న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్ 2019: 15 మందితో కూడిన జట్టుని ప్రకటించిన హర్భజన్

Harbhajan Singh Picks His 15-Member Squad For World Cup | Oneindia Telugu
Harbhajan Singh picks his 15-member squad for World Cup; Interesting additions made

హైదరాబాద్: ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలక్టర్లు ఇప్పటికే వరల్డ్‌కప్ కోసం జట్టు ఎంపికపై కసరత్తులు ప్రారంభించగా... తాజాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 15 మందితో కూడిన జట్టుని ప్రకటించాడు.

<strong>India vs Australia: రోహిత్‌కు విశ్రాంతి: భారత్‌ జట్టులో కేఎల్ రాహుల్, రహానే?</strong>India vs Australia: రోహిత్‌కు విశ్రాంతి: భారత్‌ జట్టులో కేఎల్ రాహుల్, రహానే?

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల్లో నిలకడ ప్రదర్శన చేసిన జట్టునే హర్భజన్ సింగ్ ఎంపిక చేయడం విశేషం. భజ్జీ ఎంపిక చేసిన జట్టులో ఆశ్చర్యకరంగా ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజా పేర్లను చేర్చాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యాలకు అవకాశమిచ్చాడు.

ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా

ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా

ఇక, ప్రాబబుల్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా పేరును ప్రకటించిన భజ్జీ ఇందుకు ఓ బలమైన కారణం ఉందని చెప్పాడు. ఇంగ్లాండ్‌లో వాతావరణం చాలా వేడిగా, పొడిగా ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో రవీంద్ర జడేజా అయితే అటు బంతితోనూ, ఇటూ బ్యాట్‌తోనూ రాణించగలడని తెలిపాడు.

భజ్జీ మాట్లాడుతూ

భజ్జీ మాట్లాడుతూ

ఈ సందర్భంగా భజ్జీ మాట్లాడుతూ "2017 ఛాంపియన్స్ ట్రోఫీ గుర్తుండే ఉంటుంది. ఇంగ్లాండ్‌లో చాలా వేడి, పొడి వాతావరణం ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో జడేజా పనికొస్తాడు. ముఖ్యంగా ప్రత్యర్థి జట్టులో ఎక్కువ మంది కుడిచేతివాటం బ్యాట్స్‌మెన్ ఉంటే జడేజా అవసరం. జడేజాను ఆరో నంబర్‌లో, పాండ్యాను ఏడో నంబర్‌లో ఆడించాలి. అంతేకాదు జడేజా మంచి ఫీల్డర్ కూడా" అని అన్నాడు.

వరల్డ్‌కప్‌కు హర్భజన్ సింగ్ ఎంపిక చేసిన జట్టు:

వరల్డ్‌కప్‌కు హర్భజన్ సింగ్ ఎంపిక చేసిన జట్టు:

రోహిత్, ధావన్, కోహ్లి, రాయుడు, ధోనీ, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, షమి, కార్తీక్, ఉమేష్ యాదవ్, విజయ్ శంకర్. ప్రాబబుల్: రవీంద్ర జడేజా

Story first published: Tuesday, February 12, 2019, 17:54 [IST]
Other articles published on Feb 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X