారిన తర్వాత.. లోయర్ ఆర్డర్‌లో పంత్ తరహా హిట్టర్‌ ఉంటే జట్టుకే మేలు జరుగుతుంది" అని హర్భజన్ సూచించాడు. 291 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టులో ధావన్ (0), కోహ్లీ (3), రాయుడు (0) విఫలమయ్యారు.

రోహిత్ సెంచరీ

రోహిత్ సెంచరీ

ఓపెనర్ రోహిత్ శర్మ (133) అద్భుత సెంచరీ నమోదు చేసినప్పటికీ, ధోని (51) హాఫ్ సెంచరీ రాణించినా .... చివర్లో రోహిత్‌కి సహకారం లభించకపోవడంతో భారత్ 254/9కే పరిమితమైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆస్ట్రేలియా ఆధిక్యంలో నిలిచింది. ఆసీస్‌ యువ పేసర్‌ రిచర్డ్‌సన్‌ (4/26) కెరీర్‌లో సంచలన ప్రదర్శన చేశాడు.

మంగళవారం రెండో వన్డే

మంగళవారం రెండో వన్డే

మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో మంగళవారం రెండో వన్డే జరగనుండగా, ఆ తర్వాత మెల్‌బోర్న్ వేదికగా శుక్రవారం మూడో వన్డే‌ జరగనుంది. అనంతరం జనవరి 23 నుంచి న్యూజిలాండ్‌ పర్యటనలో ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది.

Story first published: Sunday, January 13, 2019, 15:23 [IST]
Other articles published on Jan 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X