న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

38వ పడిలోకి వరల్డ్‌కప్ హీరో: ట్విట్టర్‌లో శుభాకాంక్షల వెల్లువ!

Happy Birthday Gautam Gambhir: India’s World Cup hero turns 38

హైదరాబాద్: 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్‌ను టీమిండియా కైవసం చేసుకోవడంలో అతడి పాత్ర మురవలేనిది. ఈ రెండు పైనల్స్‌లోనూ అతడు అత్యధిక స్కోరు నమోదు చేశాడు. అతడు ఎవరో కాదు టీమిండియా మాజీ ఓపెనర్, ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న గౌతమ్ గంభీర్. సోమవారం గంభీర్ తన 38వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు.

2003లో వన్డే క్రికెట్‌ అరంగ్రేటం చేసిన గంభీర్ ముంబైలోని వాంఖడె వేదికగా శ్రీలంకతో జరిగిన 2011 వన్డే వరల్డ్‌కప్‌ పైనల్ మ్యాచ్‌లో కీలకపాత్ర పోషించాడు. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి ఓవర్‌లోనే ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన గంభీర్‌ 42వ ఓవర్‌ వరకు క్రీజులో నిలిచి లంక బౌలర్లను ఎదుర్కొన్నాడు.

<strong>BCCI President: 65 ఏళ్ల తర్వాత సౌరవ్ గంగూలీ అరుదైన ఘనత</strong>BCCI President: 65 ఏళ్ల తర్వాత సౌరవ్ గంగూలీ అరుదైన ఘనత

97 పరుగుల వ్యక్తిగత స్కోరు ఔట్

97 పరుగుల వ్యక్తిగత స్కోరు ఔట్

ఒకవైపు తన సహచక క్రికెటర్లు వెనుదిరుగుతున్నా గంభీర్ మాత్రం నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెరెరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. టీమిండియా

విజయానికి 52 బంతుల్లో 52 పరుగుల కావాల్సిన సమయంలో యువీతో కలిసి ధోనీ (91 నాటౌట్) జట్టుకు విజయాన్ని అందించాడు.

13 టెస్టుల్లో 8 సెంచరీలు

13 టెస్టుల్లో 8 సెంచరీలు

ఇక, టెస్టుల్లో సైతం గంభీర్ రికార్డు బాగానే ఉంది. 2008 జులై నుంచి 2010 జనవరి మధ్య కాలంలో తాను ఆడిన 13 టెస్టుల్లో 8 సెంచరీలు సాధించాడు. 2009లో ఐసీసీ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. 2009లో నేపియర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో గంభీర్ ఇన్నింగ్స్ ఇప్పటికీ ప్రతి క్రికెట్ అభిమానికీ గుర్తే.

నేపియర్ టెస్టులో 10 గంటల 43 నిమిషాల పాటు క్రీజులో

నేపియర్ టెస్టులో 10 గంటల 43 నిమిషాల పాటు క్రీజులో

ఆ మ్యాచ్‌లో 137 పరుగులు చేసిన గంభీర్ మొత్తం 10 గంటల 43 నిమిషాల పాటు క్రీజులో నిలిచి టీమిండియాను ఓటమి నుంచి తప్పించాడు. 2011 వరల్డ్‌కప్ తర్వాత గంభీర్‌ పేలవ ప్రదర్శన చేయడంతో జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. అయితే 2012, 2014 ఐపీఎల్‌ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టుకు ట్రోఫీలను అందించాడు.

కోల్‌కతాకు రెండు టైటిళ్లు

కోల్‌కతాకు రెండు టైటిళ్లు

ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సారథ్యం వహించినప్పటికీ... ఆ జట్టు వరుస ఓటములకు బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగాడు. 2018 డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన గంభీర్ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీల చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

వరుసగా ఐదు సెంచరీలు

టెస్టుల్లో వరుసగా ఐదు సెంచరీలు సాధించిన ఏకైక భారత బ్యాట్స్ మెన్ గౌతమ్ గంభీరే. అలాంటి గంభీర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో వేదికగా పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Story first published: Monday, October 14, 2019, 15:55 [IST]
Other articles published on Oct 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X